సూచిక 
ప్రముఖ మాధ్యమాల నుండి వార్తలు, పూర్తి వార్తల కోసం క్లిక్ చేయండి.ఒడిశా

గజపతి జిల్లాలో అక్రమ గంజాయి రవాణాను అరికట్టేందుకు పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

బ్రహ్మపుర సదర్ ఠాణా పరిధిలోని రెండు వేర్వేరు చోరీ కేసుల్లో పోలీసులు మొత్తం ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేసి ఆదివారం న్యాయస్థానానికి తరలించారు.

అమాయక గిరిజనులపై ఒడిశా ప్రభుత్వం దౌర్జన్యం ఆపాలని ఆంధ్ర ఆదివాసి గిరిజన సంఘం నేతలు డిమాండ్ చేశారు.

గంజాం జిల్లా నిమ్మఖండి ఠాణా పరిధిలోని ఫుల్టా గ్రామంలో శనివారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వస్తున్న అదే గ్రామానికి చెందిన ఇద్దరిపై ఐదారుగురు మారణాయుధం, కర్రతో దాడి చేశారు.

కొరాపుట్‌కు చెందిన వ్యాపారి సంతోష్‌కు సంబంధించిన నకిలీ గుట్కా తయారీ పరిశ్రమలో ఆదివారం జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు.

● అమ్మవారి జాతర కరపత్రాలు విడుదల చేసిన ఎమ్మెల్యే వెంకటరావుచీపురుపల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వం తరఫున జరిగే ఎలాంటి కార్యక్రమాల్లోనూ, ప్రారంభోత్సవాల్లోనూ ప్రజాప్రతినిధులు పాల్గొనరాదని కోడ్ నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎంతో సీనియారిటీ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు కోడ్ ఉల్లంఘించారనే చర్చ పట్టణంలో జరుగుతోంది. శనివారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర తేదీలు వెల్లడిస్తూ, కరపత్రాలు విడుదల చేయడం కోడ్ ఉల్లంఘనలోకి వస్తుందని రాజకీయ పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వమే జాతర నిర్వహిస్తుందని సాక్షాత్తూ ఎమ్మెల్యే వెల్లడించడం కోడ్ ఉల్లంఘనే కదా? అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలని పలువురు చర్చించుకుంటున్నారు. కోడ్ అమల్లో ఉండడంతోనే కరపత్రాలు విడుదలకు దేవదాయశాఖ అధికారులు కూడా హాజరవ్వలేదని తెలుస్తోంది. కోడ్ అమల్లో ఉండడంతోనే జాతరకు ఉత్సవ కమిటీను కూడా నియమించలేదు. కరపత్రాలు విడుదల సమయంలో దేవదాయశాఖ అధికారులు లేకపోవడాన్ని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఈఓ బి.శ్రీనివాస్ వద్ద ప్రస్తావించగా కోడ్ అమల్లో ఉండడంతోనే హాజరవ్వలేకపోయానని తెలిపారు. జాతర తేదీలు వెల్లడించిన ఎమ్మెల్యే శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతరను మార్చి 2, 3, 4 తేదీల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు వెల్లడించారు. శనివారం ఆయన క్యాంప్ కార్యాలయంలో అమ్మవారి జాతర కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతీ ఏటా జరుగుతున్న సాంప్రదాయంలో భాగంగానే ఈ ఏడాది కూడా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 27వ వార్షిక జాతర మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. దేవదాయశాఖ, గ్రామ పెద్దలు, భక్తులు నేతృత్వంలో ప్రభుత్వం జాతరను నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. మూడు రోజులు జాతరలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు, గవిడి నాగరాజు, పైల బలరాం, రెడ్డి గోవింద్, సారేపాక సురేష్, పొట్నూరు త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు. Sun, Feb 9 2025 12:35 AM

గంజాం జిల్లా కళ్లికోట పోలీస్ స్టేషన్ పరిధిలోని నూతన గురుంఠి గ్రామంలో అత్తింట్లో అదనపు వరకట్న వేధింపులకు ఆరతి సాహు అనే వివాహిత బలైంది.

మల్కనగిరి: ఇద్దరు విద్యార్థినులు బలవన్మరణానికి పాల్పడ్డారు. చున్నీలతో చెట్టుకొమ్మకు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. జిల్లాలోని కలిమెల సమితి పరిధి ఎంపీవీ–41 గ్రామ సమీపంలోని చెట్టుకు వేలాడుతున్న వీరి మృతదేహాలను ఎం.వి.79 పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పొస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన విద్యార్థినులు ఎం.వి–72 నోడల్ ప్రాథమిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న మందిరా షొడి, జ్యోతి హిల్దార్లుగా గుర్తించారు. విద్యార్థినుల మృతదేహాలు ఎం.పి.వి.41 గ్రామం సమీపంలోని ఒక చెట్టుకు తమ చున్నీలతో ఉరివేసుకుని వేలాడుతూ ఉండటాన్ని అటువైపుగా వెళుతున్న కొందరు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెట్టు కొమ్మకు చున్నీలతో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్న వైనం Sun, Feb 9 2025 12:38 AM

జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో రాష్ట్ర విధానసభ ఎస్సీ, ఎస్టీ స్టీరింగ్ కమిటీ శుక్రవారం నుంచి పర్యటిస్తోంది. ఇందులో భాగంగా గుమ్మ గ్రామంలోని ఎస్ఎస్డీ ఉన్నత పాఠశాలను కమిటీ సభ్యులు సందర్శించారు. కమిటీ అధ్యక్షులు, డాబుగాం ఎమ్మెల్యే మనోహర రొంధారి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి.. సమాధానాలు రాబట్టారు. వారిచే పాఠ్య పుస్తకాలను చదివించి ప్రతిభను గమనించారు. వివిధ సబ్జెక్టలపై ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పమన్నారు. అయితే సరైన జవాబులు చెప్పలేక పోవటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. సక్రమంగా పాఠాలు చేప్పటంలేదని కమిటీ అభిప్రాయ పడింది. ఉపాధ్యాయులకు సంజాయిషీ నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. రెండు నెలల తరువాత కమిటీ మరోసారి పాఠశాలను సందర్శిస్తోందని అధ్యక్షులు రొంధారి చెప్పారు. అప్పటికీ విద్యాబోధనలో ప్రగతి లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కమిటీలో నవరంగపూర్, కొట్‌పాడ్, కొరాపుట్, మల్కన్‌గిరి, మోహణ ఎమ్మెల్యేలు గౌరీ శంకర మఝి, రూపు భొత్ర, రఘునాథ్ మచ్చ, దాసరథి గొమాంగో, రఘునాఽథ్ మడకామి ఉన్నారు Sun, Feb 9 2025 12:38 AM

రాయగడ: జిల్లాలోని కాశీపూర్ సమితి గొరఖ్‌పూర్ పంచాయతీ కార్యాలయాన్ని కన్హుగుడ గ్రామస్తులు ఘెరావ్ చేశారు. గత కొద్ది నెలలుగా పీడీఎస్ బియ్యంతో పాటు ప్రభుత్వం మంజూరు చేస్తున్న రాగులను ఇవ్వకపోవడంతో వాటిని ఇచ్చేంత వరకు కార్యాలయం మూసివేయాలని ఆందోళన చేపట్డారు. సమాచారం తెలుసుకున్న పౌరసరఫరాల శాఖ సమితి ఇన్స్పెక్టర్ ప్రశాంత్ దాస్, జిల్లా పౌరసరఫరాల శాఖ అదనపు అధికారి ఎస్.భొయ్లు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. రాగుల కొరత కారణంగా పీడీఎస్ బియ్యంతో పాటు వాటిని సరఫరా చేయలేకపోతున్నామని, త్వరలో ఎవరెవ్వరికి ఇవ్వలేదో వారిని గుర్తించి రాగులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించిన ఆదివాసీ మహిళలు పంచాయతీ కార్యాలయం నుంచి వెనుతిరిగారు. ఈ పంచాయతీ పరిధిలో 2070 మంది లబ్ధిదారులు ఉన్నారు. 2024 సెప్టెంబరు నెల నుంచి ప్రతి రేషన్ కార్డు దారునికి 35 కిలోల చొప్పున్న 1810 మందికి 633 క్వింటాళ్ల రాగులను పంపిణీ చేయడం జరిగిందని భొయ్ తెలియజేశారు. అయితే మిగతా 260 మంది లబ్ధిదారులకు కొద్ది నెలలుగా రాగులు పంపిణీ జరగలేదని త్వరలో వారికి కూడా రాగులు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. Sun, Feb 9 2025 12:38 AM

కొరాపుట్: సామాజిక కార్యకర్త కాధంబని త్రిపాఠికి హనరింగ్ పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని శిల్పారామంలో శనివారం జరిగిన ఒడిశా ఫుడ్ ఆండ్ క్రాఫ్ట్ మేళా–2025లో ఈ పురస్కారం అందజేశారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రానికి చెందిన కాధంబని త్రిప్రాఠి మహిళల హక్కుల కోసం పోరాడుతూ మాఘరో మహిళా స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. మహిళల హక్కుల కోసం ఉద్యమాలు నిర్వహించారు. సామాజిక న్యా యం కోసం ఓడిశాలో పోరాడుతున్నందుకు హనరింగ్ ఎక్స్లెన్సి అవార్డు అందజేశారు.కస్తూరీ నగర్లో చోరీ రాయగడ: స్థానిక కస్తూరీ నగర్ 11వ లైన్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. ఇంటిలో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంటిలో చొరబడి ఇంటిలో గల బీరువాలను విరగ్గొట్టి అందులో గల 30 గ్రాముల బంగారు ఆభరణాలు, 300 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు రూ.70 వేల నగదును దొంగిలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. కస్తూరీ నగర్ 11వ లైన్లో నివసిస్తున్న అమూల్య చంద్ర సాహు అనే వ్యక్తి తన కుటుంబంతో కలసి కుంభమేళాకు వెళ్లారు. ఇది గమనించిన దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటి మొదటి అంతస్తులో నివసిస్తున్న జగత్ జ్యోతి సాహు ఆరోగ్య రీత్యా వైద్యపరీక్షలను నిర్వహించుకునేందుకు శ్రీకాకుళం వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగుల ఇంటిలో గల 40 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు చోరీ చేశారు. పదో లైన్లో.. గత కొద్ది రోజులుగా ఇంటికి తాళం వేసి ఉన్న గీతాంజలి పాత్రో కుటుంబీకులు షిర్డీ యాత్రకు వెళ్లారు. ఇంటిలో ఎవరూ లేకపొవడంతో ఇంటిలొ గల 100 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఆమె బంధువులు పొలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒకే రోజు మూడు దొంగతనాలు చోటు చేసుకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనల్ని వ్యక్తం చేస్తున్నారు. వరుస చోరీ ఘటనలు స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. Sun, Feb 9 2025 12:38 AM

పర్లాకిమిడి: గజపతి జిల్లా అడవ పీఎస్ పరిధి గులుబ పంచాయతీలో కప్పిలి, కజ్జు ఏజెన్సీలో అక్రమంగా పండిస్తున్న పదకొండు ఎకరాల్లోని గంజాయి పంటను పోలీసులు, ఎకై ్సజు శాఖ బృందం గాలించి ధ్వంసం చేశారు. రాత్రి అందిన సమాచారం మేరకు గులుబ పంచాయతీలోని కప్పిలి ఏజెన్సీలో 22వేల గంజాయి మొక్కలను నాశనం చేశారు. వీటి విలువ మార్కెట్లో రూ. 2 కోట్లు ఉంటుందని మోహన పోలీసు అధికారి బసంత్ కుమార్ శెఠి తెలియజేశారు. ఎస్పీ జితేంద్ర కుమార్ పండా ఆదేశాల మేరకు గత రెండు నెలలుగా క్లీన్, గ్రీన్ గజపతి ఆపరేషన్‌లో భాగంగా పలు చోట్ల గంజాయి సాగును అరికడుతున్నారు. Sun, Feb 9 2025 12:38 AM

కొరాపుట్: రెండవ పూరీగా పిలవబడుతున్న కొరాపుట్ శబరి శ్రీ క్షేత్రం సర్వసభ్య సమావేశాన్ని కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ మ్యూజియంలో జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత, పొట్టంగి ఎమ్మెల్యే రాంచంద్ర ఖడం మాట్లాడుతూ.. పలు సూచనలు చేశారు. సవరల సంస్కృతిని ప్రతింబింబించే శ్రీక్షేత్రం కమిటీలో గిరిజనులకు 50 శాతం అవకాశం కల్పించాలని కోరారు. సమావేశంలో జయపూర్, కొరాపుట్ ఎమ్మెల్యేలు తారా ప్రసాద్ భాహీనిపతి, రఘురాం మచ్చో పాల్గొన్నారు.గుమ్మ ఘాటి వద్ద లారీ బోల్తా రాయగడ: పొకేలి నుంచి జేకేపూర్‌కు కర్రల లోడుతో వస్తున్న ఒక లారీ సదరు సమితి గుమ్మ ఘాటీ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. శనివారం నాడు చోటు చేసుకున్న ఈ ఘటనలో లారీ డ్రైవరు స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థిఽతిని సమీక్షించారు. ఆటో బోల్తా ●● ఆరుగురికి తీవ్రగాయాలుజయపురం: జయపురం సమితి బొయిపరిగుడ సమితి బదావటాల్ గ్రామ సమీపంలో గల సిందిముండి మందిర ప్రాంతంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బొయిపరిగుడ సమితి కాటపొడ పంచాయతీ ధనివలస గ్రామం నుంచి 8 మందితో శనివారం దసమంతపూర్ వారపు సంతకు వెళ్తున్నారు. బదావటాల్ గ్రామ సమీపంలో సిందిముండ మందిర ప్రాంతంలో ఆటో అదుపుతప్పి రోడ్డుపై నుంచి పక్కన ఉన్న అడవిలోనికి జారిపోయింది. గాయపడిన వారిని బొయిపరిగుడ కమ్యూనిటీ హాస్పిటల్‌కు స్థాని కులు తరలించారు. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స చేసి ఇళ్లకు పంపినట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ బొయిపరిగుడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి జయపురం: రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి చెందారు. కుమార్తెను కళాశాలలో దింపేసి వస్తుండగా బైక్ ఢీకోవడంతో తీవ్రంగా గాయపడి మరిణించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ విషాద సంఘటన 26వ జాతీయ రహదారిలో శుక్రవారం చోటు చేసున్నట్లు పట్టణ పోలీసు అధికారి రమణీ రంజన్ దొలాయి శనివారం వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన బైకిస్టు భయంతో వాహనాన్ని వదిలేసి పరారైనట్టు పేర్కొన్నారు. పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని ప్రమాదానికి కారణమైన బైక్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరణించిన మహిళ స్థానిక కొత్తవీధికి చెందిన దొళమండప సాహి పద్మ సాహుగా గుర్తించారు. పద్మ సాహు కుమార్తె స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో చదువుతోంది. కుమార్తెను మధ్యాహ్నం కళాశాలలో విడిచి పద్మ ఇంటికి వెళ్తుండగా.. కళాశాలకు కొద్ది దూరంలో బైక్ వేగంగా వస్తూ ఆమెను ఢీకొట్టడంతో తీవ్రమైన గాయాలతో పడిపోయారు. కళాశాల విద్యార్థినులతోపాటు పద్మ కుమార్తె తల్లిని చూచి వెంటనే స్థానికుల సహకారంతో జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు కొరాపుట్‌లోని సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే కొరాపుట్ తీసుకెళ్తుండగా మార్గంలో బరిణిపుట్‌లోని ఓ ప్రైవేటులో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. బైకిస్టును అరెస్టు చేయాలని, పద్మ కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. Sun, Feb 9 2025 12:38 AM

స్వర్ణోత్సవ సంబరం జయపురంలోని భారత సాహితీ సంస్థ స్వర్ణోత్సవం ఘనంగా జరిగింది. ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. –8లోuఅభివృద్ధి పనులు ప్రారంభం పర్లాకిమిడి జగన్నాథ మందిరం అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. పనులు జోరుగా జరుగుతున్నాయి. –8లోuకటక్ బారాబటి స్టేడియంలో భారత్ జట్టు ఇంగ్లండుతో నేడు తలపడనుంది. శనివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు జట్టు ప్రాక్టీస్ చేసింది. ఆదివారం వన్డే మ్యాచ్ జరగనుంది. – భువనేశ్వర్శ్రీ మందిరం ఆదాయం లెక్కింపు నగదు : రూ. 6,28,537 బంగారం : 5 గ్రాముల 500 మిల్లీ గ్రాములు వెండి : 97 గ్రాముల 500 మిల్లీ గ్రాములు – భువనేశ్వర్/పూరీఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025న్యూస్‌రీల్ Sun, Feb 9 2025 12:38 AM

జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంద్ర సమితి కెరామటి గ్రామ సమీపం కొలాబ్ నదిలో ఒక నాటు పడవ శనివారం ఉదయం మునిగి పోయింది. అదృష్టవశాత్తు పడవలో పయనిస్తున్న వారందరూ ప్రాణాలతో బయట పడ్డారు. పడవ నదిలో మునిగిన సమయంలో నది ఒడ్డున ప్రజలు ఉండటంతో వారు వెంటనే స్పందించి అందరినీ రక్షించారు. ఆ పడవలో 20 మందికి పైగా ప్రజలు పయనిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. కొంతమంది వ్యక్తులు ఒక సామాజిక పనిపై కొలాబ్ నది కొసరజొడ ఘాట్ వద్దకు వెళ్లారు. ఒక పడవలో 20 మంది ఎక్కారు. పడవ నది మధ్యకు వెళ్లగా అకస్మాత్తుగా మునిగిపోయింది. నది ఒడ్డునున్న కొంతమంది యువకులు ప్రమాదాన్ని చూచి వెంటనే నదిలో దూకి నదిలో మునిగి పోతున్న వారిని ఒడ్డుకు తీసుకు రాగా ఈత వచ్చిన కొందరు ఒడ్డుకు చేరారు. వారిని రక్షించిన వారికి భజమన సాంత, ఉపేంధ్ర భొత్ర, సంజయ, సంజిత, అమర భొత్ర, కై ళాస హరిజన్, గుప్త హరిజన్ తదితరులు సహకరించారు. ఈ పడవను గత నవంబర్ 14న కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్స ప్రారంభించారని, కానీ అప్పుడే పాడైపోయిందని తెలిపారు. ఈ నదిపై వంతెన నిర్మించేందుకు 16 కోట్లు మంజూరు చేసినా వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టలేదని ఆరోపిస్తున్నారు. నదిలో పడవ ప్రయాణం ప్రాణాంతకంగా ఉందని అంటున్నారు. ప్రయాణికులు క్షేమం Sun, Feb 9 2025 12:37 AM
పర్లాకిమిడి: భీష్మ ఏకాదఽశి పర్వదినం పురస్కరించుకుని రంగిరీజు వీధిలో ఉన్న శ్రీవేంకటేశ్వర దేవాలయంలో ఉదయం పంచామృత అభిషేకాలు, స్వామి వారి తిరువీధి ఉత్సవం, మండపారాధనలు, విశేష హోమాలు జరిగాయి. తిరువీధి ఉత్సవంలో భధ్రం చక్రధర్ పాల్గొన్నారు. అలాగే శ్రీజగన్నాథ స్వామి ఆలయంలో శంఖచక్రధారి శ్రీ మహావిష్ణువు అవతారంలో జగన్నాథ, బలరామ స్వాములకు ప్రత్యేక అలంకరణలు చేశారు. గొల్ల ఖంజావీధిలో శ్రీత్రినాధస్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా 24 గంటలపాటు భజన కార్యక్రమం నిర్వహించారు. రాయగడలో.. రాయగడ: భీష్మ ఏకాదశిని పురష్కరించుకుని స్థానిక బాలాజీ నగర్లో గల కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో శనివారం విశేష పూజలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో స్వామికి సుప్రభాత సేవలు, అభిషేకాలతో పాటు సామూహిక రమా సత్యనారాయణ వ్రత పూజలు నిర్వహించారు. మహిళలు వ్రతాల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. Sun, Feb 9 2025 12:37 AM

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): బాధ్యత గల డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్న రఘురామ కృష్ణంరాజుకు దళితులంటే చులకన భావమని దళిత సంఘాల జేఏసీ నేతలు మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో చెరువుల ఆక్రమణ తొలగించడంతో నిరాశ్రయులైన దళితులు, బడుగు బలహీన వర్గాల వారిని పరామర్శించేందుకు ఎయిమ్ నాయకులు వెళ్లగా.. విద్వేషాలను రెచ్చగొట్టేందుకు వచ్చారని రఘురామకృష్ణంరాజు తప్పుడు ప్రచారాలు చేయడాన్ని వారు ఖండించారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేటు హాల్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షుడు కళ్లేపల్లి రామ్‌గోపాల్, జిల్లా అధ్యక్షుడు కంఠ వేణు, జేఏసీ నాయకులు యజ్జల గురుమూర్తి, ఒంపూరు రమేష్ తదితరులు మాట్లాడారు. ఆకివీడులో బాధితులను పరామర్శించేందుకు ఎయిమ్ స్టిక్కర్లు ఉన్న వాహనంలో దళిత నేతలు వెళ్లడం నేరమెలా అవుతుందని ప్రశ్నించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి.సునీల్‌కుమార్‌పై అనవసర వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విషయాన్ని సునీల్‌కుమార్‌కు ఆపాదించడం అలవాటైపోయిందని ధ్వజమెత్తారు. దళితుల అభ్యున్నతి కృషి చేస్తున్న సునీల్‌కుమార్‌పై ఎందుకంత అక్కసని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, ఎన్డీఏ ప్రభుత్వం అండదండలున్నాయని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. గతంలో అంబేడ్కర్ ఫ్లెక్సీని చించివేసినప్పుడు రఘురామకృష్ణంరాజుపై చట్టప్రకారం చర్యలు తీసుకోకుండా వదిలేశారని గుర్తు చేశారు. సమావేశంలో కొర్రాయి ప్రసాద్, పురుషోత్తం రాంబాబు, అబ్బాస్, లింగాల దిలీప్, పెయ్యల చంటి తదితరులు పాల్గొన్నారు. Sun, Feb 9 2025 12:37 AM

పర్లాకిమిడి: పట్టణంలో రాజవీధి జగన్నాథ మందిరం పరిసరాల్లో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి శనివారం ప్రారంభించారు. జగన్నాథ మందిరం వెలుపల విద్యుత్ వెలుగులు, పార్కింగ్ తదతర అభివృద్ధి పనులు రూ.లక్షలతో పురపాలక సంఘం నిర్మించింది. ఈ కార్యక్రమంలో పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, మున్సిపాలిటీ కార్యనిర్వాహణ అధికారి గౌర చంద్ర పట్నాయక్, వైస్ చైర్మన్ లెంక మధు, ఆర్.ఎం.సి.ఎస్ అధ్యక్షుడు ఎస్.గజపతిరావు, బీజేడీ పట్టణ అధ్యక్షుడు సిత్తు మహాపాత్రో, తదితరులు పాల్గొన్నారు. Sun, Feb 9 2025 12:37 AM

రాయగడ: విద్యతోనే వికాసం సాధ్యపడుతుందని, అందుకు విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక అన్నారు. జిల్లాలోని బిసంకటక్‌లో గల మా మార్కమా ఉన్నత మాధ్యమిక పాఠశాల వార్షికోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే వారి భవిష్యత్ ఉజ్వలంగా మారేందుకు విద్యార్థులు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విద్యను అందించేందుకు ఎన్నో పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. వాటిని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. ఈ వార్షికోత్సవంలో బీడీఓ సదాశివ నాయక్, ఉపాధ్యక్షుడు దేవీ ప్రసాద్ పట్నాయక్, సర్పంచ్ నమిత కులసిక, తదితరులు హాజరయ్యారు. పాఠశాల నిర్వాహక కమిటీ అధ్యక్షుడు ఉమా శంకర్ నెమల్పూరి వార్షిక నివేదికను చదివి వినిపించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Sun, Feb 9 2025 12:37 AM

నరసన్నపేట: జిల్లా మిల్లర్ల సంఘం కోశాధికారిగా నరసన్నపేటకు చెందిన మిల్లర్ తంగుడు నాగేశ్వరరావు ఎంపికయ్యారు. ఇటీవలే జిల్లా సంఘ కార్యవర్గం ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిల్లర్ల సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. నాగేశ్వరరావును మిల్లర్లు తంగుడు జోగారావు, సీతారామరాజు తదితరులు అభినందించారు. చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం నరసన్నపేట: మండలంలోని ఉర్లాంలో బంగారం షాపులో చోరీ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. సీఐ జె.శ్రీనివాసరావు శనివారం కూడా షాపును పరిశీలించగా.. సీసీఎఫ్ సీఐ, ఇతర సిబ్బంది సమక్షంలో ఆధారాలు సేకరిస్తున్నారు. స్థానికులు మాత్రం దొంగలు కుర్చీలు అమ్మడానికి వచ్చిన వారిలా ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చోరీలో ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. వీరందరూ స్థానికంగానే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ముషిడిగట్టు వైపు నాలుగు సైకిళ్లపై శుక్రవారం ఉదయం వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘనంగా ఆదిత్యుని కల్యాణం అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణోత్సవం శనివారం ఘనంగా జరిగింది. భీష్మ ఏకాదశి సందర్భంగా ఉషా పద్మిని ఛాయా దేవేరులతో సూర్యనారాయణ స్వామి వారి కల్యాణమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అనివెట్టి మండపంలో ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణం జరిపించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, అర్చకులు ఇప్పిలి సాందీప్ శర్మ, ఈవో వై.భద్రాజీ, భక్తులు పాల్గొన్నారు. Sun, Feb 9 2025 12:37 AM

