ప్రముఖ నటుడు కొణిదెల చిరంజీవి వ్యక్తిత్వ హక్కులకు ఇంటరిమ్ ఇంజంక్షన్ను సిటీ సివిల్ కోర్టు ఇవాళ(శనివారం) మంజూరు చేసింది. చిరంజీవి అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడాన్ని న్యాయస్థానం నిషేధించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటు అడగటానికి కాంగ్రెస్ నేతలు వస్తే బాకీ కార్డు చూపెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. అవ్వా , తాతలకు రూ.4000 పెన్షన్ ఇస్తామని అన్నారని.. ఇచ్చారా అని నిలదీశారు. మహిళలకు రూ. 2500 ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.