రాబోయే రోజుల్లో మైనింగ్‌లో క్రిటికల్ మినరల్స్(అరుదైన ఖనిజాలు) రంగం కీలకంగా మారనుంది. ఇంధనం, ఎలక్ట్రానిక్స్, రవాణా, టెలికమ్యూనికేషన్స్, రక్షణ, అంతరిక్షం వంటి రంగాల్లో ముడిపదార్థాల సరఫరా అరుదైన ఖనిజాల నుంచే చేయాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ... ఆన్ స్క్రీన్ మూల్యాంకనం, ఓపెన్ బుక్ పరీక్ష విధానాలను అమలు చేస్తున్న సాంకేతిక విద్యాశాఖ మరో విప్లవాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.
ఆసుపత్రుల్లో రోగులకు ఔషధాలను సక్రమంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఈ-ఔషధి’ పథకాన్ని ఇథియోపియా దేశం నుంచి వచ్చిన ఉన్నతస్థాయి బృందం అధ్యయనం చేసింది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విత్తన చట్టం-2025 ముసాయిదా విధివిధానాలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
మక్కల విక్రయాలు సరిగా జరడం లేదని మక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. మక్కలను కొనుగోలు చేయడానికి సర్కార్ నిబంధనల పేరిట కొర్రీలు పెడుతున్నదని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై గుర�
ఫార్ములా-ఈ కేసులో మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అనుమతించారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు.
రాష్ట్రంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆయా దేశాల్లోని తెలంగాణ ప్రవాసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
సాగర్, శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణాన్ని ఈ నెల 22 నుంచి ప్రారంభిస్తున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ వాటర్ ఫ్లీట్ జనరల్ మేనేజర్ మాన్వీ గురువారం తెలిపారు.
తూకం వేసిన ధాన్యంలో మిల్లర్లు, నిర్వాహకులు కోత పెడుతున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరు రైతులు, మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నేత గుర్రం రాజలింగంగౌడ్ కొనుగోలు కేంద్రంలో గురువా రం ఆంద�
దేశంలో ఎక్కడా లేనివిధంగా రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, ఫలితంగా పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ తగ్గిందని, బహిరంగ మార్కెట్లోనూ ధరలు స్థిరపడ్డాయని మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను డిసెంబరు మూడోవారం కంటే ముందే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఈ నెల 25 లేదా 26 తేదీల్లో షెడ్యూలు ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది.
రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రోత్సాహకాలు ఇచ్చి సాగుకు అండగా నిలవాల్సింది పోయి ఉన్న పంట పొలాలను కూడా లాక్కునేందుకు ప్రభు త్వం చేస్తున్న ప్రయత్నాలతో అన్�
యూరప్ పర్యటనకు అనుమతి ఇస్తూ విధించిన షరతుల్లో భాగంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం హైదరాబాద్ సీబీఐ ప్రధాన కోర్టులో మందీమార్బలంతో హాజరయ్యారు.
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్‌కు సంబంధించి ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌పై హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీసుస్టేషన్లో 2023లో నమోదైన కేసును గురువారం హైకోర్టు కొట్టివేసింది.
నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన మావోయిస్టు (అప్పటి పీపుల్స్ వార్) ఉద్యమం తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతోంది. వరుస ఎన్కౌంటర్లు... లొంగుబాట్లతో సతమతమవుతున్న పార్టీలో అగ్రనేతలే ఉద్యమపథం వీడుతున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న బంజారా సామాజిక వర్గాన్ని ఎస్టీల్లోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ..మాజీ ఎంపీ రవీంద్రనాయక్ నేతృత్వంలో అఖిల భారతీయ బంజారా మహాసేవా సంఘ్ గురువారం దిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా నిర్వహించింది.
కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క.. రైతులనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సకాలంలో బోనస్ ఇవ్వాలని, పంట కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేసిన అన్నదాతలను.. ‘అసలు మీరు రైతులేనా?’ అంటూ అవహేళన చే
తెలంగాణలో గత ప్రభుత్వం ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేసు ఒక్క సీజన్‌కే హైదరాబాద్‌లో రూ.700 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిర్వాహకుల అ
ఎంతో మంది అత్యద్భుతమైన గొప్ప గొప్ప ఇంజినీర్లు, సైంటిస్టులను దేశానికి అందించిన విద్యావేత్త చుక్కా రామయ్య అని మాజీ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య 100వ జన్మదినోత్సవం సందర్భంగా గ�
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. గురువారం ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించి, ఓద�
నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు 5 నెలల నుంచి వేతనాలు రావడంలేదని గురువారం జిల్లా జనరల్ దవాఖాన ఎదుట ధర్నా నిర్వహించారు. మె�
వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో గురువారం జరిగింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లికి చెందిన బాలబోయిన మల్లయ్య(60) మండలంలోని �
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఫిజికల్ డైరెక్టర్ పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయని, వాటిపై ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించాలని రిజర్వేషన్స్ ప్రొటెక్షన్స్ స్ట్రగుల్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్య�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లో రెండురోజుల పర్యటనకు శుక్రవారం రానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆమెకు రాష్ట్ర గవర్నర్‌తో పాటు సీఎం, మంత్రులు,అధిక
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఈ నెల 28 నుంచి 30 వరకు అన్ని రాష్ర్టాల డీజీపీల సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అన్ని రాష్�
Sabarimala : కేరళలోని శబరిమలకు వెళ్లిన ఓ భక్తుడి జీవితం విషాదాంతమైంది. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన తెలంగాణలోని శంకర్‌పల్లికి చెందిన మల్లికార్జున్ రెడ్డి (Mallikharjun Reddy) గురువారం హఠాత్తుగా మరణించాడు.
