ప్రపంచ సుందరి పోటీదారుల్లోని ఐరోపా దేశాల అందగత్తెలు గురువారం మాదాపూర్‌లోని శిల్పారామంలో సందడి చేశారు. ఆహ్లాదకర వాతావరణంలో బతుకమ్మ, కోలాటాలు ఆడి, మట్టితో కుండలు చేసి, చేర్యాల బొమ్మలకు రంగులువేసి ఉత్సాహంగా గడిపారు.
మూసీ నది ప్రక్షాళనకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంటే.. మరోవైపు ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. బఫర్ జోన్ దాటి కబ్జాదారులు నదిలోకి ప్రవేశిస్తున్నారు. ఉంటే స్థలం ఉంటుంది.. పోతే ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందనే ఆశతో ఇలా చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ ఆవరణలోని విగ్రహాల సమస్యకు దశాబ్దన్నర కాలం తర్వాత పరిష్కారం లభించింది. మేయర్ కార్యాలయ ప్రవేశ ద్వారం ముందు 15 ఏళ్లుగా ముసుగులో ఉండిపోయిన గాంధీ, అంబేడ్కర్, వైఎస్ఆర్ విగ్రహాలను వేరే చోటికి తరలించి ఆ ప్రాంతంలో ఫౌంటెయిన్ నిర్మించాలని గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన స్థాయీ సంఘ సమావేశంలో నిర్ణయం జరిగింది.
ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తయింది. చర్లపల్లి టెర్మినల్, బేగంపేట రైల్వేస్టేషన్లు పునఃప్రారంభమయ్యాయి. ఇక యాదాద్రి వరకు (ఘట్కేసర్ నుంచి రాయగిరి) ఎంఎంటీఎస్ విస్తరణపై దృష్టి సారించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరున్న పీర్జాదిగూడ నగర పాలక సంస్థపై హైడ్రా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రహదారులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు మాత్రం చోద్యం చేస్తున్నారని ఇటీవల హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు పదుల సంఖ్యలో ఫిర్యాదులు వెళ్లాయి.
‘అగ్ని’ గండంతో నగరం బెంబేలెత్తిపోతోంది. గుల్జార్‌హౌజ్ ఘటనతో పాటు ఇటీవల జరిగిన వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాద నివారణ చర్యలపై అందరూ దృష్టి పెట్టాలని అగ్నిమాపక శాఖ చెబుతోంది.
గుల్జార్హౌజ్లోని ఓ భవనంలో ఐదు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాద ఘటనతో ఆ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లోని ముత్యాల, ఆభరణాల దుకాణాలు మూతపడ్డాయి. గురువారం సాయంత్రం బాధిత కుటుంబీకులు తలుపులు తెరిచి చూశారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, ఇతర రాష్ట్రాల్లో మెట్రోరైలు నిర్మాణ అంచనాలు, హైదరాబాద్‌లో ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మెట్రో రెండో దశ(బి) డీపీఆర్‌లను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించామని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి గురువారం వెల్లడించారు.
ప్రపంచ సుందరి కలను సాకారం చేసుకునేందుకు ముద్దుగుమ్మలు అందం.. అభినయం.. ఆటలు.. ఆలోచనలు.. ఆశయాలతో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరో వారం రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇప్పటికే రేసులో ఉన్న భామల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఎంపిక ప్రక్రియలో భాగంగా వివిధ మార్గాల్లో అంతర్గత ఎంపిక ప్రక్రియ మొదలైంది.
నగరంలో ధూళి కాలుష్యానికి దారులే ప్రధాన కారణమవుతున్నాయి. సగానికిపైగా కాలుష్యం రోడ్లపై ఉత్పత్తవుతున్న దుమ్ము, మట్టితోనే అని ఐఐటీ కాన్పూర్ అధ్యయనంలో తేలింది. రోడ్లను శుభ్రంగా ఉంచేందుకు ఏటా రూ.100 కోట్లు వెచ్చిస్తున్నా రహదారులు కాలుష్యానికి కారణమవుతుండటం గమనార్హం.
నగరవాసులు ఏడాదికి రూ.2వేల కోట్ల ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం గ్రేటర్ ప్రజలకు కనీసం మరుగుదొడ్లను ఏర్పాటు చేయలేకపోతున్నారు. ప్రధాన రహదారులపై కిలోమీటర్లు నడిచినా మూత్రవిసర్జనకు వసతులు కనిపించడం లేదు.
కృత్రిమ మేధ.. వీఎఫ్ఎక్స్.. కంప్యూటర్ గ్రాఫిక్స్ తదితర సాంకేతికతలతో వినోద రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వినూత్నమైన కథనాలకు ప్రేక్షకులు.. వీక్షకుల ఆదరణ పెరుగుతుండడంతో హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం ‘ఫిల్మ్ మేకింగ్’ పేరిట తొలిసారిగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సు ప్రారంభించనుంది.
నగరంలోని వ్యాపారిని డిజిటల్ అరెస్ట్ అంటూ మూడ్రోజుల పాటు ఇల్లు కదలకుండా చేసి రూ.90లక్షలు కాజేశారు. భయం నుంచి బయటపడి ఫిర్యాదు చేసేలోపు సొమ్మంతా విత్‌డ్రా చేసుకున్నారు. పోలీసులు బ్యాంకు ఖాతా ఫ్రీజ్ చేసినా నగదు రికవరీ చేయలేకపోయారు.
ఇంజినీరింగ్ డ్యూయల్ డిగ్రీ కోర్సులను అఖిలభారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతులు లేకుండా పదహారేళ్లు నిర్వహించిన జేఎన్టీయూ అధికారులు తప్పులు దిద్దుకునేందుకు దిల్లీ బాట పట్టారు.
రాజ్యాంగ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా వక్ఫ్ చట్టం ఉందని.. భాజపా ప్రభుత్వం ముస్లింలను శత్రువులుగా చూస్తోందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. మసీదులు, దర్గాలు, శ్మశానవాటికలు గుంజుకునేందుకు ఈ నల్ల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తయారు చేసిందన్నారు.
మణికొండలోని రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో గురువారం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సదానందం ఆధ్వర్యంలో ఫ్యాన్సీ నంబర్ల వేలం పాట నిర్వహించారు.
ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద ఓ మహిళ మృతి, ఆమె కుమారుడికి తీవ్రగాయాలైన ఘటనపై అదనపు సమాచారంతో నివేదిక సమర్పించాలని జాతీయ మానవహక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది.
‘అందాల పోటీలతో తెలంగాణ ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తామని సీఎం చెబుతున్నారు. తెలంగాణ ప్రతిష్ఠ అంటే ఉద్యమాలు, పోరాటాలు, ప్రజా చైతన్యమే.. అందాల పోటీలు ముమ్మాటికి అప్రతిష్ఠే’ అని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు, కవి, రచయిత నందిని సిధారెడ్డి అన్నారు.
తన వ్యాపార సంస్థల్లో పెట్టుబడుల ద్వారా భారీగా లాభాలు ఆర్జించవచ్చని ప్రజలను నమ్మించి రూ.4.48 కోట్లు కాజేసి వంచించిన ఓ మాజీ సైనికోద్యోగిని సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీసులు అరెస్టు చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపు, నాణ్యమైన విద్యా బోధన, ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. పక్షం రోజుల పాటు నిర్వహించనున్న బడిబాటలో పాఠశాలల్లో ఉన్న వసతులు, బోధన తీరు, ఉచితంగా అందజేస్తున్న అంశాలపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నామని జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి అన్నారు.
గ్రామాల్లోనే పౌర సేవలు అందించే లక్ష్యంతో పల్లెల్లో మీసేవా కేంద్రాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. తొలిసారిగా తాండూరు మండలంలో కార్యాచరణకు శ్రీకారం చుట్టి, రూ.2కోట్లతో భవనాల నిర్మాణం చేపట్టింది.
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం-2025 ఆమోదించింది. దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ధారూర్ మండలాన్ని ఎంపిక చేసి సదస్సులు నిర్వహించింది.