శ్రీకాకుళం న్యూకాలనీ: ఈ సీజన్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్టార్ క్రికెటర్ సింగుపురం దుర్గ నాగ వరప్రసాద్ మరోసారి అదరగొట్టే ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. వైఎస్సార్ కడప జిల్లాలోని వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ మైదానంలో బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న కల్నల్ సీకేనాయుడు అండర్–23 అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నీలో అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. హిమాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 148 బంతుల్లో 9 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 107 పరుగుల అజేయ సెంచరీతో రాణించి ఆంధ్రా జట్టు విజయంలో కీలకభూమిక పోషించాడు. ప్రస్తుతం ఆంధ్రా జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ఏసీఏ తన అధికారిక ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్‌మీడియాలో అభినందిస్తూ పోస్ట్చేసింది. ప్రసాద్ రాణింపు పట్ల జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు పీవైఎన్ శాస్త్రి, కార్యదర్శి హసన్‌రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ, డాక్టర్ ఎస్.రవికుమార్, ఆర్సీ రెడ్డి, సీనియర్ క్రికెటర్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇదే లెక్కన రాణిస్తే 2026 ఐపీఎల్‌తోపాటు రంజీలు, జాతీయ జట్టు సెలక్షన్ ట్రయల్స్‌కు ఎంపిక కావడం ఖాయమని జిల్లా క్రికెట్ సంఘ పెద్దలు భావిస్తున్నారు. జులమూరు కుర్రాడే.. జలుమూరులోని పోలీస్‌స్టేషన్ వీధిలో నివాసం ఉండే ఎస్డీఎన్వి ప్రసాద్ తండ్రి సింగుపురం ఉపేంద్ర కారు డ్రైవర్‌గా పనిచేస్తూ 2019లో అనారోగ్యంతో మరణించగా.. తల్లి సింగుపురం రేవతి జలుమూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఆఫీసు సబార్డినేట్‌గా పనిచేస్తున్నారు. ప్రసాద్ టెక్కలిలో ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం కంప్యూటర్స్ సెకెండియర్ చదువుతున్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్‌కు ఎంపికకావడమే తన క్ష్యమని.. అందులో రాణించి జాతీయ జట్టుకు ఎంపికకావడమే జీవితాశయమని ప్రసాద్ చెబుతున్నాడు. Sun, Feb 9 2025 12:37 AM

● ఘనంగా జరిగిన భారతీ సాహితీ, సంస్కృతి సమాజం 50 ఏళ్ల పండుగజయపురం: జయపురంలోని భారతీ సాహితీ, సంస్కృతి సమాజం ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలను అంగరంగ వైభవంగా శనివారం నిర్వహించారు. స్థానిక మణికంఠ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన వేడుకలకు బి.ఎస్.ఎన్.మూర్తి (డికెన్స్) విశాఖపట్నం వారు అధ్యక్షత వహించారు. విశాఖపట్నం, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భారతీ సాహిత్య సంస్కృతి అభిమానులు, సాహితీ వేత్తలు, రచయితలు, కవులు పాల్గొన్నార. ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ వ్యంగ చిత్రకారిణి జ్యోతిర్మయి కార్టూన్ల ప్రదర్శన అలరించింది. రచయిత, అనువాదకులు కె.వి.రమణ భారతీ సాహితీ, సంస్కృతి ప్రధాన లక్ష్యం తెలుగు భాషా సాహిత్యాల ప్రగతి, ఔత్సాహిక రచయితలను ప్రోత్సహించటమే ఉద్దేశమని నిర్వహకులు అన్నారు. భారతి కార్యదర్శి కూర్మారావు నివేదికను సమర్పించారు. ఉపాధ్యాయుడు మురళీ జయపురం చారిత్రిక ఘట్టాలను, జయపురం ప్రాధాన్యతను, రాజుల పరితను క్లుప్తంగా సభికులకు వివరించారు. అనంతరం సాహితీ కథనం స్వీయ కవితా పఠన కార్యక్రమం గరికపాటి సూర్యప్రభ,ఆరిక రాధాకృష్ణలు నిర్వహించారు. రచయిత స్వీయ కవితా పఠనాన్ని ‘ఎక్కడెక్కడో పిట్లులు ఎగురు కుంటూ వచ్చి’అన్న తన స్వీయ గీతాన్ని ఆలపించారు. Sun, Feb 9 2025 12:37 AM
భువనేశ్వర్: ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధ్యక్షతన శనివారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో 11 ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. వీటిలో బలహీన వర్గాల ప్రజల కోసం అంత్యోదయ గృహ పథకం ప్రధానమైనది. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల ప్రోత్సాహానికి మండల స్థాయిలో స్టేడియంల నిర్మాణం, ఏకీకృత పింఛన్ పథకం తదితర ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. అంత్యోదయ గృహ యోజన సమాజంలోని బలహీన వర్గాలకు గృహాలను అందించడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం అంత్యోదయ గృహ యోజన ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ పథకం కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాలలో 2,25,000 ఇళ్లను బీదలకు అందిస్తుంది. అర్హులకు పక్కా ఇల్లు ఈ పథకం కింద ప్రకృతి లేదా మానవ కృత్య విపత్తుల వల్ల ప్రభావితమైన కుటుంబాలు, వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కారణంగా నిర్వాసితులైన కుటుంబాలు, వికలాంగులను ప్రధాన ఆర్జకులుగా ఉన్న కుటుంబాలు, అటవీ హక్కుల చట్టం లబ్ధిదారులు, ప్రస్తుత గృహ పథకం నుంచి ప్రయోజనం పొందని అర్హులైన కుటుంబాలకు పక్కా ఇల్లు అందిస్తారు. లబ్ధిదారుడు 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకునేందుకు రూ. 1 లక్ష 20 వేలు ఆర్థిక సహాయం అందజేస్తారు. 3 ఏళ్ల లోపు ఈ పథకం కింద 2,25,000 కొత్త పక్కా గృహాలు మంజూరు కానున్నాయి. ఈ పథకానికి ప్రభుత్వం రూ.7,550 కోట్లు ఖర్చు చేస్తుంది. బోనస్ ప్రోత్సాహం అంతోదయ గృహ యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ), ప్రధాన మంత్రి జనజాత్ ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్ (పీఎం – జన్మన్), ఇతర ప్రభుత్వ గ్రామీణ గృహ నిర్మాణ పథకాల కింద మంజూరైన ఇళ్ల నిర్మాణం పనిని 4 నెలల్లో పూర్తి చేస్తే 20,000 రూపాయలు, 6 నెలల్లో పూర్తి చేస్తే 10,000 రూపాయలు బోనస్ అందుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో స్టేడియంలు క్రీడా మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 314 మండలాల్లో మండల స్థాయి స్టేడియాలను నిర్మిస్తారు. దీని కోసం ప్రతిపాదించిన పథకం ఆమోదం పొందడంతో గ్రామీణ ప్రాంతాల్లో 12 నుంచి 15 ఎకరాల స్థలంలో స్థలంలో స్టేడియాల నిర్మాణం చేపడతారు. ఈ స్టేడియంలో ఫుట్‌బాల్, క్రికెట్, అథ్లెటిక్స్, ఇతర క్రీడలకు సౌకర్యాలు ఉంటాయి. రాబోయే ఐదేళ్లలో ఈ పథకం వ్యయ ప్రణాళిక రూ. 4,124 కోట్లకు మంత్రి మండలి ఆమోదించడం విశేషం. ఏకీకృత పింఛన్ రాష్ట్రంలో ఏకీకృత ఫించను పథకాన్ని అమలు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఎన్పీఎస్ లోని అధికారులు ఈ విధానం కింద పింఛన్ పొందుతారు. ఈ పథకం పరిధిలో సమగ్రంగా 3,33,000 మంది అధికారులు ఉన్నారు. వీరి అభీష్టం మేరకు ఎన్పీఎస్ లేదా యూపీఎస్ వ్యవస్థలో కొనసాగేందుకు మంత్రి మండలి వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలోని ఆనకట్టల మరమ్మతు, మెరుగుదల కోసం ప్రతిపాదించిన రూ. 66,000 కోట్లు వ్యయ ప్రణాళికకు మంత్రి మండలి ఆమోదించింది. ఈ ఆమోదం మేరకు హిరాకుడ్ ఆనకట్ట మరమ్మతు, మెరుగుదలకు 3 ప్రాజెక్టులు చేపడతారు. ఈ ప్రాజెక్టుల పన్నులు రానున్న 6 సంవత్సరాలలో పూర్తవుతాయని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. రాష్ట్రంలోని సబార్డినేట్ జ్యుడీషియరీలో నియామక ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, అన్ని వర్గాల అభ్యర్థులకు నియామక అవకాశాలను కల్పించడానికి జ్యుడీషియల్ స్టాఫ్ సర్వీసెస్ (నియామక పద్ధతులు మరియు సేవా నిబంధనలు) – 2008ని సవరించడానికి చర్యలు తీసుకుంటారు. చాంద్‌బలి భారిపొడా ఖరస్రోత నదిపై ఉన్న పాత వంతెన దగ్గర అలీ, చాంద్బలిలను అనుసంధానపరిచే వంతెనను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ కేంద్రాపడాను భద్రక్తో కలిపే 9వ నంబరు జాతీయ రహదారి ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. కేంద్రాపడా జిల్లాలోని కటక్ – చాంద్‌బాలి రహదారిపై బ్రాహ్మణి నదిపై రెండవ వంతెన నిర్మించాలని నిర్ణయించారు. అదేవిధంగా ఝార్సుగుడ జిల్లా పూజారిపల్లి ఘాట్ వద్ద వంతెన నిర్మించడం ద్వారా ఝార్సుగుడ జిల్లాను బర్గఢ్ జిల్లాలోని జొరిముల్తో అనుసంధానించాలని నిర్ణయించారు. బీదల కోసం అంత్యోదయ గృహ యోజన ప్రతి మండలంలో స్టేడియంలు ఏకీకృత పింఛన్ పథకం Sun, Feb 9 2025 12:37 AM

శ్రీకాకుళం కల్చరల్: తిరుమల తిరుపతి దేవస్థానాలు, హిందూ ధర్మప్రచార పరిషత్ శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని భక్తి చైతన్య శోభాయాత్ర శనివారం ఘనంగా జరిగింది. ధర్మప్రచార పరిషత్ సూపరింటెండెంట్ క్రాంతికుమార్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ లలితామణి ఆధ్వర్యంలో పీఎన్ కాలనీలోని నారాయణ తిరుమల నుంచి ప్రారంభమైన ఈ యాత్ర గుజరాతిపేట, ఏడురోడ్ల కూడలి, కాకివీధి మీదుగా పాత శ్రీకాకుళంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం వరకు సాగింది. 25 కోలాట బృందాలు, 2 తప్పెటగుళ్ల బృందాలు, 2 కూచిపూడి బృందాలు, 20 తాళ భజన బృందాలు పాల్గొన్నాయి. తొలుత ఈ యాత్రను పరత్మానంద స్వామి, గణేష్ స్వామి ప్రారంభించారు.కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యులు వెయ్యి మందికి అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో నారాయణ తిరుమల అర్చకులు గురుగుబెల్లి శ్రీనివాసులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Sun, Feb 9 2025 12:36 AM

కవిటి: సమాజంలో పేదల జీవితాలకు సవాళ్లు విసురుతున్న సమస్యలు, పాశ్చాత్య పెడధోరణులే ఇతివృత్తాలుగా తెరకెక్కించిన జనరల్ బోగీలు, నిశ్శబ్ధమా నీ ఖరీదెంత? నాటికలు ఆద్యంతం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. గుంటూరు జిల్లా కొలకలూరుకు చెందిన సాయిఆర్ట్స్ బ్యానర్‌పై ప్రదర్శితమైన ‘జనరల్ బోగీలు’ నాటిక నేటి భారతీయ రైల్వే ప్రయాణీకుల కష్టాలకు సాక్షీభూతంగా నిలిచింది. అనంతరం ప్రదర్శితమైన నిశ్శబ్ధమా నీ ఖరీదెంత నాటిక? సైతం పాశ్చాత్య పెడధోరణిలో పెళ్లి చేసుకుని పిల్లలతో ఉన్న వ్యక్తులు వేరొక వ్యక్తితో సహజీవనం చేయడంపై ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఓ కేసులో ఇచ్చిన తీర్పు(498 ఏ ఐపీసీ)ను కొందరు పురుషులు, మహిళలు ఏవిధంగా దుర్వినియోగం చేస్తున్నారు అనే ఇతివృత్తంతో సాగింది. అంతకుముందు కళాపరిషత్ పోటీలను కళ్యాణీ గ్రూప్ సంస్థల అధినేత లోళ్ల రాజేష్, సర్పంచ్ బి.శ్రీరాంప్రసాద్, బి.లక్ష్మణమూర్తి జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు. Sun, Feb 9 2025 12:36 AM

ఆమదాలవలస : పట్టణంలోని పాలపోలమ్మ తల్లి ఆలయ ఆవరణలో శనివారం నిర్వహించిన ఉభయ రాష్ట్రాల నాటిక పోటీలు కళాప్రియులను ఆకట్టుకుంటున్నాయి. స్థానిక రంగస్థల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో రెండవ రోజు కార్యక్రమంలో సీనియర్ రంగస్థల కళాకారులు, కలియుగ నక్షత్రిక పద్మశ్రీ యడ్ల గోపాలంను కమిటీ అధ్యక్ష కార్యదర్శులు తమ్మినేని విద్యాసాగర్ ,పేడాడ ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి పురస్కారం అందించారు. అంతకుముందు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, బీజేపీ కన్వీనర్ పేడాడ సూరప్ప నాయుడు, మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీత, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు పాత్రుని పాపారావు, కాంగ్రెస్ ఇన్చార్జి సనపల అన్నాజీరావు, డాక్టర్ దానేటి శ్రీధర్, బొడ్డేపల్లి సురేష్ మాట్లాడుతూ నిర్వాహకులను అభినందించారు. రెండో రోజు ప్రదర్శనలో హైదరాబాద్ కళాకారులు ప్రదర్శించిన స్వేచ్ఛ, ఆంధ్ర కళాకారులు ప్రదర్శించిన మరో రెండు నాటికలు ఆకట్టుకున్నాయి. Sun, Feb 9 2025 12:36 AM

శ్రీకాకుళం రూరల్: నగరంలోని పెదపాడు రోడ్డులో శ్రీ విజయలక్ష్మీ మోటార్స్‌లో సుజుకీ యాక్సెస్–125 నూతన మోడల్ స్కూటీని శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ద్విచక్ర వాహనం మహిళలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడంతో పాటు హెల్మెట్ విధిగా ధరించాలన్నారు.షోరూం మేనేజర్ అంధవరపు లక్ష్మణరావు మాట్లాడుతూ ఐదు కలర్స్‌తో నూతన మోడల్ స్కూటీ వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో బహుజన నేత కంఠ వేణు, సోమేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సిరిపురం బాధ్యతల స్వీకరణ శ్రీకాకుళం న్యూకాలనీ: భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షునిగా సిరపురం తేజేశ్వరరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కోర్ కమిటీ సమక్షంలో మినిట్స్ బుక్‌లో సంతకం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శవ్వాన ఉమామహేశ్వరి, బిర్లంగి ఉమామహేశ్వరరావు, ఎంబీజీ నాయుడు, చల్లా వెంకటేశ్వరరావు, రాఘవరావు, దుర్గారావుగాంధి, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. సిక్కోలు మాస్టర్స్ అథ్లెట్స్ జోరు శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2025 పోటీల్లో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. అనంతపురం వేదికగా ఈ నెల 7 మొదలైన పోటీలు 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మార్చ్ఫాస్ట్లో జిల్లా క్రీడాకారులు ఆకట్టుకున్నారు. మొదటి రెండు రోజుల్లో త్రోస్, జంప్స్, రన్స్ విభాగాల్లో 20 పతకాలు సాధించినట్టు జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పాలకొండ అప్పారావు తెలిపారు. చైన్నెలో వలస కూలి మృతి సంతబొమ్మాళి: మండలంలోని మర్రిపాడు పంచాయతీ శెలగపేట గ్రామానికి చెందిన తామాడ సింహాచలం (54) అనే వలస కూలి శనివారం చైన్నెలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. జీవనోపాధి కోసం పైప్ లైనింగ్ వర్క్ చేస్తుండగా మట్టి జారిపడటంతో కింద కూరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. సింహాచలంకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రిమ్స్ హాస్టల్లో పాముల భయం శ్రీకాకుళం: రిమ్స్ వైద్య కళాశాల హాస్టల్ విద్యార్థులను పాముల భయం వెంటాడుతోంది. 20 రోజుల్లో రెండు సార్లు నాగుపాము రావడంతో వైద్య విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ మరుగుదొడ్లు అధ్వానంగా తయారయ్యాయని, అక్కడే పాములు సంచరిస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉండిపోవడం, చాలా గదులు అధ్వానంగా తయారువ్వడంతో విషసర్పాలు రెండో అంతస్తు వరకు వచ్చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కోనేరులో పడి మాజీ సైనికుడు మృతి కాశీబుగ్గ : పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న బ్రాహ్మణవీధి కోనేరులో పడి వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి గ్రామా నికి చెందిన సిగలపల్లి కోటేశ్వరరావు (42) అనే మాజీ సైనికుడు మృతి చెందారు. ఈయన కాశీబుగ్గ తిలక్‌నగర్‌లో నివాసముంటున్నారు. స్నానానికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వెతికారు. సాయంత్రానికి శవమై తేలడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కోటేశ్వరరావుకు తండ్రి మల్లేష్, తల్లి సరోజిని, భార్య నాగ, కుమారుడు అఖిల్ ఉన్నారు. Sun, Feb 9 2025 12:36 AM

విజయనగరం పూల్‌బాగ్ : డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించి సకాలంలో పోస్టులు భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని గురజాడ గ్రంథాలయం ఆవరణలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. కూటమి విజయంలో నిరుద్యోగులు కీలక పాత్ర వహించారన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మెగా డీఎస్సీ సంతకం చేశారని, నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. వెంటనే డీఎస్సీ ప్రకటించి సకాలంలో పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని కోరారు. సమావేశంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సతీష్, నిరుద్యోగులు పాల్గొన్నారు. Sun, Feb 9 2025 12:36 AM

నెల్లిమర్ల: ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రంలో యూటీఎఫ్ ముఖ్య కార్యకర్తల శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడల్ స్కూల్స్ ఏర్పాటు కోసం చేపడుతున్న కసరత్తులో చాలా పాఠశాలలు ఏకోపోధ్యాయ పాఠశాలలుగా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం పిల్లల సంఖ్య ఎక్కువ ఉన్నచోట మోడల్ ప్రైమరీ స్కూల్స్‌గా మార్చాలని.. మిగిలిన ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు 12వ పీఆర్సీ కమిషన్‌కు చైర్మన్‌ను నియమించాలన్నారు. పీడీఎఫ్ తరఫున ఎమ్మెల్సీ బరిలో ఉన్న కోరెడ్ల విజయగౌరిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, జేఏవీఆర్‌కే ఈశ్వరరావు, జిల్లా కార్యదర్శులు పతివాడ త్రినాథ్, మద్దిల రాజు, హరి మోహన్, తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు Sun, Feb 9 2025 12:36 AM

