సూచిక 
సాక్షి, పూర్తి వార్తల కోసం క్లిక్ చేయండి.
వినోదం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్‌గా రూ.1831 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, టాలీవుడ్ నటులు జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో మెప్పించారు.పుష్ప-2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా కోసం పని చేసిన వారికోసం థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌కు పుష్ప-2 టీమ్ అంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరైన టాలీవుడ్ నటుడు సునీల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా వల్లే తనను ఎక్కడికెళ్లినా గుర్తు పడుతున్నారని తెలిపారు. స్పెయిన్‌లో షూటింగ్ జరుగుతుండగా కొందరు పాకిస్తాన్ అభిమానులు తనను గుర్తు పట్టారని వెల్లడించారు. అంతేకాదు తమకు భోజనాలు వండి పెట్టారని సునీల్ వివరించారు.సునీల్ మాట్లాడుతూ.. 'మూవీ షూట్ కోసం ఇటీవల స్పెయిన్ వెళ్లా. రాత్రి 10 గంటలకు అక్కడ రెస్టారెంట్లు క్లోజ్ చేస్తారు. నేను 9.45 గంటల సమయంలో ఒక పెట్రోల్ బంక్‌కు వెళ్లి స్నాక్స్ కోసం అక్కడే ఉన్న స్టోర్‌కి వెళ్లి అడిగా. కానీ అది అప్పటికే క్లోజ్ చేశారని అక్కడే ఉన్న ఓ మహిళ చెప్పింది. ఆ తర్వాత దగ్గర్లో హోటల్స్ ఏమైనా ఉన్నాయా అని వెతికా. కబాబ్ పాయింట్ అనే ఓ చిన్న హోటల్ కనిపించింది. ఇండియన్ ఫుడ్‌కు సంబంధించిన హోటల్ అయి ఉండొచ్చని అక్కడి వెళ్లా. అప్పుడు సమయం అర్ధరాత్రి రెండున్నర అయింది. మేము కారు దిగగానే ఓ వ్యక్తి నన్నే అలాగే చూస్తూ ఉన్నాడు. వెంటనే తన ఫోన్లో పుష్ప ఇంటర్వెల్ సీన్ చూపించి మీరే కదా అని అడిగాడు. ఆ తర్వాత తెలిసింది అది పాకిస్థానీయుల రెస్టారెంట్ అని. నాతోపాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న సభ్యులందరికీ వారు వంట చేసి పెట్టారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో వీడియో కాల్లో మాట్లాడా' అని పంచుకున్నారు. పుష్ప తర్వాత తమిళం, కన్నడ, మలయాళంలో మంచి పాత్రలు వస్తున్నాయని సునీల్ ఆనందం వ్యక్తం చేశారు. నన్ను చూస్తే అందరికీ పుష్ప సినిమానే గుర్తుకు వస్తోందని అన్నారు. True global sensation @alluarjun 🙏🔥#Pushpa2TheRule #AlluArjun pic.twitter.com/B7phDjPLBh— Mad Max (@madmaxtweetz) February 8, 2025 Sun, Feb 9 2025 2:50 PM

పుష్ప సినిమా గురించి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్ ఈవెంట్‌కు హాజరైన ఆయన పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పుష్ప మూవీని అసలు రెండు పార్టులు కాదని అన్నారు. ఫస్ట్ హాఫ్ షూట్ పూర్తయ్యేసరికి 3 గంటలు రావడంతోనే రిలీజ్ చేసినట్లు తెలిపారు. పుష్ప సినిమాకు జరిగిన మిరాకిల్ ఇదే అని అన్నారు. మైత్రి మూవీ మేకర్స్‌కి రూ.1800 కోట్లు తీసుకు వచ్చింది చెర్రీగానే అని నవ్వుతూ మాట్లాడారు. ఇది నిజంగా సాహసమనే చెప్పాలి.. ఫస్ట్ హాఫ్‌ను పుష్పగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని సుకుమార్ వివరించారు. దీనికంతా చెర్రీనే కారణం.. ఒక్క సినిమాతో పోయేదానికి పుష్ప సిరీస్‌గా మార్చేశారు అని సరదాగా అన్నారు.సుకుమార్ మాట్లాడుతూ..' నా ఫస్ట్ ప్రేక్షకుడు చెర్రీగారే. ప్రతి సీన్‌ను గమనిస్తూ ఉంటారు. మైత్రి మూవీ మేకర్స్‌కి డబ్బులు వచ్చాయంటే కారణం ఆయనే. నిజానికి అందరూ అనుకున్నట్లు రెండు పార్టులు కాదు. మొదట పుష్ప అనుకున్నది ఒక్క సినిమానే. ఫస్ట్ హాఫ్ 3 గంటలు వచ్చిందని చెర్రీ అన్నారు. ముందు రిలీజ్ చేసేయండి చెప్పాడు. ఇదే పుష్ప సినిమాలో జరిగిన అద్భుతం. ఒక్క సినిమాతో పోయేదానికి మూడు పార్టులు చేయాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత చెర్రీ గారిదే' అని నవ్వుతూ అన్నారు. Sun, Feb 9 2025 3:56 PM

టాలీవుడ్లో 'మిస్ ఇళయా' (Ms. ILAYAA) అనే ప్రత్యేకమైన టైటిల్‌తో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీకి మట్టా శ్రీనివాస్, చాహితీ ప్రియా నిర్మాతలుగా ఉన్నారు. వేముల జి దర్శకత్వంలో రానున్న ఈ మూవీలో హీరో కుషాల్ జాన్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. తాజాగా పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. కాస్మిక్ పవర్ ప్రొడక్షన్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా త్వరలో షూటింగ్ మొదలు అవుతుంది. ఈ కార్యక్రమంలో చిత్రబృందం, కొంతమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు.హీరో కుషాల్ జాన్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా కథ వినగానే చాలా ఆసక్తిగా అనిపించింది. నేను ఇలాంటి పాత్రలో చేయడం ఇదే మొదటిసారి. ఇది నా కెరీర్లో ఓ ప్రత్యేకమైన స్థానం కల్పించే చిత్రం అవుతుందని నమ్ముతున్నాను. ప్రేక్షకుల ఆదరణ కోసం ఎదురుచూస్తున్నాను' అని తెలిపారు.డైరెక్టర్ వేముల జి మాట్లాడుతూ.. 'ఈ చిత్రం వినూత్నమైన కథతో తెరకెక్కుతుంది. ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. హీరో కుషాల్ జాన్ ఈ పాత్రకు న్యాయం చేస్తారని నమ్మకంగా చెప్పగలను. మేము ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో రూపొందించబోతున్నాము' అని అన్నారు.ప్రొడ్యూసర్ మట్టా శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'సహ నిర్మాత చాహితీ ప్రియతో మా బ్యానర్ 'కాస్మిక్ పవర్ ప్రొడక్షన్'పై వస్తున్న ఈ చిత్రం కోసం ఎంతో అన్వేషణ చేసి, మంచి కథను ఎంపిక చేసుకున్నాం. సినిమాకు అనుగుణంగా ఉన్న సాంకేతిక బృందం, ప్రతిభావంతమైన నటీనటులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే సినిమా అవుతుందని నమ్మకం ఉంది' అని తెలిపారు. 'మిస్ ఇళయా' సినిమా తొలి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొంది. Sun, Feb 9 2025 9:54 AM
బాక్సాఫీస్ వద్ద తండేల్ రెండో రోజు కూడా భారీ కలెక్షన్స్ సాధించింది. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం ఉండనుందని బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. చందు మొండేటి డైరెక్షన్‌కు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తోడైతే ఎలా ఉంటుందో తండేల్ విజయం చూపుతుంది. నాగచైతన్య, సాయి పల్లవి జోడిపై ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు రూ. 21.27 కోట్లు రాబట్టి నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.శనివారం వీకెండ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద తండేల్ దెబ్బ బలంగానే పడింది. రెండురోజులకు గాను రూ. 41.20 కోట్లు రాబట్టింది. ఇంకా ఆదివారం సెలవు రోజు ఉంది కాబట్టి సులువుగా రూ. 50 కోట్ల మార్క్‌ను దాటుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు, అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మించారు. సినిమా విడుదలకు ముందే తండేల్ పాటలు, డైలాగులతో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. సినిమా బాగుందని పాజిటివ్ టాక్ రావడంతో టికెట్ల బుకింగ్‌లో వేగం పెరిగింది. Sun, Feb 9 2025 12:03 PM

