ఏపీఎండీసీ బాండ్ల అమ్మకాలకు ప్రయత్నించినప్పుడు.. ఉదయ్‌భాస్కర్ అనే వ్యక్తితో ప్రపంచంలోని పెద్ద కంపెనీల అధికారులకు మెయిల్స్ చేయించడం వైకాపా దిగజారుడుతనానికి నిదర్శనమని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు.
ఎగువ ప్రాంతం నుంచి వరద కొనసాగుతుండడంతో సాగర్ జలాశయ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. బుధవారం రాత్రి 9 గంటలకు అందిన సమాచారం మేరకు.. శ్రీశైలం నుంచి 1,16,757 క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా.. ప్రాజెక్టు నీటిమట్టం 535.10 అడుగులకు చేరింది.
ఆరు, తొమ్మిది తరగతులు చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్లో జాతీయ సగటు కంటే రాష్ట్రం వెనుకబడింది. తొమ్మిదో తరగతి పిల్లల అభ్యసనలో జాతీయ స్థాయిలో 29, ఆరో తరగతికి సంబంధించి 33 స్థానాల్లో ఏపీ నిలిచింది.
వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, ఉద్యానవన అధికారులు, సాంఘిక సంక్షేమ సంయుక్త సంచాలకులు, సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్.. వీరంతా ఇప్పుడు పురపాలక కమిషనర్లు..! పట్టణ పరిపాలన వ్యవహారాల్లో వీరికి అనుభవం ఉందా? వీరు పని చేస్తున్న శాఖలకు పురపాలక సంఘాలకు ఏమైనా సంబంధం ఉందా? అంటే సమాధానం దొరకదు.
తన కుమారుడికి గడ్డి మందు ఇచ్చి వైకాపా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అనుచరులు హత్య చేశారని, మూడెకరాల పొలం రాయించుకొన్నారని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలానికి చెందిన మార్పు విజయలక్ష్మి వాపోయారు.
ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు నిర్వహించే ఆర్ట్, డిజైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఏడీ-సెట్) నిర్వహణ పేరుతో వైకాపా ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్ బంధువు ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయి.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో నమోదు చేసిన సీబీఐ కేసును కొట్టివేయాలని కోరుతూ దాల్మియా సిమెంట్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ప్రభుత్వ సహకారంతో ప్రముఖ అతిథ్య గమ్యస్థానంగా రాష్ట్రం అభివృద్ధికి కృషి చేస్తామని ఏపీ స్టార్ హోటళ్ల అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. ఆగస్టు 31తో ఎక్సైజ్ పాలసీ కాలపరిమితి ముగియనుంది.
మహిళల వ్యక్తిత్వ హననం చేసేలా వైకాపా నాయకులు తరచూ చేస్తున్న అత్యంత అవమానకర, అభ్యంతరకర వ్యాఖ్యలు... సమాజంపై వారి అభిప్రాయాలు ఏమిటో తెలుపుతోందని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి ధ్వజమెత్తారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కర్నాటి మురళి చదివింది ఆరో తరగతే అయినా.. ఆయనలోని వారసత్వ చేనేత ప్రతిభ జాతీయ అవార్డు వరకూ తీసుకెళ్లింది. తండ్రి నుంచి నేర్చుకున్న చేనేత ఇక్కత్ డిజైన్ కళ భవిష్యత్తు తరాలకూ అందాలని చేస్తున్న కృషికి ఎనలేని గుర్తింపు లభించింది.
పాఠశాలకు ఇబ్బందులు లేకుండా విద్యార్థులు రాకపోకలు సాగించేలా పంట కాలువపై సొంత సొమ్ముతో కాలిబాట వంతెన నిర్మించిన కాకినాడ జిల్లా గొల్లప్రోలు శివారు సూరంపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు అనిశెట్టి సీతారామరాజును కాకినాడ జిల్లా కలెక్టరు షాన్మోహన్ అభినందించి రూ.లక్ష చెక్కును అందిచారు.
తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన చేనేత కళాకారుడు, డిజైనర్ లక్కా శ్రీనివాసులు సంత్ కబీర్ అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ 2024 సంవత్సరానికి గానూ ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నలుగురు వైకాపా జడ్పీటీసీ సభ్యులు బుధవారం జనసేనలో చేరారు. జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని ఉద్దేశించి వైకాపా మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన మురికి వ్యాఖ్యలపై వచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.
