ఐపీఎస్ అధికారి సంజయ్‌కు ఏసీబీ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయన రెండోసారి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను సోమవారం విజయవాడలోని ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
పిల్లలూ రకరకాల పక్షులను ప్రత్యక్షంగా చూడాలని ఉందా..? వీటి గురించిన ప్రత్యేకతలు నిపుణులు చెబుతుంటే వినాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. భారతీయ విజ్ఞాన శిక్షణ, పరిశోధన సంస్థ (ఐసర్-తిరుపతి)లోని పక్షుల పరిశోధన విభాగం ఆసక్తి ఉన్న చిన్నారులకు ఆహ్వానం పలుకుతోంది.
గుంటూరు నగరానికి చెందిన కందిపప్పు కమీషన్ ఏజెంట్ సంస్థ, ఇంట్లో ఆదాయ పన్ను అధికారులు జరిపిన సోదాల్లో రూ.45 కోట్ల నగదు, వందకు పైగా బంగారం బిస్కెట్లు, కోట్ల రూపాయల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు, బ్యాంకు లాకర్లలో భద్రపరిచిన ప్రామిసరీ నోట్లు, చెక్కులను స్వాధీనం చేసుకున్నారు.
పోలవరం ప్రాజెక్టులో ప్రధాన రాతి, మట్టి డ్యాం నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. డయాఫ్రం వాల్‌పై ప్రధాన డ్యాంను నిర్మించాల్సి ఉంది. నవంబరు నుంచి ప్రధాన డ్యాం పనులను చేపట్టాలనేది ప్రణాళిక.
‘ఆడవాళ్లందరూ మందు తాగుతూ తమ ప్రవర్తనను ప్రపంచానికి చూపుతున్నారు’ అని పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
శేషాచలం అటవీ ప్రాంతంలో ఉండే కోతులు, ఉడతలు, పిల్లులు తరచూ రైల్వే విద్యుత్తు స్తంభాలు ఎక్కి విద్యుదాఘాతంతో మృతి చెందుతున్నాయి. వాటిని షాక్ నుంచి రక్షించాలని అధికారులు నిర్ణయించారు.
కొండ కోనల నడుమ మనుగడ సాగించే గిరిజనుల జీవన చిత్రం వైవిధ్యంగా ఉంటుంది. ఆదివాసీల కట్టుబాట్లు, సంప్రదాయాలు, అలవాట్లు ఆసక్తి కలిగిస్తాయి. అవన్నీ దగ్గరగా చూడాలనుకున్న వారికి అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలోని గిరిజన మ్యూజియం కొత్త అనుభూతిని పంచుతుంది.
శతాబ్దాల చరిత్ర ఉన్న కొండపల్లి బొమ్మల తయారీ కళ కొత్తరూపు సంతరించుకుంటోంది. గతంలో కొన్ని రకాల బొమ్మలకే పరిమితమైన కళాకారులు వినియోగదారుల అభిరుచుల మేరకు కొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నారు.
ప్రస్తుత కాలంలో పుట్టినరోజులు, పెళ్లిళ్లను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్న రీతిలోనే కొందరు చావును కూడా అదే స్థాయిలో జరిపించేలా ఆసక్తి చూపిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయామనే బాధ ఒకవైపు ఉన్నా..
పచ్చగా మెరిసిపోతూ చెట్టు కొమ్మపై సేదతీరుతున్న ఈ పాము పేరు స్పాట్ టెయిల్డ్ పిట్ వైపర్. పొడ పాము జాతికి చెందిన ఈ సర్పం పగటి పూట ఎవరికీ కనిపించకుండా నిద్రావస్థలో ఉండి, రాత్రి వేళల్లో వేటాడుతుంది. మడ అడవుల్లో మాత్రమే నివసించే ఈ పాము..
కొంతమంది ప్రభుత్వ అధికారులు కోర్టు విచారణలంటే లెక్కలేకుండా, విచారణలపై గౌరవం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పదవీవిరమణ వయసు 60 నుంచి 62కి పెంచే వ్యవహారాన్ని నిర్లక్ష్యపూరితంగా 62 నుంచి 65 ఏళ్ల పెంపుగా ఆర్థికశాఖ ఉద్యోగులు పేర్కొనడాన్ని తప్పుపట్టింది.
ప్రధానమంత్రి మోదీ ఈ నెల 16 న కర్నూలులో జరిగే భారీ సభ లో పాల్గొంటున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వీలుగా తొమ్మిది మంది మంత్రులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్న పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు సంచార ర్యాపిడ్ కిట్లు(ఎంఆర్‌కె) తీసుకొచ్చినట్లు ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వీటి ద్వారా పీడీఎస్ బియ్యం అవునో కాదో నిర్ధారించవచ్చన్నారు.
జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జి కోట వినుత డ్రైవర్ రాయుడు తనపై ఆరోపణలు చేసినట్లు వెలుగులోకి వచ్చిన వీడియోపై లోతైన దర్యాప్తు జరపాలని స్థానిక తెదేపా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ వీడియో ఏఐతో సృష్టించిందా?
విద్యుత్తు ఉద్యోగులతో యాజమాన్యం నిర్వహించిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. విజయవాడలోని విద్యుత్తు సౌధలో యాజమాన్యం, ఉద్యోగ సంఘాల ఐకాస మధ్య సోమవారం సాయంత్రం రెండున్నర గంటల పాటు చర్చ జరిగింది. ప్రధాన డిమాండ్లపై యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ రాలేదని ఐకాస నేతలు ప్రకటించారు.
తమను కుట్రపూరితంగా హత్య కేసులో ఇరికించారని, దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో త్వరలోనే మీడియా ముందుకు వస్తానని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన నియోజకవర్గ మాజీ సమన్వయకర్త కోట వినుత పేర్కొన్నారు.
పోలీసులిచ్చిన నోటీసులను లెక్కచేయకుండా వ్యవహరించిన వైకాపా నాయకులు ఎట్టకేలకు దిగొచ్చారు. మాజీ మంత్రి, వైకాపా కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని), మరికొందరు సోమవారం మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు.
ఇబ్రహీంపట్నం, ములకలచెరువులో తయారైన నకిలీ మద్యం సీసాలకు అంటించిన లేబుళ్లను హైదరాబాద్‌లో పలువురి సాయంతో జనార్దన్‌రావు ్బఏ1్శ ముద్రించి తరలించేవాడు. వీటిని పలువురి నుంచి సమకూర్చడంలో రవి ్బఏ4్శ కీలక పాత్ర పోషించాడు.
మద్యం కుంభకోణం కేసు కీలకదశలో ఉందనీ.. దర్యాప్తులో ఇంకా పలు ముఖ్యమైన అంశాలు రాబట్టాల్సి ఉందనీ, నిందితులకు రిమాండ్ పొడిగించాలని ప్రాసిక్యూషన్స్ జేడీ రాజేంద్రప్రసాద్ వాదించారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి పరకామణిలో జరిగిన అక్రమాలు, లోక్ అదాలత్‌లో కేసు రాజీ వ్యవహారానికి సంబంధించిన రికార్డులను సీజ్ చేయాలని సెప్టెంబర్ 19న ఇచ్చిన ఆదేశాలను పోలీసు శాఖ, డీజీపీ పట్టించుకోకపోవడంపై హైకోర్టు మండిపడింది.
చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తే పోలీసు అధికారులపైనా చర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరించింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని ఒప్పుకొనే ప్రసక్తి లేదంది. కోర్టులు, కోర్టు ఉద్యోగులు, న్యాయవాదులతో ఎలా మెలగాలో పోలీసు అధికారులకు సూచనలు చేయాలని విచారణ నిమిత్తం కోర్టుకు హాజరైన హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్‌కుమార్‌ను మౌఖికంగా ఆదేశించింది.