పత్తి తీతలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. గత వారం నుంచి కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్‌కు రోజూ 10,000 క్వింటాళ్ల నుంచి 16,000 క్వింటాళ్ల సరకు వస్తోంది. అమ్ముకుందామని పత్తి తీసుకెళ్లిన రైతుకు మద్దతు ధర దక్కడం లేదు. సీజన్ ఆరంభంలోనే క్వింటాల్‌కు రూ.3,000 తక్కువగా లభిస్తోంది.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు స్త్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తుండగా..వీరికి కల్పించిన రాయితీ కోసం ఆర్టీసీకి ప్రభుత్వం ఎంత చెల్లించాలన్నదానిపై స్పష్టత రావడంలేదు. ఆర్థికశాఖ, ఆర్టీసీ అధికారులు ఇప్పటి వరకు మూడుసార్లు సమావేశమైనా..
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఏపీ శాఖ ఛైర్మన్ వై.డి.రామారావు.. రెడ్‌క్రాస్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలో 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాఖల నుంచి రెండేళ్ల పదవీ కాలానికి 12 రాష్ట్రాల సభ్యులు ఎన్నికయ్యారు.
మధ్యప్రదేశ్‌లో కోల్డ్రిఫ్ దగ్గు మందు కారణంగా రెండేళ్లలోపు చిన్నారులు పలువురు మరణించడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవగాహనతో నడుచుకుంటే ఎలాంటి ప్రమాదమూ ఉండదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
విశాఖలో దక్షిణాసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్ నిర్మాణానికి గూగుల్ టెక్‌తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే ఒప్పందం ‘గేమ్ ఛేంజర్’ కాబోతోందని తెదేపా ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ అన్నారు.
భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ద్వారా బియ్యం సేకరణ లక్ష్యాన్ని కేంద్రం పెంచిందని ఎఫ్‌సీఐ రాష్ట్రస్థాయి సంప్రదింపుల కమిటీ ఛైర్మన్, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 30 లక్షల టన్నుల బియ్యం సేకరణకు అనుమతించిందని వివరించారు.
స్వర్ణముఖి నది పరీవాహక ప్రాంతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల్ని వైకాపా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అనుచరుడు కబ్జా చేశాడని తిరుపతి జిల్లా వేదాంతపురానికి చెందిన పద్మావతి అనే మహిళ ఫిర్యాదు చేశారు.
నకిలీ మద్యం వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ, సీఐడీ ఎస్పీ కె.చక్రవర్తి, సాంకేతిక సేవల విభాగం ఎస్పీ మలికాగార్గ్‌ను సభ్యులుగా నియమించింది.
ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు, విద్యారంగ నిపుణులు, వినూత్న ఆవిష్కరణలతో వచ్చే వారిని సమన్వయం చేసేందుకు ఐటీ సలహా మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మహిళా డ్రైవర్లు నడిపే 30 ఎలక్ట్రిక్ ఆటోలను సీఆర్డీఏ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. మహిళా డ్రైవర్లను అభినందించారు. అమరావతిలో పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించేందుకు సీఆర్డీఏ..
మద్యం అసలుదో నకిలీదో! ఎప్పుడు.. ఎక్కడ తయారయిందనే వివరాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్’ సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.