ఇటీవల కాలంలో ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ (ఈఎంఐ) చెల్లింపులు యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇది సామాన్య కుటుంబాలను అప్పుల్లోకి నెట్టేస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు పుస్తకాలతో కుస్తీ పట్టనున్నారు. నిత్యం పాఠాలు బోధించి పరీక్షలు నిర్వహించే ఉపాధ్యాయులు ఇప్పుడు అర్హత పరీక్ష ఎదుర్కోబోతున్నారు.
జిల్లాలో ప్రతి మూడు రోజులకో దొంగతనం జరుగుతోంది. గడిచిన 3 నెలల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 36 దొంగతనాల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
ఊట్కూరు మండలం బిజ్వార్ నుంచి ధన్వాడ మండలం పాతపల్లి వరకు ఒక రోడ్డు, ఆయా మండలాల్లోని బిజ్వార్ నుంచి కొత్తపల్లి వరకు మరో రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
పురపాలికల్లో పట్టణ ప్రణాళిక అధికారులు లేక ఇన్ఛార్జులతో నెట్టుకొస్తున్నారు. నూతన గృహ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాల్సిన వీరు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
విరిగిన కిటికీల తలుపులు.. తలుపులు లేని బాత్రూమ్లు.. వెలగని లైట్లు.. పెచ్చులూడుతున్న పైకప్పులు ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలు ఇవి.. అసలే చలికాలం కావడంతో విరిగిన కిటికీలు, తలుపుల సందుల్లోంచి చల్ల గాలులు లోపలికి రావడంతో విద్యార్థులు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు.
: పాలమూరు యూనివర్సిటీని ర్యాగింగ్ భూతం వేధిస్తోందని యూనివర్సిటీకి కొత్తగా వచ్చిన విద్యార్థులు, పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీలోని అన్ని విభాగాలలో సీనియర్లు జూనియర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలుస్తోంది.
దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను అధునీకరించి కార్పొ రేట్కు ధీటుగా వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అం దిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు.