పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కొత్త ప్రయోగం చేపట్టింది. బ్యాంకు రుణంతో పాటు వివిధ అనుమతులను సులభతరం చేస్తూ ‘జీవనోపాధుల ప్రోత్సాహక విధానం’ తీసుకొచ్చింది.
‘రుషికొండపై ఏడాదికి రూ.7 కోట్ల ఆదాయం వచ్చే రిసార్ట్‌ను వైకాపా పాలకులు కూల్చేశారు. అభివృద్ధి పేరుతో రూ.453 కోట్లు వెచ్చించి ప్యాలెస్ నిర్మించారు. ఇప్పుడు కేవలం విద్యుత్ బిల్లులకే ఏడాదికి రూ.కోటిన్నర చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు.
నేరుగా (డైరెక్టు)జరిపే నియామకాలకు జీఓ-77 ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలో చేపట్టిన మొదటి నియామకాలు డీఎస్సీవే అని కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
‘అక్రమ మైనింగ్, ప్రకృతి విధ్వంసం, అవినీతి వంటివి వైకాపా విధానాలైతే, సామాజిక స్పృహతో కూడిన కార్యక్రమాలు నిర్వహించడం జనసేన పార్టీ విధానాలు’ అని ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
కీలక రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, పోటీతత్వం, సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ తయారీ మిషన్ ఉపయోగపడుతుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు.
ఆహారశుద్ధి, మత్స్యసంపద, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఈ రంగాల ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
విశాఖలోని రుషికొండ సమీప ఐటీహిల్స్‌పై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కార్యకలాపాలు ప్రారంభించడానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. హిల్-3లోని మిలీనియం టవర్స్‌లో లీజు ప్రాతిపదికన కేటాయించిన భవనాన్ని సిద్ధం చేస్తున్నారు.