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్త్రీ 2 సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఐటమ్ సాంగ్‌కు గ్రీన్ ఇచ్చేసిందట. చిత్రపరిశ్రమలో భారీ క్రేజ్ ఉన్న ఆమెకు ఐటమ్ సాంగ్స్‌లో నటించమని ఇప్పటికే భారీ ఆఫర్స్ వచ్చాయి. కానీ, ఆమె సున్నితంగానే వాటికి నో చెప్పింది. అయితే.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ బాలీవుడ్ మూవీ వార్2లో ఆమె స్టెప్పులు వేయనుందని తెలుస్తోంది.‘సాహో’తో తెలుగు వారికి పరిచయమైన శ్రద్ధా కపూర్‌కు టాలీవుడ్లో కూడా భారీగానే అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె మంచి డ్యాన్సర్ కూడా.. అయితే, ‘పుష్ప2’లో ప్రత్యేక పాట కోసం చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించినట్లు టాలీవుడ్లో ప్రచారం జరిగింది. రెమ్యునరేషన్ విషయంలో డీల్ సెట్ కాకపోవడంతో ఆమె నో చెప్పారని కూడ వార్తలు వచ్చాయి. ఫైనల్‌గా ఆ ఛాన్స్ శ్రీలీల దక్కించుకుంది. ఇప్పుడు వార్2 సినిమాలో శ్రద్ధా కపూర్ ఒక ఐటమ్ సాంగ్‌లో కనిపించనుందని గట్టిగానే వినిపిస్తుంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కూడా చాలా స్పీడ్‌గా జరుగుతోంది.అల్లు అర్జున్ పుష్ప2 చిత్రానికి నో చెప్పిన శ్రద్ధా కపూర్.. ఎన్టీఆర్, హృతిక్‌తో కలిసి స్టెప్పులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే సినీప్రియుల్ని ఉర్రూతలూగించేలా ఆ సాంగ్ ఉంటుందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందని శ్రద్ధ సన్నిహిత వర్గాలు తెలిపాయి. Sun, Feb 9 2025 11:11 AM

హీరో వెంకటేశ్ సంక్రాంతి రేసులో విన్నర్‌గా నిలిచారు. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే, ఈ మూవీకి భారీ బజ్ క్రియేట్ చేసిన ఒక సాంగ్ ఇప్పుడు వీడియో వర్షన్‌ను విడుదల చేశారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించి ఈ చిత్రం జనవరి 14న విడుదలైంది. దర్శకుడు అనిల్ రావిపూడి ప్రమోషనల్ విషయంలో చేసిన మ్యాజిక్‌తో ఈ చిత్రం ప్రేక్షకులకు చేరువైంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 310 కోట్లకు పైగానే రాబట్టింది. వెంకీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే ఆ పాట సినిమాకు ప్రధాన బలమైంది. ఈ సాంగ్‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఆలపించడం విశేషం. ఫిమేల్ లిరిక్స్‌ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆడియో లిరిక్స్ ఇప్పటి వరకు 170 మిలియన్ల మార్క్‌ను దాటింది. థియేటర్స్‌లో ఈ పాటకు ప్రేక్షకులు లేచి మరీ చిందులు వేశారు. ఇప్పటికే యూట్యూబ్, ఇన్‌స్టా రీల్స్‌ను ఓ ఊపు ఊపేసిన ఈ పాటను చాలా మంది రీక్రియేట్ కూడా చేశారు. ఇప్పుడు పూర్తి వీడియో సాంగ్‌ను మీరూ చూసేయండి. Sun, Feb 9 2025 11:32 AM

కర్ణాటక: నవగ్రహ కన్నడ చలనచిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమై అనేక కన్నడ చిత్రాల్లో నటించిన గిరి దినేస్(45) గుండెపోటుతో మృతిచెందారు. కన్నడ సూపర్ స్టార్ దర్శన్ హీరోగా తన సోదరుడు దినకర్ దర్శకత్వం వహించిన నవగ్రహ చిత్రంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీ 2008లో విడుదలైంది. ఆ చిత్రంలో శెట్టి పాత్రను పోషించడం ద్వారా గిరి దినేష్ పాపులర్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత ఆయనకు కోలీవుడ్‌లో మంచి అవకాశాలే దక్కాయి. ఇంట్లో పూజ గదిలో పూజ చేస్తుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.కుటుంబ సభ్యులు ఆయన్ను తోణం ఆస్పత్రికి తరలించగా అప్పటికే తుదిశ్వాస వదిలినట్లు వైద్యులు నిర్ధారించారు. Sun, Feb 9 2025 10:23 AM

సినిమా అవకాశాల పేరుతో చాలామంది మోసపోతూ ఉంటారు. పలు నిర్మాణ సంస్థల పేర్లు చెప్పుకొని అమాయకులను ట్రాప్ చేసి తమ బుట్టలో వేసుకుంటారు. ఆపై వారి టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఉడాయించేస్తారు. ఇలాంటి ఘటనలు సమాజంలో ఎన్నో జరుగుతుంటాయి. అయితే, సినిమా ఛాన్సుల పేరుతో తనను మోసం చేశారని ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ కుమార్తె ఆరుషి నిషాంక్ ఫిర్యాదు చేశారు. ముంబైకి చెందిన మాన్సి వరుణ్ బాగ్లా, వరుణ్ ప్రమోద్ కుమార్ బాగ్లాపై డెహ్రాడూన్ నగర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.ఆరుషి నిశాంక్ ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించారు. ఆమె ఒక క్లాసికల్ డ్యాన్సర్, నటి, నిర్మాత, మోడల్ కూడా.. సినిమాలపై మక్కువతో ఆమె ఒక నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేసుకుంది. ఆయితే, ఆమెకు సినిమాల్లో హీరోయిన్గా రాణించాలనే కోరిక ఉంది. దానిని ఆసరా చేసుకున్న ఇద్దరు కేటుగాళ్లు ఒకరోజు డెహ్రాడూన్‌లోని ఆమె ఇంటికి వెళ్లి తమను తాము సినిమా నిర్మాతలమని పరిచయం చేసుకున్నారు. మినీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా కొత్త సినిమాలు తెరకెక్కిస్తున్నామని ఆమెతో తెలిపారు. షానయా కపూర్, విక్రమ్ మాస్సేతో ఒక సినిమా తీస్తున్నామని ఆమెతో చెప్పారు. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర చాలా బలంగా ఉంటుందని, నటించే వారికి స్టార్డమ్ వస్తుందని నమ్మబలికారు. అయితే, సినిమా కోసం రూ. 5 కోట్లు పెట్టుబడి పెట్టాలని ఆమెను నమ్మించారు. ఆపై హీరోయిన్గా నటించే ఛాన్స్ కూడా దక్కుతుందని ఆమెకు ఆఫర్ ఇచ్చారు. ఒకవేళ మీకు ఆ పాత్ర నచ్చకపోతే రూ. 5 కోట్లకు గాను ఏడాదికి 20 శాతం వడ్డితో కలిపి ఇస్తామని, రెండు నిర్మాణ సంస్థల పేరు మీద సినిమా తీస్తామని ఆమెని నమ్మించారు.ఆ కేటుగాళ్ల మాటలను నమ్మిన ఆరుషి నిశాంక్.. సంయుక్తంగా సినిమా నిర్మింద్దామని వారికి రూ. 4 కోట్లు అప్పజెప్పింది. అయితే, కొన్ని రోజుల తర్వాత, వివిధ రకాల కారణాలతో ఎంఓయూ నిబంధనలకు విరుద్ధంగా, గతేడాది అక్టోబర్ 27న మరో రూ.25 లక్షలు, అక్టోబర్ 30న రూ.75 లక్షలు, నవంబర్ 19న కోటి రూపాయలు తీసుకున్నారు. అయితే, రోజులు గడుస్తున్నాయి. సినిమా పనులు ఎంతవరకు వచ్చాయని ఆమె ప్రశ్నించింది. దీంతో కొన్ని నకిలీ ఫోటోలను ప్రచురించి పంపిణీ చేశారు. కొత్త హీరోయిన్ను తీసుకున్నామని నమ్మబలికారు. వారి మోసాన్ని పసిగట్టిన ఆరుషి.. తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరడంతో ఆమెను చంపుతామని బెదిరించారు. ఆపై ఆమె పరువు తీస్తామని హెచ్చరించారు. ఆరుషి ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సినిమా అవకాశం పేరుతో రూ. 6 కోట్లు సమర్పించుకున్న ఆరుషిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అంత డబ్బు చేతిలో ఉండగా నువ్వే సొంతంగా సినిమా నిర్మించవచ్చు కదా అంటూ ఫైర్ అవుతున్నారు.ఉత్తరాఖండ్ 5వ ముఖ్యమంత్రిగా రమేష్ పోఖ్రియాల్భారతీయ జనతా పార్టీకి చెందిన రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ ఉత్తరాఖండ్ 5వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా కూడా ఆయన సేవలు అందించారు. గతంలో మానవ వనరుల అభివృద్ధి శాఖతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. రమేశ్ పోఖ్రియాల్ 75కు పైగా పుస్తకాలు రచించారు.సాహిత్య రంగంలో పలు అవార్డ్స్ కూడా ఆయన అందుకున్నారు. View this post on Instagram A post shared by Aarushi Nishank (@arushi.nishank) Sun, Feb 9 2025 1:23 PM
జాతీయ ఉత్తమ నటుడు ఆర్ మాధవన్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. దాదాపుగా 7 భాషాల సినిమాల్లో నటించిన అతితక్కువ భారతీయ నటుల్లో ఆయన కూడా ఒకరు. ఆయనకు బైకులంటే చాలా ఇష్టం. ఆస్ట్రియన్ మోటార్ సైకిల్ రంగంలో బిగ్గెస్ట్ బ్రాండ్‌గా గర్తింపు ఉన్న బ్రిక్ట్సన్ క్రోమ్‌వెల్ 1200 సీసీ బైక్‌ను మాధవన్ కొనుగొలు చేశారు. రెట్రో డిజైన్‌తో పాటు ఆధునిక ఇంజనీరింగ్ వర్క్ స్టైల్‌తో ఉన్న ఈ బైక్‌ను కొనుగోలు చేసిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు.ఆస్ట్రియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బ్రిక్ట్సన్ అధికారికంగా భారతదేశంలో తన విక్రయాలను ప్రారంభించింది. నటుడు ఆర్. మాధవన్ తొలి బైక్ క్రోమ్‌వెల్ 1200 సీసీ ఇంజన్ సామర్థ్యం ఉన్న వాహనాన్ని కొనుగోలు చేశారు. మోటోహాస్ భాగస్వామ్యంతో బ్రిక్ట్సన్ భారతదేశంలో అడుగు పెడుతోంది. బెంగళూరు, కోల్హాపూర్, గోవా, అహ్మదాబాద్, సంగ్లీ వంటి నగరాల్లో డీలర్‌షిప్‌లను ఇప్పటికే ఏర్పాటు చేసింది. జైపూర్, మైసూర్, కోల్‌కతా, పూణే, ముంబైలలో షోరూమ్‌లు రానున్నాయి. ఈ బైక్ కంపెనీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించనున్నారు. కొత్త బైక్‌పై తన కుమారుడు వేదాంత్ పేరును చేర్చాడు.ఇండియన్ మార్కెట్లో ఈ బైక్ ధర రూ. 7.84 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది. హై-పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిల్ విభాగంలో ఇది ఒక ఆకర్షణీయమైన ఎంపిక అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బ్రిక్ట్సన్ క్రోమ్‌వెల్ 1200 సీసీ ఇంజన్‌తో కలిగి ఉండి 108Nm టార్క్‌తో పనిచేస్తుంది. నిస్సిన్ బ్రేక్‌లు, బాష్ ABS, KYB అడ్జస్టబుల్ సస్పెన్షన్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, యాంటీ-థెఫ్ట్ కీ సిస్టమ్, TFT డిస్ప్లే, పిరెల్లి ఫాంటమ్ ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ప్రీమియం ఫీచర్లతో బైక్ ఉంది. Sun, Feb 9 2025 10:38 AM

ఆది సాయికుమార్(Aadi Saikumar) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల’(Shambala). ‘ఏ మిస్టిక్ వరల్డ్’ అనేది ఉపశీర్షిక. తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి స్వాసిక(Swasika)ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వసంత అనే పాత్రలో స్వాసిక కనిపించనున్నట్లు ప్రకటించి, ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్.‘‘సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘శంబాల’. ఈ మూవీలో ఆది భౌగోళిక శాస్త్రవేత్తగా సవాల్‌తో కూడుకున్న పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో ప్రస్తుతం మా సినిమా చిత్రీకరణ జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే.. నితిన్ హీరోగా రూపొందుతోన్న ‘తమ్ముడు’తో పాటు హీరో సూర్య 45వ సినిమాలోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు స్వాసిక. Sun, Feb 9 2025 6:19 AM

