‘‘నా కెరీర్లో ఎన్నో ప్రయోగాలు చేశా. ఎప్పుడూ విభిన్నమైన పాత్రలపైనే నా దృష్టి’’ అంటున్నారు కీర్తిసురేశ్. ఆమె ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ‘రివాల్వర్ రీటా’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.
‘‘పాటల్లోనూ... నేపథ్య సంగీతంలోనూ ఇదివరకెప్పుడూ వినని కొత్త సౌండ్స్ని మేం వినిపిస్తూ స్వరాల్ని సమకూర్చాం. థియేటర్లలో మా ప్రయత్నం ప్రేక్షకులకు ఓ కొత్త అనుభవాన్ని పంచుతుంది’’ అన్నారు సంగీత దర్శకులు వివేక్ - మెర్విన్.
బాలీవుడ్ కథానాయిక భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ ‘దల్దాల్’. అమృత్ రాజ్ గుప్తా దర్శకత్వం వహించారు. ఇందులో డీసీపీ రీటా ఫెరీరా పాత్రలో కనిపించనుంది భూమి.
‘వినాయకుడు’, ‘కేరింత’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సాయికిరణ్ అడివి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పదహారు రోజుల పండగ’. సాయికృష్ణ దమ్మాలపాటి కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు.
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న సినిమాకి ‘డ్రాగన్’ అనే పేరు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ పేరుని ఇంకా ఖరారు చేయలేదని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన వై.రవిశంకర్ తెలిపారు.
‘‘ప్రేమ పండగ మొదలు కావడానికి ఇంకా నెల రోజులే మిగిలి ఉంద’’ని అంటున్నారు బాలీవుడ్ కథానాయకుడు కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే. మరి ఈ జంట పంచే వినోదాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే ‘తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ’ సినిమా చూడాల్సిందే.