Telangana Congress: మంత్రివర్గ విస్తరణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను గురువారం నాడు తెలంగాణ నేతలు కలిసి చర్చించారు. ఈ మేరకు టీపీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో సుదీర్ఘంగా చర్చించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు హైదరాబాద్ సన్ రైజర్స్కు మధ్య వివాదం తలెత్తింది. అది కాస్తా తారస్థాయికి చేరింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎందుకంటే.. ఎస్ఆర్హెచ్పై తీవ్ర ఒత్తిడికి గురి చేయడమే కాకుండా.. ఎక్కువ టికెట్లు కేటాయించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్హెచ్ ఆరోపిస్తూ.. ప్రభుత్వానికి ఈ మెయిల్ చేసింది.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవన్న స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. ఈ క్రమంలో ఇటీవల సీఎం అసెంబ్లీలో మాట్లాడిన మాటలను కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది మరోసారి ప్రస్తావించారు.