పూర్తిగా గిరిజన ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో పని చేసేందుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు మొగ్గు చూపడం లేదు. ఏళ్ల తరబడి ఈ సమస్య ఉండగా.. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలతో ఈ సమస్య మరింత ఎక్కువైంది
అభివృద్ధికి దూరమై.. కనీస సదుపాయాలు కరవై, కాలినడనక తప్ప మరో గత్యంతరం లేని గ్రామాలెన్నో ఈనాటికీ మన్యంలో ఉన్నాయి. అడవి మధ్యలో.. కొండలపైన విసిరేసినట్టుగా ఉండే గిరి గ్రామాల ప్రజలకు అనారోగ్యం వస్తేనో... ఆపద ఎదురైనప్పుడు వైద్యసేవలు అందడం చాలాకష్టం.
అరకులోయ- విశాఖపట్నం ఘాట్రోడ్లో సోమవారం సాయంత్రం భారీ వృక్షం నేలకూలింది. సుంకరమెట్ట కాఫీ తోటల వద్ద చెట్టు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గూడెంకొత్తవీధి జీసీసీ పెట్రోల్ బంక్‌లో ఇంధన విక్రయాలు పునరుద్ధరించారు. ఈ బంక్‌లో జనరేటర్ మరమ్మతులకు గురై విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో విక్రయాలు చేపట్టేందుకు వీలులేకుండా పోయింది.
తృణ ధాన్యాల సాగుకు ఇదే సరైన సమయం. జులై నెలాఖరు వరకు సాగు చేసుకోవచ్చని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏడీఆర్ డాక్టర్ సీహెచ్ ముకుందరావు సూచిస్తున్నారు.
ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రిగా పేరుగాంచిన కేజీహెచ్‌లో గడిచిన కొద్దిరోజులుగా గుండె శస్త్రచికిత్సలు జరగడం లేదు. ఆపరేషన్లు నిర్వహించేందుకు అవసరమైన కీలకమైన పరికరాలు పనిచేయకపోవడంతో సమస్య ఉత్పన్నమైనట్టు అధికారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) మే, జూన్ నెలల్లో పీఎం సూర్యఘర్ పథకం కింద ఐదు వేల సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటుచేసినట్టు సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు.
నియోజకవర్గ కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలికల ఉన్నత పాఠశాల ఆరేళ్లుగా అద్దె భవనంలోనే కొనసాగుతోంది. ఈ పాఠశాలకు స్థలం కేటాయించిన గత వైసీపీ ప్రభుత్వం నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడంతో విద్యార్థినులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
బదిలీల్లో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పైరవీలు చేస్తున్నారని విమర్శలు న్నాయి. తమకు కావలసిన చోట పోస్టింగ్ కోసం ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది.
పైనాపిల్ ధర పతనం కావడంతో గిరిజన రైతులు డీలా పడ్డారు. గత సోమవారం వారపు సంతలో పైనాపిల్ ఒక్కోటి రూ.30కి విక్రయించారు. ఈ సోమవారం ఒక్కోటి రూ.6కి విక్రయించాల్సి రావడంతో ఆవేదన చెందారు.
మునిసిపాలిటీలోని 1వ వార్డు సోమలింగపాలెం, 20 వ వార్డు పెదపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు లేకపోవడంతో నర్సులే రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. సుమారు ఎనిమిది నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
ప్రభుత్వ వసతి గృహంలో మెనూ సక్రమంగా అమలు చేయకపోవడంపై హోం మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి స్థానిక బీసీ బాలికల కాలేజి హాస్టల్‌ను ఆమె తనిఖీ చేశారు.
మన్యంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. సోమవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. పలు మండలాల్లో భారీ వృక్షాలు రహదారులపై పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సీలేరు కాంప్లెక్సు ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్‌గా కె.వెంకట రాజారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ గతంలో సీఈగా పని చేసిన ఎల్వీ స్వామినాయుడు గత నెలలో పదవీ విరమణ పొందారు.
వివిధ పథకాల్లో భాగంగా జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. ఐటీడీఏ పీవోలు, వివిధ ఇంజనీరింగ్ అధికారులతో సోమవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
అరకులోయ మండల పరిధిలోని యండపల్లివలస-అరకు మధ్య బురదగెడ్డ వంతెన ప్రమాదకరంగా మారింది. వంతెనకు ఒకవైపు అప్రోచ్‌రోడ్డుకు రంధ్రం పడింది. దాని కింద ఉన్న మట్టి కూడా కొట్టుకుపోయింది. దీంతో వంతెన వద్ద ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఇక్కడ మట్టి వేసినా గెడ్డలోకి జారిపోతుంది తప్ప నిలవడం లేదు.
గత మూడేళ్లుగా నిరీక్షిస్తున్న సమగ్ర శిక్ష అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మూడేళ్ల తరువాత ఈ-ఫైలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో 201 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరింది.
జిల్లాలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో రక్షిత తాగునీరు అందుబాటులో లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వైకాపా హయాంలో నాడు-నేడు పథకంలో కొన్ని పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు నెలకొల్పారు. మొదటి దశలో పనులపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యత కొరవడింది.
వార్డు సంక్షేమ కార్యదర్శుల బదిలీల కౌన్సెలింగ్ గందరగోళంగా మారింది. ఆదివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో యూసీడీ పథక సంచాలకులు పీఎం సత్యవేణి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది.
బుద్ధిమాంద్యం, మూగ, చెముడుతో పుట్టిన పిల్లలకు శిక్షణ ఇచ్చి సాధారణ జీవితం గడిపేలా కృషి చేస్తోంది పెదవాల్తేరులోని సన్‌ఫ్లవర్ ప్రత్యేక పాఠశాల. 40ఏళ్లుగా వేలాది మంది ప్రత్యేక పిల్లలను ఇక్కడ తీర్చిదిద్దారు.
భూముల రీసర్వే చిక్కుల నుంచి రైతులకు విముక్తి లభిస్తోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఫలితంగా అనేక మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యారు.
ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్) రెండో విడతగా చేపట్టిన భూసేకరణలో వీఆర్ అగ్రహారం గ్రామంలో ఉద్యాన పంటలకు పరిహారం చెల్లింపుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి.
జగన్ ప్రభుత్వం క్రీడా మైదానాలకూ వాణిజ్య విలువలు అద్దింది. ఆదాయార్జనే ధ్యేయంగా ఇండోర్ స్టేడియాలను లీజుకిచ్చింది. క్రీడాకారుల కోసం ఏర్పాటైన వీటిని అద్దె ప్రాతిపదికన కేటాయించడంతో ఆర్థికంగా బలంగా ఉన్న క్రీడాకారులే స్టేడియాలను ఉపయోగించుకుంటున్నారు.
ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఆగాలి.. ప్రయాణికుల కష్టాలు తీరాలి.. ఇదే నినాదంతో హాల్ట్ సాధించే వరకూ పట్టు వీడేది లేదని ప్రజాప్రతినిధులు, ప్రయాణికులు ఉద్యమ బాట పట్టనున్నారు.
సహజీవనం పేరిట ఒంటరి మహిళ నుంచి ఓ యువకుడు రూ.8 లక్షలు కొట్టేసిన ఘటన ఇది. దీనిపై బాధితురాలు.. సామాజిక కార్యకర్త, మహిళా హక్కుల సంఘం నాయకురాలు రెడ్డమ్మను ఆదివారం ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని తండ్రి తన కుమార్తెకు పుట్టిన మగ శిశువును కన్న తల్లికి తెలియకుండా వేరొకరికి దత్తత ఇచ్చిన ఘటన విశాఖలో చోటుచేసుకుంది.