ముద్దు వచ్చినప్పుడే చంక ఎక్కాలన్నది సామెత. ఇందుకు విరుద్ధంగా జరిగితే అంతా తారుమారే. నటి మృణాల్ ఠాకూర్‌ది ఇంచుమించు ఇదే పరిస్థితి. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన ఉత్తరాది భామ ఈమె. మొదట్లో మరాఠీ చిత్రాల్లో నటించిన తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ చిత్రాలు నటిస్తుండగానే తెలుగులో సీతారామం మూవీలో నటించే అవకాశం వరించింది. అందులో నటుడు దుల్కర్ సల్మాన్‌కు జంటగా నటించారు. అది చాలా ట్రెడిషనల్ పాత్ర. ఆ పాత్రలో ఈ భామ ఒదిగి పోవడం, చిత్రం ఘనవిజయాన్ని సాధించడంతో నటి మృణాల్ ఠాకూర్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో తెలుగులో అవకాశాలు వరుస కట్టాయి.ఈ క్రమంలో నటుడు నానితో జత కట్టిన 'హాయ్ నాన్న' చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది. అలాంటి సమయంలో కోలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. శివ కార్తికేయన్ కు జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించే పెద్ద అవకాశం తలుపు తట్టింది. అయితే కారణాలేమైన ఆ అవకాశాన్ని ఈ అమ్మడు చేజార్చుకుంది. ఆ తర్వాత ఇప్పటివరకు మృణాల్ ఠాకూర్ కోలీవుడ్‌లో అవకాశం రాలేదు. అంతేకాకుండా ఆ తర్వాత తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నటించిన ఫ్యామిలీ మెన్ చిత్రం కూడా ఆశించిన విజయాన్ని సాధించలేదు. గ్లామర్ విషయంలో ఎంతగా హద్దులు మీరినా, దక్షిణాదిలో నటి మృణాల్ ఠాకూర్ దాదాపు కనుమరుగైన పరిస్థితి. మళ్లీ దక్షిణాదిలో కనిపించకపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు ఆమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ అభిమానులు తన కథాపాత్రలను ఆదరిస్తున్నారని అందువల్ల వారికి నచ్చే విధంగా కథాపాత్రలను ఎంపిక చేసుకునే విషయంలో ఆచి చూసి అడిగేస్తున్నానని చెప్పారు. ఒక చిత్రంపై పూర్తిగా దృష్టి పెట్టకుండా పలు చిత్రాలను అంగీకరించే మనస్తత్వం తనదు కాదని పేర్కొన్నారు. అందుకే మంచి కథ పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు నటి మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. Sun, Feb 9 2025 7:00 AM

అప్సర రాణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ "తలకోన" ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది మార్చి 29న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. నటి అప్సర రాణికి సోషల్‌మీడియాలో భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఆమె నటించిన మూవీ సడెన్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇవడంతో నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటివరకు అప్సర రాణీ చేయని వెరైటీ సబ్జెక్ట్ కావడంతో సినిమాపై భారీగా బజ్ క్రియేట్ అయింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ కథ మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది.తలకోన సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే సడెన్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ సినిమా చూడాలంటే రూ. 99 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూవీ కోసం ఆమె మరింత గ్లామర్‌గా కనిపించడమే కాకుండా భారీ యాక్షన్ సీన్స్‌లలో కూడా దుమ్మురేపింది. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో 8.7 రేటింగ్ ఉండటం విశేషం. హీరోయిన్, ఆమె స్నేహితులు కలిసి తలకోన ఫారెస్ట్‌కి వెళ్లినప్పుడు ఏం జరిగింది..? అనేది కథాంశం. ప్రకృతికి విరుద్ధంగా వెళితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.ఈ చిత్రానికి నగేష్ నారదాసి దర్శకత్వం వహించారు. అక్షర క్రియేషన్స్ పతాకంపైదేవర శ్రీధర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో అశోక్ కుమార్, అజయ్ ఘోష్, విజయ కరణ్, రంగ రాజన్, రాజా రాయ్ యోగి కత్రి ప్రముఖ పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సుభాష్ ఆనంద్ సంగీతం అందించారు. Sun, Feb 9 2025 7:58 AM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 1895 కోట్లు రాబట్టి అనేక రికార్డ్స్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రం భారీ విజయం అందుకోవడంతో తాజాగా ‘థ్యాంక్స్ మీట్’ ఏర్పాటు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ మూవీలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత జరిగిన ఈ కార్యక్రమంలో బన్నీ తొలిసారి ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ వేదికపై అల్లు అర్జున్ మాట్లాడుతూ.. 'పుష్ప 2’(Pushpa 2) సినిమా రిలీజ్ సమయానికి మరో హిందీ చిత్రం రిలీజ్ కావాల్సింది. కానీ వాళ్లు వాయిదా వేసుకున్నారు. ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లభించింది.పుష్ప సమయంలోనే కోవిడ్ ప్రారంభమైంది. ఈ సినిమా అసలు అవుద్దా అనిపించింది. కోవిడ్ టైమ్‌లో కూడా చాలా కష్టపడ్డాం. ముఖ్యంగా జాతర షూటింగ్ లాస్ట్ వరకు చూస్తానా అనిపించేది . మైత్రి మూవీస్ లాంటి ప్రొడ్యూసర్స్ లేకపోతే పుష్ప లాంటి సినిమా రాదు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ, చేయలేకపోయాం. డిసెంబరు 5న రిలీజ్ చేశాం. ‘పుష్ప’ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఐదేళ్ల ప్రయాణంలోని ప్రతి క్షణం నాకు ముఖ్యమే. 5 సంవత్సరాలు సుకుమార్ ఏది చెపితే అది పిచ్చొల్లులాగా వింటూనే పనిచేశాం. సినిమాలో ఏది బాగుందని ప్రశంసలు దక్కినా అది డైరెక్టర్ గొప్పతనమే. విజయంలోని క్రెడిట్‌ను తాను తీసుకోకుండా సుకుమార్ అందరికీ పంచిచ్చేస్తుంటాడు. కానీ, ఈ విజయంలోని పూర్తి క్రెడిట్ తనకే సొంతం దేవిశ్రీ లేకుండా ‘పుష్ప’ను ఊహించడం చాలా కష్టం. తను ఈ సినిమాకు ఓ గొప్ప శక్తిని అందించాడు. ఈ సినిమాగానీ హిట్టైతే ఈ కష్టం అంతా నా ఫ్యాన్స్ కు అంకితం చేయాలనుకున్నాను... అంకితం చేస్తున్నాను. ‘పుష్ప 3’ గురించి నాకు, సుకుమార్‌గారికి తెలియదు. కానీ, అదొక అద్భుతంలా అయితే ఉంటుంది (నవ్వుతూ)’’ అని అల్లు అర్జున్ అన్నారు. Sun, Feb 9 2025 8:56 AM

