Gold Seized శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి బంగారాన్ని గుర్తించారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రుల కార్యాలయాల్లో ఫైళ్ల మాయంపై విచారణ వేగవంతం చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ ( DCP Srinivas ) తెలిపారు.
Hyderabad హైదరాబాద్ నగరంలో గత రెండు, మూడు రోజుల నుంచి ఎక్కడ చూసినా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఉదయం నుంచి మొదలుకుంటే రాత్రి వరకు పలు చోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి.
NCRB: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) సోమవారం ప్రచురించిన గణాంకాల ప్రకారం 2022లో మహిళలపై నేరాలు 4 శాతం పెరిగాయి. మహిళలపై మొత్తం నేరాల రేటు 65.4 శాతం ఉండగా, 75.9 శాతం మందిపై అభియోగాలు నమోదయ్యాయి.
పోలీసు శాఖలో గతంలో తమను ఇబ్బందులకు గురిచేసి.. అప్పటి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన వారిని.. అక్రమంగా బదిలీలపై ఉన్న వారిని టార్గెట్ చేస్తోంది కాంగ్రెస్ సర్కార్.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరామర్శించేందుకు ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి పరామర్శించారు.
మైలార్దేవ్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టాటా నగర్‌లోని ఓ ప్లాస్టిక్ గోదామ్‌లో మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు త్వరగా కోలుకుని శాసనసభకు రావాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు....
రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరింది. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి కొన్ని మౌలిక వసతుల ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మ్యానిఫెస్టోలో చేర్చింది. వాటిలో 63వ అంశంగా మెట్రోరైలు విస్తరణను పేర్కొంది.
చలి గాలులు, చల్లని వాతావరణంతో చంటి పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులతోపాటు ఆస్తమా, న్యుమోనియా కేసులు నమోదవుతున్నాయి. పిల్లల ఆసుపత్రి నిలోఫర్‌లో ఇప్పటికే 50 మంది వరకు చేరారు. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో చికిత్స కోసం ఎక్కువ మంది వస్తున్నారు.
పోగొట్టుకున్న, చోరీకి గురైన ఫోన్ల రికవరీలో రాజధాని పోలీసులు ప్రత్యేకత చాటుకుంటున్నారు. యజమానులకు తిరిగి అప్పగించడంలో రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలుస్తున్నారు.
ఆర్టీసీలో మహిళల ప్రయాణ జోరు కొనసాగుతోంది. ఆదివారం కూడా చాలామంది మహిళలు సిటీ బస్సుల్లో ప్రయాణించారు. సాధారణంగా మిగతా రోజులకు ఆదివారం సగానికి సగం ప్రయాణికులు తగ్గుతారని, ఈ వారం మాత్రం 40 నుంచి 50 శాతం మహిళల ఆక్యుపెన్సీతో ప్రయాణించాయని ఆర్టీసీ గ్రేటర్‌జోన్ అధికారులు అంచనా వేశారు.
నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైంది. గమ్యం చేరేందుకు వాహనదారులు నరకం చూస్తున్నారు. ప్రధాన రహదారుల్లో సిబ్బంది లేక ఉదయం, సాయంత్రం సమయాల్లో ట్రాఫిక్‌జాం అవుతోంది
ఇంద్రజాలం ద్వారా నగదు, బంగారాన్ని రెట్టింపు చేస్తానని మోసానికి పాల్పడిన యువకుడిని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ జలంధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన హరికృష్ణ(35) కొంతకాలం ఆంధ్రప్రదేశ్‌లోని స్టువర్ట్పురంలో ఇంద్రజాల విద్య నేర్చుకున్నాడు. బంగారం, నగదు రెట్టింపు చేస్తానని పలువురిని నమ్మించి మోసం చేశారు
పాఠశాలల స్థాయిలోనే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోత్సహించేందుకు ఇన్నోవేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. తొలిదశలో ఇవి ప్రభుత్వం ఆధ్వర్యంలో పరిశోధన సంస్థల్లో ఏర్పాటయ్యాయి. తర్వాత విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు విస్తరించా
నగరంలో మత్తు ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. బస్తీలు, కాలనీల్లో పోలీసు గస్తీ లోపాన్ని అనువుగా మలచుకుంటున్నారు. టీఎస్‌న్యాబ్, టాస్క్‌ఫోర్స్, ఎస్వోటీ వంటి ప్రత్యేక పోలీసు బృందాలు గుర్తిస్తే తప్ప గంజాయి విక్రేతలను గుర్తించలేకపోతున్నారు
కడుపు నిండా తిందామని హోటల్ లేదా రెస్టారెంటుకు వెళ్తే.. వడ్డించిన పదార్థంలో బల్లులు, బొద్దింకలు, ఇతర కీటకాలు దర్శనమిస్తున్న ఘటనలు ఇటీవల నగరవ్యాప్తంగా తరచు వెలుగు చూస్తున్నాయి
మహానగరంలో మాయగాడు తిరుగుతున్నాడు. తనకు తాను ఎన్ఆర్ఐనని చెప్పుకొంటూ, గుర్తుతెలియని వ్యక్తులు తనపై దాడిచేసి విదేశీ కరెన్సీ, సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లు దోచుకున్నారని ఠాణాలలో ఫిర్యాదు చేస్తూ పోలీసులనే బోల్తా కొట్టిస్తున్నాడు.
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతి సోమవారం నగరంలోని లక్డీకాపూల్ కలెక్టరేట్ సమావేశ మందిరం వేదికగా నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 11 నుంచి యథాతథంగా నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పాలన వికేంద్రీకరణ, ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఏర్పాటైన వార్డు కార్యాలయాలు మొక్కుబడిగా మారాయి. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో 70 శాతం ఆఫీసులు తెరచుకోవట్లేదు.
ప్రభుత్వ బడులు సర్వతోముఖాభివృద్ధి సాధించాలనే సదాశయంతో రాష్ట్ర కళాశాల విద్యాశాఖ అధికారులు ‘పిల్లల కోసం’ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా డిగ్రీ కళాశాల విద్యార్థులను ‘కమ్యూనిటీ వాలంటీర్లు’గా ఎంపిక చేస్తూ ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించేందుకు దృష్టి సారించాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ కోరారు.
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి పరిగిలో జరిగిన విజయోత్సవ సభలో పాల్గొని మాట్లాడారు. క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించాక ప్రజాభవన్‌గా మారుస్తున్నట్లు తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో ఫైళ్లు మాయం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి....
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయంపై సీపీఎంలో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. కాంగ్రెస్‌తో సర్దుబాటు...
తాను విదేశాల నుంచి వచ్చానని.. తనవద్ద నుంచి ఆటో డ్రైవర్లు విదేశీ కరెన్సీతో పాటు ఖరీదైన వస్తువులు చోరీ చేశారు.. అంటూ మధురానగర్ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చి బురిడీ కొట్టించాడో యువకుడు.
వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా గత మూడు నాలుగు రోజుల నుంచి వణికిస్తున్న చలి.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఈ చలి వల్ల వివిధ రకాల అనారోగ్యాలకు గ�
వచ్చే వేసవి ముగింపు నాటికల్లా నాలాల పూడికతీత పనులు పూర్తి చేయాలని బల్దియా నిర్ణయించింది. ఏటా సుమారు రూ. 45 కోట్ల ఖర్చుతో 884.15 కిలోమీటర్ల మేర నాలాల్లో పూడిక తొలగింపు పనులు చేపడుతున్నారు.
బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించి..విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ నేటి నుంచి వచ్చే నెల జనవరి 10 వరకు బడి బయట పిల్లల గుర్తింపు సర్వేను నిర్వహించనున్నది.
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను...
6 గ్యారెంటీల్లోని మిగతా వాటిని సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) వెంటనే అమలు చేయాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Thalasani Srinivas Yadav ) వ్యాఖ్యానించారు.