TGSRTC Bus : ఇటీవల ప్రైవేట్ ట్రావెస్ బస్సులు, ఆర్టీసీ బస్సులు వరుసగా ప్రమాదాలకు గురవ్వడం ప్రయాణికుల్లో వణుకు పుట్టిస్తోంది. చేవెళ్ల బస్సు ప్రమాదాన్ని మరవకముందే మరొక ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులకు తృటిలో ప్రమ�
Osmania University ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Cold Wave రాష్ట్రంలో చలి గాలుల తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలను చలిగాలుల తీవ్రత వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపు నమోదవుతున్నాయి.
TG CPGET 2025 రాష్ట్రవ్యాప్తంగా ఎంఈడీ, ఎంపీఈడీ సీట్ల చివరి దశ భర్తీకి షెడ్యూల్ విడుదల చేసినట్లు టీజీ సీపీజీఈటీ-2025 కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
సమావేశాలు, వ్యాపార కార్యకలాపాల కోసం దేశవిదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారు... తమ పని ముగిశాక హోటల్ గదులకే పరిమితం కాకుండా రాష్ట్రాన్ని చుట్టివచ్చేలా పర్యాటకాభివృద్ధి సంస్థ యాత్రల ప్యాకేజీలను సిద్ధం చేసింది.
Harish Rao సిగాచి బాధితులకు ఇస్తామన్న కోటి పరిహారం హామీ ఏమైంది..? అని ప్రశ్నిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. నాలుగు నెలలు గడిచినా సిగాచి బాధితులకు పరిహారం అందకపోవ�
Minister Seethakka దేశానికి అన్నం పెట్టే అన్నదాతల పట్ల రాష్ట్ర మంత్రి సీతక్క దురుసుగా ప్రవర్తించారు. పంట కొనుగోలు చేయండని ప్రాధేయపడిన రైతులను ఉద్దేశించి వారు తాగుబోతులంటూ ఆమె అవమానించారు.
ఇంట్లో తలుపులు, కిటికీలు తెరిస్తే గాలి వెలుతురు ఎలా వస్తుందో... కంప్యూటర్ రంగంలోనూ ఓ కిటికీ తెరచుకొని... సరికొత్త వెలుగులకు శ్రీకారం చుట్టింది! అదే విండోస్!
MLC Pochampally ప్రజల తరఫున ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అక్రమ కేసులతో కట్టడి చేయాలని చూడడం మూర్ఖత్వమే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివ�
Karne Prabhaker రాష్ట్రంలో మీ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల్లో మీపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి, కేటీఆర్‌పై కక్ష సాదించటానికి ఈ బేకార్ కేసులు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ మాజీ ఎమ్�
కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ బస్సుల విధానంలో సంపూర్ణ మార్పులు చేసి ఆర్టీసీలకే బస్సుల కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్ కు అవకాశం కల్పించాలని, ఈ పథకం కోసం ఖర్చు చేస్తున్న డబ్బులు ఆర్టీసీలకే ఇవ్వాలన�
రాష్ట్ర పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సౌదీ అరెబీయాలో జరిగిన బస్సు ప్రమాదంలో (Saudi Bus Accident) మరణించిన వారి బంధువులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పరామర్శించారు. మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ (BRS) పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
Police Jobs పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
YS Jagan వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన మళ్లీ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస�
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్‌పై (KTR) అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను �
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతించారు. దీంతో కారు రేసు కేసులో కేటీఆర్‌పై చార్జ్‌షీట్ వేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి లభించ�
‘మంత్రుల భార్యలకు చీరలు పంపిస్తే వీళ్లే కట్టుకునేలా ఉన్నారు. మంత్రి సీతక్క.. మంత్రులు, ముఖ్యమంత్రి కుటుంబాలకు అదనంగా చీరలు ఇస్తామంటే నాకేం అభ్యంతరంలేదు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
MLA Prashanth Reddy బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కక్ష సాధింపు చర్యలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీని కట్టడి చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ �
Upasana Konidela: త్వరలో కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న విషయాన్ని ఉపాసన స్పష్టం చేసింది. ఎగ్ ఫ్రీజింగ్ వివాదంపై వివరణ ఇస్తూ ఆమె ఓ ట్వీట్ పోస్టు చేశారు. ఆ అంశంపై చర్చ జరగడం సంతోషకరమన్నారు.
భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ప్రాసిక్యూషన్‌కు తెలంగాణ గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెబుతుందని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు.
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను (KTR) ఏసీబీ విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించడంపై మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) స్పందించారు.
మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం నేపథ్యంలో జిల్లాల్లోని కలెక్టర్లు, జిల్లా మహిళా సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో సీఎం రేవంత్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే.
సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అడిక్‌మెట్‌లోని ఒకే కుటుంబంలో 18 మంది మరణించడం బాధాకరమని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు.
షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు అందించే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ (Pre Matric Scholarship) పురోగతిలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అత్యంత దారుణంగా ఉన్నది. లక్ష మందికి ఉపకార వేతనాలు (Scholarship) అందించాలని లక్ష్యం పెట్టుకొని ఇ
నాణ్యత లేదంటూ అధికారులు సోయా పంటను తిరస్కరిస్తున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామానికి చెందిన రైతు పోశెట్టి 20 క్వింటాళ్ల సోయాను అమ్మడానికి ఆదిలాబాద్ మార్కెట్ యార్డు కు తీసుకొచ్చాడు.
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సమక్షంలో పీసీసీ జాయింట్ సెక్రటరీ మందగడ్డ విమల్‌కుమార్ తన అనుచరులతో కలిసి బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరారు.
మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్‌రెడ్డిపై ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన సోషల్ మీడియా, వాట్సాప్ అకౌంట్స్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అప్పు తీసుకొని ఎగ్గొట్టాలనుకున్నవాడు వాయిదాలు పెడుతూపోతాడు. అప్పిచ్చినవాడు ఎడతెగని ఆ వాయిదాలకు విసిగి వేసారి ఇస్తావా లేదా అని గట్టిగడిగితే ‘నా వద్ద లేవయ్యా.. ఏం చేసుకుంటావో చేస్కో!’ అని మొండికేస్తాడు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో అమెరికా కాన్సుల్ జనరల్ భేటీ అయ్యారు. యూఎస్ కాన్సుల్ జనరల్‌గా కొత్తగా నియమితులైన లారా విలియమ్స్ బుధవారం హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.
బీఆర్ఎస్ చౌటుప్పల్ మండల అధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌గౌడ్ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ బుధవారం ఆందోళన చేపట్టారు.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తాళ్లధర్మారంలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మంగళవారం గ్రామంలో పర్యటించారు.
రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ఆటోడ్రైవర్లు కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ఆటోడ్రైవర్లకు పార్టీ తరఫున రూ.5లక్షల బీమా చేయిస్తానని, పాలసీ ప్రీమియం తానే చెల్లిస్తానంటూ ఇటీవల సిరిసిల్లలో �
‘పట్టుదల, సంకల్ప బలం ముందు కష్టాలన్నీ ఓడిపోతాయి. ఆ విషయం అమృత్, ఉదయ్ జీవితాల ద్వారా స్పష్టమైంది. మామూలు స్థితి నుంచి ఉన్నతంగా ఎదిగిన వీరిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
దేవాదాయశాఖ పరిస్థితి అయోమయంగా ఉన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండేళ్ల నుంచి విధానపరమైన నిర్ణయాల్లో అనిశ్చితి నెలకొన్నది. 22 నెలల్లో ఆరుగురు అధికారులు మారడం, అదికూడా పట్టుమని ఏడాదికి మించి ఎవరూ ఉండని కా�
ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగం వ్యవహారం పురోగతి కనిపించడం లేదు. ఓ వైపు టెండర్లు పిలిచి ఏడాది గడుస్తున్నా బిడ్లు తెరవకపోగా, మారిన ప్రణాళికలకు అనుగుణంగా నిధులు విడుదల చేయలేదు
‘ప్రభుత్వం ఫీల్ అయినా.. కాంగ్రెస్ నాయకులు బాధపడినా సరే.. కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో సౌకర్యాలు సరిగ్గా లేవు.. వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణర�
పేదింటి బిడ్డలకు పెళ్లి సమయంలో ఆసరాగా నిలిచేలా.. పెళ్లి పెద్దగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన కల్యాణలక్ష్మి పథకం కాంగ్రెస్ పాలనలో అభాసుపాలవుతున్నది.
ఎకడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని, ఓడిన చోటే గెలిచి చూపిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్
కేంద్ర వ్యవసాయశాఖ అనుబంధ సంస్థ జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ వ్యవసాయ శిక్షణ సంస్థ సేంద్రియ, ప్రకృతి సేద్య పద్ధతులపై 3 నెలల సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నట్టు ఎన్ఐపీహెచ్ఎం డైరెక్టర్ జనరల్ �
వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగు, సాగునీటి కోసం చట్టసభల్లో, వీధుల్లో పోరాటాలు నిర్వహించి, శ్రీరాంసాగర్ రెండో దశ కాలువ నిర్మాణం ద్వారా తాగునీరు అందించేందుకు కృషిచేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భ�
అమెరికాలో ఏపీ మహిళ, ఆమె కుమారుడి హత్య కేసు మిస్టరీ వీడింది. 2017లో వీరు దారుణ హత్యకు గురికాగా, ఈ కేసులో నిందితుడిని ఎనిమిదేండ్ల తర్వాత ల్యాప్‌టాప్ ఆధారంగా అమెరికా పోలీసులు గుర్తించారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గ్రూప్-1 విషయంలో కమిషన్‌కు డివిజన్ బెంచ్‌లో కాస్త ఊరట లభించిందో లేదో వెనువెంటనే 2015 గ్రూప్-2 రూపంలో కొత్త చిక
రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 22వ తేదీన అల్పపీడనం ఏర్పడి, 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బంజారాహిల్స్‌లోని విరించి వైద్యశాల నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ కోసం జీహెచ్ఎంసీ జారీచేసిన భూసేకరణ నోటీసులను హైకోర్టు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల చిత్రహింసలతోనే అనారోగ్యానికి గురై తన కొడుకు చనిపోయాడని మృతు�
మావోయిస్టు నేత హిడ్మాది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని, రక్షణ కోసం లొంగిపోయే అవకాశాలు ఉన్న ఆయనతో సంప్రదింపులు జరుపకుండా ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సా
దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్నది. మంగళవారం ఏపీలోని అల్లూరి జిల్లాలో పీఎల్జీఏ చీఫ్ హిడ్మా, అతని భార్య మరో నలుగురు హతమవ్వగా, అది జరిగిన 24 గంటల్లోపే తాజాగా, ఆంధ్రా-ఒడిశా బోర్డర్ (ఏఓబీ)లో జర�
మొంథా తుపాన్ కారణంగా పంటలు దెబ్బతినడా న్ని తట్టుకోలేక ఓ రైతు ప్రాణం తీసుకున్నా డు. కండ్ల ముందే వరిచేనంతా నేలవాలడంతో ధైర్యం కోల్పోయి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా మంగళవారం రాత్రి మరణించాడు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, సీసీఐ కొత్త నిబంధనలతో పత్తి రైతులకు తీరనినష్టం జరుగుతున్నదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఓ కేసు విషయంలో జైలుకెళ్లి శవమై తిరిగి రావడంతో.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా అంత్యక్రియలు నిర్వహించకుండా ఆందోళన చేస్తున్నారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాల్ ఎలియాస్ సోనూ ఎలియాస్ అభయ్ పిలుపునిచ్చారు.
అన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య (జెరియాట్రిక్) సేవలు అందించాలని అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణిని పట్టించుకోవడం లేదని, రోజురోజుకీ అక్కడి పరిస్థితులు దిగజారుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శిగా నూతనంగా నియమితులై మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చిన సచిన్ సావంత్‌ను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
వసతులు లేని ఆసుపత్రులతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి ఆసుపత్రులెందుకని నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పార్టీపరంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామనడం కుట్రని, వీటిపై సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు వంతపాడుతున్నారని తెలంగాణ బీసీ సంఘాల ఐకాస కార్యనిర్వాహక అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు.
ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్‌కు ఓటుతోనే బుద్ధి చెబుతామని తెలంగాణ మాల సంఘాల జేఏసీ ఛైర్మన్ భాస్కర్, గౌరవ ఛైర్మన్ రాంచందర్, గ్రేటర్ అధ్యక్షుడు బాలకిషన్ హెచ్చరించారు.
పునరుత్పాదక ఇంధన రంగంలో విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఎన్టీపీసీ అనుబంధ కంపెనీ అయిన ఎన్టీపీసీ గ్రీన్ఎనర్జీ లిమిటెడ్(ఎన్జీఈఎల్)తో సింగరేణి సంస్థ కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
ఉమ్రా యాత్రకు వెళ్లి బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు గుర్తించే ప్రక్రియ, డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ తెలిపారు.
రాష్ట్రంలో వచ్చే అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8వ తేదీ) నాటికి కొత్త మహిళా విధానాన్ని తీసుకువస్తామని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు.