శతాబ్దాల చరిత్ర.. నల్గొండ నడిబొడ్డున ఉన్న సుప్రసిద్ధ ఆలయాల సమాహారం.. ఎన్నో ఔషధ వనమూలికలు.. వన్యప్రాణులకు నిలయమైన బ్రహ్మంగారి గుట్టపై సమస్యలు తిష్టవేశాయి.
ఆరు నెలలుగా పశు వైద్యశాలలకు ప్రభుత్వం నుంచి మందులు సరఫరా కాకపోవడంతో మూగజీవాల చికిత్సలకు పాడిరైతులు ఇబ్బందులు పడుతున్నారు. తప్పని పరిస్థితిలో ప్రైవేట్ దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల హాజరు మరింత కట్టుదిట్టం చేసేందుకు ముఖ గుర్తింపు హాజరు విధానం అమలు చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.
పట్టుదలతో చదివితే పోటీ పరీక్షల్లో విజయాలు సాధించవచ్చని నిరూపించింది పావని. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన పావని చదువులో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. తాజాగా విడుదలైన నీట్ రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో ఓపెన్ కేటగిరిలో 1292వ ర్యాంకు సాధించి ఔరా అనిపించింది.
స్వయం సహాయక బృందాల్లోని మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించేందుకు గత ఏడాది నుంచి ఉచిత బీమా పథకాన్ని అమలు చేస్తోంది.
మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. అర్హులైన సంఘాలకు బ్యాంకు రుణాలు, కొత్త వ్యాపారాల ఏర్పాటుకు ఆర్థిక సాయం, క్యాంటీన్ల ఏర్పాటు వంటివి చేస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతోంది.
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు పోషకాహార లోపమున్న పిల్లల ఆరోగ్యం మెరుగునకు దోహదపడుతున్నాయి. కేంద్రాల వద్ద మొక్కల పెంపకంతో పాటు వచ్చే వారం నుంచి పోషణ వాటికలు(పెరటి తోటల పెంపకం) అమలుకు చర్యలు తీసుకుంటున్నారు.
మనుషుల ఆరోగ్యాలతో దోమలు చెలగాటమాడుతున్నాయి. అయితే దోమల నివారణే ఏకైక మార్గంగా ప్రభుత్వం భావించి అనేక కార్యక్రమాలు చేపడుతూ మున్సిపాలిటీలు, పంచాయతీల్లో పెద్ద ఎత్తున ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేసింది.
రాష్ట్ర జాతీయ స్థాయి సగటుతో పోల్చితే యాదాద్రి భువనగిరి జిల్లాలో చదువులు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందనే విషయం తెలుస్తోంది. తరగతికి తగిన అభ్యసన సామర్థ్యాలు సాధించడంలో విద్యార్థులు కొంతమేర వెనకపడ్డారు.
కొంత మంది విద్యార్థులు చెడు వ్యసనాల వైపు పయనిస్తూ తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. గాడిన పెట్టేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నిస్తే వారికి ఎదురు తిరుగుతున్నారు.
ఉమ్మడి జిల్లాలోని పురపాలికలకు నిధులు రానున్నాయి. అత్యవసర పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రతి పురపాలికకు రూ.15 కోట్ల మేర నిధుల మంజూరుకు అంగీకరించింది.
రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఏసీ, స్లీపర్, జనరల్ బోగీల గురించి అవగాహన ఉండే ఉంటుంది. అయితే ఏసీలో 1ఏ, 2ఏ, 3ఏ తరగతులతో పాటు..వందేభారత్ రైళ్లలో ఈసీ, సీసీ వంటి తరగతులు ఉంటాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ప్రవేశ పెట్టిన బాలికా సంరక్షణ పథకం అమలుపై గందరగోళం నెలకొంది. నిబంధనల మేరకు దరఖాస్తు చేసి పేర్లు నమోదు చేసుకుని 20 ఏళ్లు పూర్తయిన తర్వాత డబ్బుల కోసం లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
డోర్నకల్‌లో గత నెల 18న మున్నేరు వాగులో ప్రమాదవశాత్తు మృతి చెందిన సూర్యాపేట జిల్లా బక్కయ్యగూడెం వాసి ఎర్రంశెట్టి సందీప్ (ట్రైన్ మేనేజర్) కుటుంబానికి రైల్వే పరంగా ఎలాంటి ప్రయోజనం అందలేదు.
విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకొని సంబంధిత అధికారులు గంజాయి నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు ఆదేశించారు. శుక్రవారం గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల నిర్మూలనకు అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై డీసీపీ అక్షాంశ్ యాదవ్‌తో కలిసి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
మాదిగల చిరకాల వాంఛ ఏబీసీడీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించి దానిని అమలు చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికి దక్కిందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. శుక్రవారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
విద్యార్థులకు నాణ్యమైన పౌష్ఠికాహారం అందించేందుకు ఉద్దేశించిన మధ్యాహ్నభోజన పథకం లక్ష్యం గాడితప్పింది. నాలుగు నెలల నుంచి బిల్లులు రాకపోవడంతో సక్రమంగా భోజనం వడ్డించలేకపోతున్నామని నిర్వాహకులు చెబుతుండగా, మెనూ సక్రమంగా అమలు చేయకుండా వండివారుస్తున్నారనే అంశం ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో వెల్లడైంది.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల పరిమితిపై ఉన్న సీలింగ్ తొలగించేందుకు ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని, అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.
గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి భూసేకరణ కసర త్తు తుది దశకు చేరింది. సము ద్ర మట్టానికి అత్యంత ఎత్తయి న ప్రాంతంగా, నదీజలాల సదుపాయం లేని కరువు నేల గా యాదాద్రి భువనగిరి జిల్లా కు పేరుంది. జిల్లాలో జలసిరు లు ప్రవహించేందుకు గత ప్రభుత్వం గోదావరి జలాల మళ్లింపునకు చర్యలు చేపట్టింది.