ప్రభాస్ కొత్త సినిమా పోస్టర్పై కనిపిస్తున్న శీర్షిక ఇది. ప్రభాస్ నటిస్తున్న సినిమా కథకు, పాత్రకే కాదు... ఆయన వ్యక్తిగత ప్రయాణానికీ అక్షరాలా వర్తిస్తుంది ఆ శీర్షిక.
‘‘నాణ్యమైన సినిమాని మనం మన దేశంలోనే చేయగలమని నిరూపించిన సినిమా ‘మిరాయ్’. మన దగ్గర ఎంత అద్భుతమైన సాంకేతిక నిపుణులు ఉన్నారో ఈ చిత్రం చాటి చెప్పింది’’ అన్నారు ప్రముఖ దర్శకుడు మారుతి.