గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో విద్యుత్తు వాహనాల (ఈవీ) కొనుగోలుకు ప్రజలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఆశించిన స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈఎస్ఐ, పీఎఫ్ వసతి లేని అసంఘటిత కార్మికుల కోసం కేంద్రం బహుళ ప్రయోజనాలు కలిగించే కార్డులను అందిస్తోంది. దీన్ని పొందడం ఎంతో సులువైనా, అవగాహన లేక పొందలేకపోతుండటం గమనార్హం.
జిల్లాలోని పటాన్చెరు, లక్డారం, బ్యాతోల్, ఎర్దనూర్ గ్రామాల సరిహద్దుల్లో 150కి పైగా క్వారీలు, క్రషర్లున్నాయి. నిత్యం వందల ట్రిప్పుల కంకర, రాళ్లు, రాతిపొడిని లారీలు, టిప్పర్లలో తరలిస్తున్నారు.
దేశంలోని ఉన్నత ఉద్యోగాలు ఎక్కువగా డిగ్రీ అర్హతతోనే సాధించవచ్చు. కాస్త శ్రద్ధ పెడితే డిగ్రీ చదువుతున్న దశలోనే ఉద్యోగావకాశాలను సొంతం చేసుకోవచ్చు. ఇటీవలి కాలంలో గ్రూప్స్ ఉద్యోగాలు సాధించడం అందుకు నిదర్శనం.
విద్యుత్తు వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్తు అందించాలని ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగానే విద్యుత్తు అధికారులు ప్రజాబాట అనే కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు.