రైల్వే పరంగా ఆంధ్రప్రదేశ్‌లో గత పదేళ్లలో వివిధ పనులు వేగంగా జరిగినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. గత యూపీఏ ప్రభుత్వం చివరి ఐదేళ్లు, ఎన్డీయే ప్రభుత్వ పదేళ్ల కాలాన్నీ పోలుస్తూ రైల్వేశాఖ పనుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన మార్పులపై ఆ శాఖ తాజాగా నివేదిక విడుదల చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలల క్రితం సంభవించిన వరదలు జనజీవితాల్ని స్తంభింపజేశాయి. కట్టుబట్టలతో మిగిలినవారు కొందరైతే.. అయినవాళ్లను కోల్పోయినవారు మరికొందరు.
చిరుధాన్యాలతో తయారు చేసిన తెలంగాణ వంటకాలు చాలా బాగున్నాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ సహాయ మంత్రి శ్రీమతి నిముబెన్ జయంతిభాయ్ బంభానియా కితాబిచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకుల అండదండలతో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్‌లో నియమితులైన వారు సహచర ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారని కట్టెపోగు వెంకయ్య వాపోయారు.
ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌పై దాడి కేసులో తుళ్లూరు పోలీసులు నమోదుచేసిన కేసులలో ముందస్తు బెయిలు మంజూరుచేయాలని కోరుతూ వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేష్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.
పోలీసు ఉన్నతాధికారులను వ్యాజ్యంలో అనవసరంగా ప్రతివాదులుగా చేర్చి వారిని భయాందోళనలకు గురిచేసేందుకు కొందరు పిటిషనర్లు ప్రయత్నిస్తున్నారని హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ బుధవారం హైకోర్టు దృష్టికి తెచ్చారు.
పర్యాటకరంగంలో రూ.25వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా నూతన పర్యాటక విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. మొదటిసారి ఈ రంగానికి పారిశ్రామిక హోదా కల్పించింది. స్థిర మూలధన పెట్టుబడులపై (ఎఫ్‌సీఐ) రాయితీలు ఇవ్వాలన్న కీలక నిర్ణయం తీసుకుంది.