జిల్లాలోని ఒకే ఒక్క ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అవసరమైన కోత్త కోర్సుల్లేక విద్యార్థులు నష్టపోతున్నారు. వికారాబాద్‌కు 2008లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేశారు. 17 ఏళ్ల కిందట ఏ కోర్సులున్నాయో ఇప్పటికే అవే కొనసాగుతున్నాయి.
ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు బస్సుల ఆగడాలకు కళ్లెం వేయటం అధికారులకు సవాల్‌గా మారింది. కర్నూలులో జరిగిన ఘోర ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
మేడ్చల్-మల్కాజిగిరి ఆబ్కారీ డివిజన్ల పరిధిలో.. ఒక వ్యక్తి కొందరితో సిండికేట్‌గా ఏర్పడి మద్యం దుకాణాలకు ఏకంగా 100 దరఖాస్తులు వేయించాడు. సోమవారం తీసిన డ్రాలో వీరికి జవహర్‌నగర్‌లో ఒకటి, దమ్మాయిగూడలో 3 దుకాణాల లైసెన్సులు దక్కాయి.
హైటెన్షన్ విద్యుత్తు స్తంభంపై 8 గంటల పాటు రెస్క్యూ బృందాన్ని ముప్పుతిప్పలు పెట్టిన వ్యక్తి కిందకు దూకేసి మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో సోమవారం ఉదయం 7 గంటలకు.
విద్యుత్తుతో నడిచే మెట్రోరైలు కిలోమీటర్ దూరానికి 10 యూనిట్లు మాత్రమే వినియోగిస్తుంది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ 29 కిలోమీటర్ల మార్గంలో ఒక ట్రిప్ దూరానికి 290 యూనిట్ల విద్యుత్తుతో..
రాష్ట్రంలోని ఆటో కార్మికుల బలవన్మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనే కారణమని భారాస నేతలు ఆరోపించారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండు చేశారు.
హెచ్ఎండీఏ పరిధిలో భవనాలు, లేఅవుట్ల అనుమతుల్లో కొందరు అధికారుల నుంచి దస్త్రాలు ముందుకు కదలడం లేదు. కొన్ని దరఖాస్తులకు 30 రోజులు దాటినా మోక్షం కలగడం లేదు.
ఆధార్‌లో కొత్తగా నమోదుతోపాటు.. బయోమెట్రిక్ అప్డేట్, పేరు, చిరునామాల్లో మార్పుల కోసం నిత్యం ఆధార్ కేంద్రాల వద్ద ప్రజలు బారులుదీరుతున్నారు. ఇదే అదునుగా పలు ఆధార్ కేంద్రాల్లో అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారు.
ఫీజు బకాయిలు విడుదల, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్ చేపట్టనున్నట్లు భారత విద్యార్థి సమాఖ్య(ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ తెలిపారు.
ఒక్కసారి రక్తదానంతో మూడు ప్రాణాలు నిలబడతాయని రాష్ట్ర డీజీపీ బి.శివధర్‌రెడ్డి అన్నారు. అపోహలు, అనుమానాలు వదిలేసి ఏటా 1-2సార్లు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన షేక్ రియాజ్ పోలీస్ ఎన్కౌంటర్లో మరణించిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(ఎస్హెచ్ఆర్సీ) ఇప్పటికే సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారాస నిబంధనలు ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్‌రెడ్డిలు సోమవారం రిటర్నింగ్ అధికారి పి.సాయిరాంకు ఫిర్యాదు చేశారు.
సీజేఐ జస్టిస్ గవాయ్‌పై దాడి యత్నానికి నిరసనగా నవంబరు 1న హైదరాబాద్‌లో నిర్వహించనున్న దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన సభకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో తరలిరావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు.
విద్యార్థులకు రూ. 8 వేల కోట్ల ఫీజు బకాయిలను చెల్లించాలనే డిమాండ్‌తో నవంబరు 3 నుంచి ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ కళాశాల నిరవధిక బంద్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలందరూ సంతృప్తిగా ఉన్నారని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు. సోమవారం ఆమె నాంపల్లిలో ఆర్టీసీ.
భారాస పార్టీలో మహిళలను గౌరవించే సంప్రదాయం లేదని రాష్ట్ర మహిళా కార్పొరేషన్, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్పర్సన్లు బండ్రు శోభారాణి, కాల్వ సుజాతలు విమర్శించారు.
బైక్‌ను తప్పించబోయి కారు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతోవెనుక వస్తున్న ఆర్టీసీ బస్సు దాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో కారు బోల్తా పడగా బస్సు డివైడర్ ఎక్కింది.
బయో టెక్నాలజీలో పరిశోధనలు పెరిగి, సరికొత్త ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ పేర్కొన్నారు. హెచ్సీఐఐసీలో సోమవారం ఐకేపీ నాలెడ్జ్ పార్క్ ఆధ్వర్యంలో.
అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకునే మార్గాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించాలని సిబ్బందికి ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సూచించారు. బస్సు బయలుదేరే ముందు ‘స్వాగత సందేశం’తోపాటు అగ్నిప్రమాదాల భద్రత గురించి చెప్పాలన్నారు.
సరికొత్త ఆలోచనలతో నిర్మించే చలనచిత్రాలకు యానిమేషన్ కూడా తోడైతే.. అవి ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయని సినీ దర్శకుడు అశ్విన్ కుమార్ అన్నారు. రవీంద్రభారతిలో అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవం సందర్భంగా..
తెలంగాణలో రైతుల అవసరాలకు అనుగుణంగా సరిపోయే యూరియాను కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల్లోని ఎరువుల తయారీ కంపెనీల నుంచి ఎరువులను సేకరించడంతోపాటుగా.. విదేశాల నుంచి పెద్దఎత్తున దిగుమతి చేసుకోవడం ద్వారా.. దేశంలో యూరియా కొరత తగ్గించేందుకు కేంద్రం చొరవ తీసుకుందని పేర్కొన్నారు కిషన్‌రెడ్డి.