పార్వతీపురం టౌన్: కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలను, జీతాల చెల్లింపు ప్రక్రియను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జేఏసీ జిల్లా కన్వీనర్ బీవీ రమణ డిమాండ్ చేశారు. పార్వతీపురంలోని సుందరయ్య భవనంలో శనివారం జిల్లా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, డైలీ వేజ్, కంటింజెంట్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, కార్మికులకు నష్టం చేకూర్చే విధంగా అనేక నిర్ణయాలు చేస్తున్నదని విమర్శించారు. ప్రస్తుతం ఆప్కాస్ పద్ధతిలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు జరుపుతున్న నేపథ్యంలో ఈ విధానాన్ని మార్చి రాష్ట్రంలో ప్రస్తుతం పని చేస్తున్న 2.50 లక్షల కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, డైలీ వేజ్ ఉద్యోగుల భవితవ్యాన్ని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించి, వారి ద్వారా కొత్త నియామకాలు, జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయం చేసిందన్నారు. ఇదే జరిగితే రాష్ట్రంలోని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, డైలీ వెజ్ కంటెంజెంట్ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. సకాలంలో జీతాలు కూడా చెల్లించే పరిస్థితి ఉండదని, పీఎఫ్, ఈఎస్ఐ, కూడా అమలు చేయరని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఏజెన్సీలు రాజకీయ నిరుద్యోగ పునరావస కేంద్రాలుగా మారి ఉద్యోగులకు రాజకీయ వేధింపులు, తొలగింపులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఈ విధానానికి వ్యతిరేకంగా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఉద్యోగులు, కార్మికులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసీ కో చైర్మన్ బి.ఈశ్వరరావు, పోలినాయుడు, ఆనందరావు అభిరామ్, గణపతి, విజయనగరం జిల్లా జేఏసీ నాయకులు జి.అప్పలసూరి, సీఐటీయూ జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. Sun, Feb 9 2025 12:36 AM

● ఇక ఈ రోడ్డు పరిస్థితి చూడండి! రామభద్రపురం మండల కేంద్రంలోని పెదపల్లి వీధిలో దాదాపు 200 మీటర్ల రహదారిని నిర్మించేందుకు మంజూరైతే చేశారు. పండగ వెళ్లిపోయింది. ప్రజలూ వెళ్లిపోయారు. కానీ గుంతలు, దుర్గంధం మిగిలిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● ఈ చిత్రం చూశారా? ఇది బొబ్బిలి మండలం గోపాలరాయుడిపేట పంచాయతీ కేంద్రంలోని శ్మశానానికి వెళ్లే నడకదారి. దీనికి రోడ్డు వేయాల్సి ఉంది. కానీ పట్టించుకోలేదు. అవసరమున్న రహదారులు కాకుండా పెద్ద అవసరం లేని రహదారులను మాత్రం గుర్తించి వేస్తున్నారు. ● కాలువలు మాత్రమే నిర్మించిన ఈ రోడ్డు చింతాడ గ్రామంలోనిది. బిల్లులు రాకపోవడంతో సీసీ రోడ్డు నిర్మించలేదు. ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. Sun, Feb 9 2025 12:36 AM

విజయనగరం ఫోర్ట్: ఉత్తరాంధ్రలో అతి పెద్ద మాత, శిశు ఆస్పత్రి అయిన ఘోషాస్పత్రిలో సమస్యలు కొలువుదీరాయి. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందే గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులు, పిల్లలు అవస్థలు పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో ఎస్ఎన్సీయూ (నవజాత శిశువుల ప్రత్యేక సంరక్షణ కేంద్రం) ఉంది. నవజాత శిశువులకు చికిత్స అందించడానికి అవసరమైన పరికరాలు, ఆక్సిజన్, వెంటిలేటర్స్ ఉన్నప్పటకీ కేజీహెచ్‌కు శిశువులను రిఫర్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గర్భిణులను కూడా కేజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. కేజీహెచ్‌కు శిశువులను తరలిస్తున్న సమయంలో మార్గ మధ్యలో కొందరు, చికిత్స పొందుతూ మరి కొందరు మృత్యువాత పడుతున్నారు. ఆస్పత్రిలో పారిశుధ్య లోపం ఆస్పత్రిలో పారిశుధ్య లోపం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారిశుధ్య చర్యలు సక్రమంగా చేపట్టకపోవడం వల్ల దుర్వాసన వస్తున్నట్టు రోగులు చెబుతున్నారు. మాత, శిశువులకు సంబంధించిన ఆస్పత్రి కాబట్టి నిరంతరం ఆస్పత్రిని క్లీన్ చేయాల్సి ఉంది. కానీ ఆ విధంగా చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేడి నీళ్లు బయట కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఆస్పత్రిలో 2500 లీటర్ల సామర్థ్యం గల సోలార్ హీటర్లు ఉన్నాయి. అవి గత కొంత కాలంగా పని చేయడం లేదు. దీంతో వేడి నీళ్లు రావడం లేదు. వేడి నీళ్లను గర్భిణులు, బాలింతల బంధువులు ప్రైవేటు టీస్టాల్స్ వద్ద కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. బాటిల్ వేడి నీళ్లు రూ.20 చొప్పన కొనుగోలు చేస్తున్నారు. నిత్యం అధిక సంఖ్యలో.. ఆస్పత్రికి నిత్యం అధిక సంఖ్యలో రోగులు వస్తారు. 180 నుంచి 200 వరకు రోగులు ఆస్పత్రికి వస్తారు. వీరిలో గైనిక్ సంబంధిత సమస్యలతో వచ్చే వారు 30 నుంచి 40 మంది వరకు ఉన్నారు. గర్భిణులు, పిల్లలు 160 నుంచి 170 మంది వరకు ఉంటున్నారు. ఆస్పత్రిలో లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆస్పత్రిలో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో రెండు ఫ్లోర్లు ఉన్నాయి. లిఫ్ట్ లేక పోవడం వల్ల మెట్లుపై నుంచి వెళ్లాల్సి రావడంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.అత్యవసరం అయితేనే.. గర్భిణులను, నవజాత శిశువులను అత్యవసరం అయితేనే రిఫర్ చేయాలి. ఇక్కడ చికిత్స అందించే అవకాశం ఉన్నప్పటకీ రిఫర్ చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లిఫ్ట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. ఇతర సమస్యలు పరిష్కరానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. – డాక్టర్ ఎస్.అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ఘోషాస్పత్రి Sun, Feb 9 2025 12:35 AM