రాష్ట్రంలో మరో రికార్డు సాధనకు రంగం సిద్ధమైంది. ఒకే రోజు రెండు కోట్ల మందితో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని (మెగా పీటీఎం-2.0) ప్రభుత్వం నిర్వహించనుంది.
విశాఖలో నవంబరు 14, 15 తేదీల్లో సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) 30వ భాగస్వామ్య సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్షించారు.
ఏలూరు జిల్లా పోలవరం వద్ద కుడి, ఎడమ గట్లను తాకుతూ గోదారమ్మ ప్రవాహిస్తోంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరికి వస్తున్న వరద శనివారం నాటికి మరింత పెరుగుతుందని కేంద్ర జలసంఘం అధికారులు చెబుతున్నారు.
మద్యం కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. వైకాపా హయాంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవకి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎయిర్ టాక్సీల తయారీ సంస్థ సరళ ఏవియేషన్ ఆసక్తి చూపింది. సంస్థ ప్రతినిధులు మంత్రి బీసీ జనార్దనరెడ్డిని సచివాలయంలో బుధవారం కలిసి చర్చించారు.
రాష్ట్రంలో ఒంగోలు, నాగార్జునసాగర్‌లో రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి సాంకేతిక, ఆర్థిక సాధ్యత నివేదిక (టీఈఎఫ్ఆర్) తయారు చేసేందుకు రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) ఓ ప్రకటన జారీ చేసింది.
మాజీ ముఖ్యమంత్రి జగన్ మామిడి రైతుల పరామర్శ కార్యక్రమానికి వచ్చి విలేకర్లతో మాట్లాడుతూ అబద్ధాల మోత మోగించారు. తమ హయాంలో ఎప్పుడూ తోతాపురి ధర కిలో రూ.22- 29కు తగ్గలేదని ప్రకటించారు.
రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ(శాప్) కార్యనిర్వాహక ఇంజినీర్ ఎం.సిద్ధయ్యపై రాష్ట్ర క్రీడల శాఖకు ప్రేమ తగ్గినట్లు లేదు. రోడ్లు, భవనాల శాఖకు చెందిన ఆయన డిప్యుటేషన్ కాలం 2024 ఆగస్టు 8తో ముగిసింది.
దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన భూముల్లోనే తాము ఇళ్లు కట్టుకుని ఉంటున్నామని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం రైతులు, గ్రామస్థులు తెలిపారు.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో రైతులతో మాట్లాడేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ అడుగడుగునా నిబంధనలు అతిక్రమించారు. పర్యటనకు ముందే పోలీసులు పదేపదే ఆంక్షల గురించి వివరించగా వైకాపా నేతలు షరతులకు అంగీకరించి, అనుమతులు తీసుకున్నారు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివి.. ఈఏపీసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో స్థానికేతర కోటా పొందాలంటే తల్లిదండ్రులు ఏపీలో పదేళ్లుగా ఉన్నట్లు సర్టిఫికెట్ సమర్పించాలి. మేలో జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉన్నత విద్యాశాఖ ఈ విషయాన్ని పేర్కొంది.
సామాజిక మాధ్యమాలలో అనుచిత, అభ్యంతరకర పోస్టులు/వ్యాఖ్యల కేసులలో నిందితులకు రిమాండ్ విధించేటప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించాలని, తమ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కోర్టుధిక్కరణ, శాఖాపరమైన విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని హైకోర్టు జారీచేసిన సర్క్యులర్ రాష్ట్రంలోని మేజిస్ట్రేట్లను బెదిరించేలా ఉందని సీనియర్ న్యాయవాది ఎన్.సుబ్బారావు, న్యాయవాది చాపర్ల సీతారాం హైకోర్టులో వాదించారు.
రాజధాని అమరావతి తరహాలో కుప్పం అభివృద్ధికి సింగపూర్ బృందంతో మాస్టర్ ప్లాన్, బ్లూ ప్రింట్ వేయిస్తున్నట్లు కుప్పం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (కడా) పీడీ వికాస్ మర్మత్ పేర్కొన్నారు.