సినిమా షూటింగ్స్ అంటే లోకల్లోనే కాదు... నాన్ లోకల్‌లోనూ జరుగుతుంటాయి. దేశంతో పాటు విదేశాల్లోనూ చిత్రీకరణకు మేకర్స్ ఆసక్తి చూపుతుంటారు. అయితే ప్రస్తుతం భాగ్యనగరంలో (హైదరాబాద్) సినిమా షూటింగ్‌లు భలే జోరుగా సాగుతున్నాయి. బాలకృష్ణ, పవన్ కల్యాణ్, ప్రభాస్, మహేశ్‌బాబు, నాని, ‘అల్లరి’ నరేశ్, నిఖిల్, సాయిదుర్గా తేజ్ వంటి హీరోలంతా హైదరాబాద్‌తో పాటు పరిసరప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్లో జోరుగా పాల్గొంటున్నారు. ఆ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం... నాలుగో సారి... హీరో బాలకృష్ణ–డైరెక్టర్ బోయపాటి శ్రీనులది హిట్ కాంబినేషన్. ‘సింహా, లెజెండ్, అఖండ’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్‌గా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది.ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ నిర్మించిన సెట్లో యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణ, ఆదిలపై చిత్రీకరిస్తున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోని మెయిన్ హైలైట్లలో ఒకటిగా ఉండనుంది. ఫైట్ మాస్టర్లు రామ్–లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమేరా: సి. రాంప్రసాద్, సంతోష్ డి. ముచ్చింతల్‌లో వీరమల్లు పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్–1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, బాబీ డియోల్, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు వంటి వారు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్యప్రొడక్షన్స్పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద ఉన్న ముచ్చింతల్‌లో జరుగుతోందని టాక్. పవన్ కల్యాణ్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రానికి కెమేరా: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వీఎస్. బిజీ రాజా వరుస పాన్ ఇండియా సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయకుడు ప్రభాస్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది. చిత్ర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని టాక్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయింది. మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇలా ఒకవైపు షూటింగ్ మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలతో ‘రాజా సాబ్’ యూనిట్ బిజీగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. ప్రత్యేకమైన సెట్లో... ప్రభాస్ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఇందులో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తున్నారు. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు ప్రభాస్. బ్రిటిష్ కాలం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారని టాక్. ప్రస్తుతం ప్రభాస్, ఇతర లీడ్ యాక్టర్స్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్‌పై వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మిస్తున్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతదర్శకుడు.అల్యూమినియం ఫ్యాక్టరీలో... హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్) సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్ నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.అమేజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా సెట్స్ వేశారట. ప్రస్తుతం మహేశ్‌బాబుపై కొన్సి కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట రాజమౌళి. ఈ షెడ్యూల్ తర్వాత కెన్యాలో షూటింగ్ ఆరంభం కానుందని టాక్. కాగా ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటిస్తారనే వార్తలు వినిపించాయి. అయితే ఆమె హీరోయిన్గా కాదు.. విలన్ పాత్ర చేయనున్నారని తాజా టాక్. పవర్ఫుల్ అర్జున్ సర్కార్ ‘హిట్’ సినిమా సిరీస్‌లో వస్తోన్న మూడో భాగం ‘హిట్: ది థర్డ్ కేస్’. నాని హీరోగా నటిస్తున్న ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయిక. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. యునానిమస్ప్రొడక్షన్స్తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్‌పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు నాని. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. కాశ్మీర్లో ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు టాకీ పార్ట్‌ని చిత్రీకరించిన తర్వాత తాజా షెడ్యూల్ అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైంది. హీరో, హీరోయిన్, ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని టాక్. మే 1న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమేరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె. మేయర్. తప్పించుకోలేరు ‘అల్లరి’ నరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏఆర్ 63’ (వర్కింగ్ టైటిల్). ‘ఫ్యామిలీ డ్రామా’ మూవీ ఫేమ్ మెహర్ తేజ్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రుహానీ శర్మ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. నరేశ్ బర్త్‌డే సందర్భంగా జూన్ 30న ‘మీరు అతని కంటి నుంచి తప్పించుకోలేరు’ అంటూ విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. యుద్ధ వీరుడు ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు నిఖిల్ సిద్ధార్థ్. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ జానర్లో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో యుద్ధ వీరుడిగా కనిపించనున్నారు నిఖిల్. ఈ పాత్ర కోసం ప్రత్యేకించి మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని జన్వాడలో జరుగుతోంది. హీరోతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. ఈ చిత్రం ఈ వేసవిలో రిలీజ్ కానుంది. ఏటిగట్టుపై సంబరాలు ‘విరూపాక్ష, బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై ‘హను మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియాప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. హీరోతో పాటు ఇతర నటీనటులు షూట్లో పాల్గొంటున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడంలో విడుదల కానుంది. ఇవే కాదు.. మరికొన్ని సినిమాల షూటింగ్స్ కూడా హైదరాబాద్, పరిసరప్రాంతాల్లో జరుగుతున్నాయి.చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ముచ్చింతల్‌లోని ఆలయంలో ఈ నెల 14 నుంచిప్రారంభం కానుందట. ఈ సాంగ్ షూట్లో చిరంజీవితో పాటు హీరోయిన్లు పాల్గొననున్నారని టాక్. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతదర్శకుడు. ఈ చిత్రం జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా వాయిదా వేశారు. అయితే కొత్త రిలీజ్ డేట్‌ని మాత్రం చిత్రయూనిట్ ప్రకటించలేదు. రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్). ‘ఉప్పెన’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తెరకెక్కించిన బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో రామ్‌చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లోని భూత్ బంగ్లాలో ముగిసింది. రామ్‌చరణ్‌తో పాటు ముఖ్య తారాగణంపై రాత్రి వేళ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు బుచ్చిబాబు. ఈ మూవీ చివరి రోజు షూటింగ్‌కి తన కుమార్తె క్లీంకారని రామ్‌చరణ్ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. Sun, Feb 9 2025 6:04 AM

తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్గా దూసుకెళుతున్నారు శ్రీలీల(SreeLeela). ఇప్పటికే అరడజను సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ బ్యూటీ తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ మూవీలో నటించనున్నారని టాక్. అది కూడా హిట్ మూవీ ‘మంగళవారం’(mangalavaram movie sequel) సీక్వెల్లో అట. అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మంగళవారం’. 2023 నవంబరు 17న విడుదలైన ఈ చిత్రం హిట్‌గా నిలిచింది.ప్రత్యేకించి పాయల్ రాజ్‌పుత్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘మంగళవారం 2’ రూపొందనుంది. అయితే ద్వితీయ భాగంలో తాను లీడ్ రోల్లో నటించడం లేదంటూ పాయల్ రాజ్‌పుత్ ఇన్‌డైరెక్ట్‌గా చెప్పారట. సీక్వెల్లో పూర్తిగా కొత్త కథ ఉంటుందని, అందుకే పాయల్ రాజ్‌పుత్ కాకుండా మరో హీరోయిన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో అజయ్ భూపతి ఉన్నారని సమాచారం.సీక్వెల్ కథకి శ్రీలీల అయితే సరిగ్గా సరిపోతుందన్నది ఆయన ఆలోచన అని ఫిల్మ్‌నగర్ టాక్. అయితే ‘మంగళవారం 2’ గురించి శ్రీలీలతో ఆయన చర్చిం చారా? లేదా? ఈ మూవీకి ఆమె పచ్చజెండా ఊపుతారా? లేదా వంటి విషయాలపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడక తప్పుదు. శ్రీలీల ప్రస్తుతం తెలుగులో నితిన్ ‘రాబిన్ హుడ్’, రవితేజ ‘మాస్ జాతర’, పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, తమిళంలో శివ కార్తికేయన్‌తో ‘పరాశక్తి’ మూవీ చేస్తున్నారు. Sun, Feb 9 2025 6:11 AM

‘‘స్క్రిప్ట్ చదివి, ఓ మంచి సినిమా తీయడం నిర్మాత బాధ్యత అని భావిస్తాను. అందుకే ప్రతి స్క్రిప్ట్‌ను నేనే చదివి నిర్ణయం తీసుకుంటాను. సినిమా ట్రైలర్, ఫస్ట్ షో తర్వాత వచ్చే ఆడియన్స్ ఫీడ్‌బ్యాక్ నా ట్రంప్కార్డ్స్. పరిమిత బడ్జెట్‌తో, తక్కువ సమయంలో సినిమాలు తీస్తే నిర్మాతలకు లాభాలు వస్తాయని నమ్ముతాను’’ అని అన్నారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా(Rahul Yadav Nakka). ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘బ్రహ్మా ఆనందం’(Brahma Anandam). ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్(Raja Goutham) లీడ్ రోల్స్‌లో నటించగా, మరో కీలక పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ నటించారు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పణలో ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ– ‘‘తాత–మనవళ్ల కథ ఇది. తాను చేసిన తప్పులను తాత ఎలా రియలైజ్ అయ్యాడు? మనవడు తాను చేసిన పొరపాట్లను ఎలా సరిదిద్దుకున్నాడు? అనే అంశాలతో ఈ సినిమా ఉంటుంది. అందరినీ ఎంటర్టైన్ చేసేలా మూవీ ఉంటుంది. బ్రహ్మానందంగారు కథ ఓకే చేయకపోతే ఈ సినిమాయే లేదు.ఇందులో మూర్తి పాత్రలో బ్రహ్మానందంగారు, బ్రహ్మా పాత్రలో రాజా గౌతమ్, గిరి పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ నటించారు. ముందుగా బ్రహ్మా పాత్రకు ‘వెన్నెల’ కిశోర్గారిని అడగ్గా, ఆయన హీరో ఫ్రెండ్ గిరి పాత్ర చేస్తానన్నారు. దీంతో రాజా గౌతమ్ పేరు ప్రస్తావనకు వచ్చి, ఆయనతో మాట్లాడి, ఈప్రాజెక్ట్‌లోకి తీసుకున్నాం.. ఇక సినీ ఇండస్ట్రీకి కొత్త దర్శకులను పరిచయం చేయాలని నన్ను నేను ఛాలెంజ్ చేసుకున్నాను. నేను పరిచయం చేయబోతున్న నాలుగో దర్శకుడు నిఖిల్. మా నెక్ట్స్‌ప్రాజెక్ట్ ‘వైబ్’. ఇందులో రాజా గౌతమ్ హీరోగా చేస్తున్నారు. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, మసూద’ చిత్రాలకు సీక్వెల్స్ ఉన్నాయి. కానీ ఇంకా సమయం ఉంది ’’ అని అన్నారు. Sun, Feb 9 2025 3:42 AM
‘‘చాలాసార్లు ‘పుష్ప’ సినిమా అసలు అవుద్దా అనిపించింది. కోవిడ్ టైమ్‌లో ఎంతో కష్టపడ్డాం. జాతర ఎపిసోడ్ టైమ్‌లో... ఈ ఎపిసోడ్ ఎండ్‌ని చూడగలనా అనిపించింది. ‘పుష్ప 2’(Pushpa 2)ని 2024 ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ చేయలేకపోయాం. డిసెంబరు 5న రిలీజ్ చేశాం. అయితే చివరి నిమిషం వరకూ కష్టపడ్డాం. ‘పుష్ప’ సినిమాకు చెందిన ఐదేళ్ల ప్రయాణంలోని ప్రతి క్షణం నాకు ముఖ్యమే. ఈ సినిమాగానీ హిట్టైతే ఈ కష్టం అంతా నా ఫ్యాన్స్ కు అంకితం చేయాలనుకున్నాను... అంకితం చేస్తున్నాను. ‘పుష్ప 3’ గురించి నాకు, సుకుమార్‌గారికి తెలియదు. కానీ అదొక అద్భుతంలా అయితే ఉంది (నవ్వుతూ)’’ అన్నారు అల్లు అర్జున్(Allu Arjun) .హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ‘థ్యాంక్స్ మీట్’(Thank You Meet)ను శనివారం హైదరాబాద్‌లో నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేదికపై ఇంకా అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘పుష్ప 2’(Pushpa 2) సినిమా రిలీజ్ సమయానికి మరో హిందీ చిత్రం రిలీజ్ కావాల్సింది. కానీ వాళ్లు వాయిదా వేసుకున్నారు. ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లభించింది.ఇండియన్ సినిమాలోని అన్ని ఇండస్ట్రీలకు, ఆడియన్స్ కు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘పుష్ప’ ఫ్యాన్స్ కు థ్యాంక్స్. ఒక్కరికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే... థ్యాంక్స్ అనే పదం సరిపోదు. ఒక యాక్టర్ ఎంత బాగా అయినా చేయవచ్చు. నిర్మాతలు ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు... కానీ అందరికీ హిట్ ఇచ్చేది డైరెక్టర్ మాత్రమే. ఒకరు ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే... సరైన మార్గ దర్శకులు లేకపోతే ఏ యాక్టర్ అయినా బ్యాడ్ యాక్టరే.నన్ను, మమ్మల్ని అందరినీ గైడ్ చేసినందుకు థ్యాంక్స్ (సుకుమార్‌ను ఉద్దేశించి). తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వపడేలా చేసినందుకు థ్యాంక్స్. డార్లింగ్... నిన్ను అందరూ నమ్ముతారు. నువ్వు ఒక్కడివే నిన్ను నువ్వు నమ్మవు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ , వై. రవిశంకర్గార్ల వల్లే ‘పుష్ప’ సాధ్యమైంది. అలాగే ప్రతి రోజూ కష్టపడే చెర్రీగారికి థ్యాంక్స్. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ, నా వ్యక్తిగత ఏఏ టీమ్ అందరికీ ధన్యవాదాలు. సాంగ్స్ మిలియన్స్ ఎలా అవుతాయి అనుకున్న నాకు బిలియన్స్ లో చూపించాడు దేవిశ్రీ ప్రసాద్. శ్రీవల్లి (రష్మిక), కెమేరామేన్ క్యూబా, డ్యాన్స్మాస్టర్స్ గణేశ్, విజయ్, ప్రేమ్ రక్షిత్, శేఖర్... ఇలా అందరికీ థ్యాంక్స్’’ అన్నారు.సుకుమార్ మాట్లాడుతూ– ‘‘నేషనల్ అవార్డు విన్నర్ పెర్ఫార్మ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందీ సినిమా అని ప్రతి సీన్ ముందు అల్లు అర్జున్‌కి చెప్పేవాడిని. ఈ మాటను మరోలా తీసుకోవద్దు... ట్రోల్స్ చేయవద్దు. మా కాలనీలో ఓ పెద్దాయన నాతో ‘ఎస్వీ రంగారావుగారిలా నటించాడు’ అన్నారు. ఆ పక్కనే ఉన్న మరో పెద్దాయన ‘ఎస్వీఆర్ డ్యాన్సులు, ఫైట్లు చేయడు కదా’ అన్నారు. అల్లు అర్జున్ పరిపూర్ణమైన హీరో. డ్యాన్స్ చేయగలడు... ఫైట్స్ చేయగలడు... ఏడవగలడు... నవ్వగలడు... ‘రంగస్థలం’ నుంచి నాకు సూపర్‌డూపర్ హిట్స్ వచ్చాయంటే కారణం మైత్రీ మూవీ మేకర్సే. మంచి సీన్స్ కోసం రీ షూట్స్ చేసేంత ఫ్రీడమ్ ఇచ్చారు.‘పుష్ప’ సక్సెస్ మైత్రీ మూవీ మేకర్స్‌కే చెందుతుంది. దేవీశ్రీ ప్రసాద్ లేకుండా నేను సినిమా తీయలేనేమో! మొదట్లో ‘పుష్ప’ రెండు పార్ట్స్ కాదు. తొలి భాగానికే మూడు గంటల ఫుటేజ్ వచ్చిందని ‘పుష్ప 1’గా రిలీజ్ చేశాం. ఇది ‘పుష్ప’కు జరిగిన అద్భుతం. ఇది చెర్రీగారి వల్ల జరిగింది. ‘పుష్ప 2’నూ ఇలానే రిలీజ్ చేశాం. ఇలా మా లైఫ్‌లో ఆయన ‘పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3’ పెట్టారు. ఈ సిరీస్ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు. ‘పుష్ప 2’తో అసోసియేట్ అయిన అందరికీ థ్యాంక్స్’’ అని తెలిపారు.‘‘పుష్ప 1, పుష్ప 2’ అనే మ్యాజిక్‌ను క్రియేట్ చేసిన అందరికీ... ముఖ్యంగా అల్లు అర్జున్, సుకుమార్, మైత్రీ మూవీస్‌కు థ్యాంక్స్’’ అన్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ‘‘పుష్ప 3’ కోసం ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు ‘పుష్ప 2’ను హిందీలో పంపిణీ చేసిన హిందీ నిర్మాత అనిల్ తడానీ. ‘‘సుకుమార్‌గారి విజన్‌ని అల్లు అర్జున్‌గారు సరిగ్గా తీసుకెళ్లగలిగారు. ‘పుష్ప’ కోసం చాలా కాల్షీట్స్ ఇచ్చారు రష్మిక. మా సినిమాకు దేవీగారు బ్యాక్‌బోన్. ‘పుష్ప’ టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు వై. రవిశంకర్. ‘‘పుష్ప 2’ అంచనాలను మించి కలెక్ట్ చేస్తుందని ఊహించాం. కానీ ఇంత పెద్ద స్థాయిలో ఉంటుందని మాత్రం ఊహించలేదు’’ అన్నారు నవీన్ ఎర్నేని. ‘‘స్పెయిన్‌లో షూటింగ్ చేస్తూ, అర్ధరాత్రి వేళ అక్కడ ఓ రెస్టారెంట్‌కి వెళితే, ఆ రెస్టారెంట్ నడిపే పాకిస్తాన్ వ్యక్తి నన్ను ‘పుష్ప’ సినిమాలోని మంగళం శీనుగా గుర్తుపట్టి, మాట్లాడితే చాలా హ్యాపీ ఫీలయ్యాను. తమిళ, కన్నడ, మలయాళం... ఇలా ఇతర ఇండస్ట్రీ వాళ్ళు నాకు గౌరవంతో పాటు, అవకాశాలు ఇస్తున్నారు. ఇది ‘పుష్ప’తోనే సాధ్యమైంది’’ అన్నారు సునీల్. ‘‘పుష్ప’ సినిమా అయ్యేలోపే రెండు ఇన్‌కమ్‌టాక్స్ రైడ్స్ జరిగాయి. ఈ రైడ్స్‌ను తట్టుకుని, అందరికీ కరెక్ట్‌గా పేమెంట్ చేసిన మా అకౌంట్స్ టీమ్‌కు థ్యాంక్స్’’ అన్నారు మైత్రీ సీఈవో చెర్రీ. ‘నైజాంలో వన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్‌లో ‘పుష్ప 2’ కూడా ఉంది’’ అన్నారు మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి. సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ నాగార్జున మాట్లాడారు. అజయ్, ఆదిత్యా మీనన్, జగదీశ్, గణేశ్ ఆచార్య మాస్టర్, డ్యాన్స్ మాస్టర్ విజయ్ పోలంకి, ఎడిటర్ నవీన్ నూలి, బన్నీ వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై అల్లు అర్జున్, సుకుమార్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ కలిసి ‘పుష్ప’ టీమ్‌కు, డిస్ట్రిబ్యూటర్స్‌కు షీల్డ్స్ అందించారు. ఈ కార్యక్రమంలో సుకుమార్‌కి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. Sun, Feb 9 2025 3:51 AM

‘‘హీరో లేడీ గెటప్ వేసిన ‘భామనే సత్యభామనే, మేడమ్’ వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించి, హిట్స్‌గా నిలిచాయి. ఈ సెంటిమెంట్‌తో ‘లైలా’(Laila) మూవీ కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. అలాగే తెలుగులో ఈ తరహా సినిమాలు వచ్చి కూడా చాలా కాలం అయింది. దీంతో ‘లైలా’ మూవీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు నిర్మాత సాహు గారపాటి. విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘లైలా’. ఆకాంక్షా శర్మ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో కామాక్షీ భాస్కర్ల, అభిమన్యు సింగ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో నిర్మాత సాహు గారపాటి(Producer Sahu Garapati) మాట్లాడుతూ– ‘‘యూత్ టార్గెట్‌గా చేసిన ‘లైలా’ని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో హీరో లేడీ క్యారెక్టర్ (లైలా) కూడా చేశారు. ఈ క్యారెక్టర్ కోసం ముందుగా కొందరు హీరోలను అనుకున్నాం. విశ్వక్ ఈ కథ వినగానే ‘ఇది నేను చేయాల్సిన క్యారెక్టర్’ అన్నారు.హీరో తొలి భాగం సోనూగా, రెండో భాగం లైలాగా మారతాడు. లైలాగా హీరో ఎందుకు మారాడు? అనేది ఎమోషనల్‌గా ఉంటుంది. ఇక ప్రస్తుతం నిర్మాత పరిస్థితి ఏమీ బాగోలేదు. అనుకున్న బడ్జెట్లో సినిమాను నిర్మించగలిగితే ఓకే. ‘లైలా’ని అనుకున్న బడ్జెట్లోనే తీశాం. చిరంజీవిగారితో అనిల్ రావిపూడి డైరెక్షన్లో మేం చేయనున్న నెక్ట్స్ మూవీ జూన్ లేదా జూలైలో ప్రారంభం అవుతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో చేస్తున్న సినిమా చిత్రీకరణ 70 శాతం పూర్తయింది’’ అని అన్నారు. Sun, Feb 9 2025 3:25 AM

‘నాకు పదిహేనేళ్ల వయసు ఉన్నప్పుడే నటిగా కెరీర్ స్టార్ట్ చేశాను. నాగార్జునగారి ‘మన్మథుడు’ సినిమా చేశాను. మరోవైపు చదువుకోవాల్సి వచ్చింది. దీంతో లండన్ వెళ్లిపోయాను. అక్కడ కాలేజ్ స్టడీస్ పూర్తి చేసి, మాస్టర్స్ చేశాను. సైకాలజిస్ట్ అయ్యాను. సొంతంగా ఓ క్లినిక్ కూడా రన్ చేస్తున్నాను. నా 24 ఏళ్ల వయసులో నేను సచిన్ సాగర్‌ను పెళ్లి చేసుకున్నాను.మాకు ఇద్దరు సంతానం. ఒకవేళ ‘మన్మథుడు’ సమయానికి నా వయసు 25 ఏళ్లు ఉండి ఉంటే నేను సినిమాల్లోనే కొనసాగేదాన్నేమో!’’ అని నటి అన్షు అన్నారు. సందీప్ కిషన్ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రాజేశ్ దండా నిర్మించిన చిత్రం ‘మజాకా’(Majaka). రీతూ వర్మ హీరోయిన్గా, మరో లీడ్ రోల్లో అన్షు(Anshu) నటించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో అన్షు చెప్పిన సంగతులు...⇒ ‘మజాకా’లో నేను యశోద అనే క్యారెక్టర్ చేశాను. యశోద స్ట్రాంగ్ విమెన్. కానీ తనలో మంచి ఎమోషనల్ పెయిన్ ఉంది. సినిమాలో నా రోల్‌కి మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఇక ‘మన్మథుడు’ సినిమా రీ–రిలీజ్ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి నా వీడియో బైట్ కోసం నన్ను కాంటాక్ట్ చేశారు. అలా సోషల్ మీడియాలో కనిపించాను. ఆ తర్వాత రచయిత ప్రసన్నకుమార్‌గారు మా మేనేజర్ ద్వారా నన్ను కలిసి, ఈ సినిమా కథ చెప్పారు. అలా ‘మజాకా’కి చాన్స్ వచ్చింది. ఈ కథ వింటున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. ⇒ నేను తిరిగి సినిమాలు చేస్తానన్నప్పుడు నా భర్త నన్ను ఎంకరేజ్ చేశారు. హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టు... ఇలా ఏ తరహా పాత్రలు అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ∙నేను లండన్‌లో ఉన్నప్పుడు ఓ క్యాస్టింగ్ ఏజెన్సీకి నా వివరాలు ఇచ్చి, యాక్ట్ చేస్తానని చెప్పాను. నేను చేసిన సినిమాల గురించి చెప్పాను. వాళ్లు నన్ను రిజెక్ట్ చేశారు. అయితే నేనొక సైకాలజిస్ట్‌ని. సక్సెస్‌తో కన్నా ఫెయిల్యూర్స్‌తోనే ఎక్కువగా నేర్చుకోగలమని నమ్ముతాను. Sun, Feb 9 2025 3:35 AM

‘‘మలయాళ చిత్రపరిశ్రమ(Malayalam film industry) తీవ్ర సంక్షోభంలో ఉంది... ఇలానే కొనసాగితే పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది’’ అంటూ మాలీవుడ్ చిత్రసీమకు చెందిన పలు శాఖలు ఆందోళన చెందుతున్నాయి. ఈ మేరకు కొన్ని మార్పులు చేయకపోతే... జూన్ 1 నుంచి సంపూర్ణంగా షూటింగ్స్, అలానే సినిమాలకు సంబంధించిన ఇతర కార్యకలాపాలను నిలిపివేయాలని, చివరికి సినిమాల ప్రదర్శనలను కూడా ఆపాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు ప్రచారంలోకొచ్చాయి.కేరళ చిత్ర నిర్మాతల మండలి, కేరళ చిత్ర పంపిణీదారుల సంఘం, కేరళ చలన చిత్ర కార్మికుల సమాఖ్య, కేరళ సినిమా ఎగ్జిబిటర్ల సంఘం... ఇవన్నీ కలిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందరూ కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని మలయాళ అగ్రనిర్మాత, కథానాయిక కీర్తీ సురేష్ తండ్రి సురేష్‌కుమార్(Suresh Kumar) ప్రకటించారు.60 శాతం పారితోషికాలకే... ‘‘సినిమా పరిశ్రమ 30 శాతం పన్ను కడుతోంది. ఇలా 30 శాతం పన్ను విధింపబడుతున్న ఇండస్ట్రీ ఏదీ లేదు. ఈ 30 శాతంలో జీఎస్టీ కాకుండా అదనంగా వినోదపు పన్ను కూడా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని పన్ను రద్దు చేయాలి. అలాగే ఇండస్ట్రీపరంగా నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికాలు బాగా పెరిగిపోయాయి.వాటిని తగ్గించాలి. సినిమాకి అవుతున్న బడ్జెట్లో 60 శాతం యాక్టర్ల పారితోషికాలకే కేటాయిస్తున్న పరిస్థితుల్లో నిర్మాతలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇది మాత్రమే కాకుండా కొత్తగా వస్తున్న యాక్టర్లు, డైరెక్టర్లు కూడా ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి కారణాల వల్ల సినిమా నిర్మాణం అనేది లాభదాయకంగా లేదు’’ అని సురేష్‌కుమార్ పేర్కొన్నారు.50 రోజుల్లో పూర్తి చేయకుండా... ఇంకా సినిమా నిర్మాణానికి అవుతున్న సమయం గురించి పేర్కొంటూ... ‘‘50 రోజుల్లోనే పూర్తి చేయడానికి వీలున్న సినిమాలకు కూడా 150 రోజులు చేస్తున్నారు. దీనివల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపో తోంది. ఇలా తక్కువ రోజుల్లో పూర్తి చేయలేకపోవడంతో నిర్మాతలు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను తీవ్రతరం చేస్తోంది’’ అన్నారు. 176 చిత్రాలు... అపజయంపాలు... బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ సినిమా పరిశ్రమని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తున్నాయని చెబుతూ – ‘‘2024లో విడుదలైన చిత్రాల్లో 176 చిత్రాలు వసూళ్లపరంగా నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది ఒక్క జనవరిలోనే రూ. 101 కోట్లు నష్టం వాటిల్లింది. ఈ నష్టం సినిమా కోసం తెరవెనుక పని చేస్తున్న నిపుణుల ఉపాధిపై ప్రభావం చూపుతోంది’’ అని పేర్కొన్నారు సురేష్‌కుమార్. ఇక తాజాగా తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో పన్ను తగ్గింపు లేదా ఎత్తివేతను కోరుతూ మలయాళ చిత్రసీమకు చెందిన కీలక శాఖల అధ్యక్షులు త్వరలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ని, ఇతర సంబంధిత మంత్రులను కలిసి ఓ వినతి పత్రాన్ని సమర్పించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. నటీనటుల పారితోషికం తగ్గింపు, తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేయడం... వంటి విషయాల్లో సరైన పరిష్కారం లభించకపోతే జూన్ 1 నుంచి షూటింగ్స్, సినిమాకి సంబంధించిన ఇతర కార్యకలాపాలు నిలిపివేయడం ఖాయం అని బలమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మరి... మలయాళ చిత్రాల షూటింగ్స్ ఆగుతాయా? చర్చలు సజావుగా జరిగి, పరిష్కార మార్గం వెతుక్కుని షూటింగ్స్ చేస్తారా? అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. Sat, Feb 8 2025 4:16 AM

ప్రముఖ నటుడు కమల్‌హాసన్(kamal haasan) ‘ఖైదీ 2’(Khaidi2) సినిమాలో నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు. కార్తీ(karthi) హీరోగా లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’. 2019లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలై ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘ఖైదీ 2’ రూపొందనుంది. ఈ మూవీలోనూ కార్తీ హీరోగా నటించనుండగా లోకేశ్ కనగరాజే దర్శకత్వం వహించనున్నారు.కాగా ఈ సీక్వెల్లో కమల్‌హాసన్ కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్. కమల్‌హాసన్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన ‘విక్రమ్’ (2022) సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్పుడు వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ కుదిరింది. దీంతో ‘ఖైదీ 2’లోని ఓ కీలక పాత్ర చేయాలని కమల్ని లోకేశ్ అడగడం.. ఆ పాత్ర కూడా ఆయనకు బాగా నచ్చడంతో చేసేందుకు కమల్ ఓకే అన్నారని తమిళ సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. త్వరలో ఈ చిత్రం ఆరంభం కానుంది. Sat, Feb 8 2025 4:05 AM