ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు.
‘ అవుటర్పైకి ఎక్కడానికి దిగేందుకు సర్వీసు రహదారులే కీలకం. ఆయా రోడ్లు భారీ వర్షాలతో గుంతలు పడ్డాయి. వేగంతో వెళ్లేటప్పుడు చిన్న గుంత ఉన్నాసరే...అది ప్రమాదాలకు దారి తీస్తుంది..’
అవయవదానంతో యువకుడు మరో నలుగురికి ఊపిరయ్యాడు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చేవెళ్లకు చెందిన ముదునురోళ్ల శ్రీకాంత్(33) కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్.
కొడంగల్ మండలంలోని చిట్లపల్లి అంగన్వాడీ కేంద్రంలో గుడ్ల నుంచి వాసన వస్తోందని ఎవరూ తీసుకెళ్లడం లేదు. ఇటీవల కొందరు తీసుకెళ్లాక తిరిగి ఇచ్చేశారు. మండల పరిధిలోని అన్నారంలోనూ కుళ్లిన గుడ్లు ఇవ్వడంతో చాలామంది వెనక్కి తెచ్చి సిబ్బందికి చూయించారు.
చాపకింద నీరులా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కోరలు చాస్తోంది. చాలామందికి అవగాహన లేకపోవడం, సామాజిక బిడియం వల్ల వ్యాధి బాగా ముదిరే వరకు పరీక్షలు చేయించుకోవడం లేదు.
గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు పార్కింగ్ చేసిన కారు అద్దాలు ధ్వంసం చేసి రూ.20లక్షల నగదును పట్టపగలే అపహరించారు. ఈ ఘటన జిల్లా కేంద్రం సంగారెడ్డిలో మంగళవారం జరిగింది.
చాంద్రాయణగుట్టలోని శ్రీరామాలయం సమీపంలో రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చేసిన ఇంటికి 13 ఏళ్ల తరువాత మంగళవారం జీహెచ్ఎంసీ అధికారులు ఆస్తిపన్ను నోటీసు జారీ చేశారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు సంబంధించి పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.