గత ప్రభుత్వాల హయంలో నిధుల కేటాయింపులో నిరాదరణకు గురయిన జలమండలి.. స్వరాష్ట్రంలో మాత్రం ఆత్మగౌరవంతో నిలుస్తున్నది. ప్రతి ఇంటికి సమృద్ధిగా తాగునీరు, వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యం
నగర శివారులోని మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలతో పాటు షేక్‌పేట్‌లోని పలు ప్రాంతాలకు బుధవారం తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తనున్నట్లు వాటర్‌బోర్డు అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కేంద్ర ప్రరభుత్వం రాజకీయ కుట్రలతోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా నకిలీ కేసులు బనాయించి చార్జిషీట్‌ను దాఖలు చేయిందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ డి.సుధాకర్ ఆరోపించారు.
అదానిపై చర్యలు తీసుకోవాలి చిక్కడపల్లి : దా‘రుణాలకు’ పాల్పడిన అదానిపై కేంద్రం చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మహిళాకాంగ్రెస్ అధ్యక్షురాలు పుస్తకాల కవిత డిమాండ్ చేశారు. గన్‌ఫౌండ్రిలోని ఎస్బీఐ ఎదుట కాంగ్రెస్ నిర్వహించిన ఽధర్నాలో గాంధీనగర్ డివిజన్‌నుంచి కవిత పాల్గొన్నారు. దివాళా తీసిన ఆదానీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్లు నష్టపోయిన అదానీ రుణాల మాఫీకి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు అనిల్‌యాదవ్, రోహిణ్‌రెడ్డి, సంగపాక వెంకట్, అభిషేక్కెనడీ, లత, అనిత పాల్గొన్నారు.