వైకాపా పాలనలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించిన అరెస్టులు చూసి, మాజీ సీఎం జగన్‌రెడ్డి వణికిపోతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.
మద్యపాన నిషేధం అమలు చేస్తానని ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్.. కల్తీ మద్యంతో వేలాది మంది ప్రాణాలు తీశారని తెదేపా ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నక్కా ఆనంద్‌బాబులు ధ్వజమెత్తారు.
దక్షిణ భారతదేశంలోనే రెండో సబర్మతిగా పేరొందిన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం నిరాదరణకు గురవుతోంది.
రానున్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు.
వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.50 వేల కోట్ల రైల్వే నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించనుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
కొత్తగా బియ్యం కార్డుల కోసం, అలాగే పాతవాటిలో మార్పుచేర్పుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, అది నిరంతరం జరిగే కార్యక్రమమని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలను తమ పరిధిలోకి తీసుకురావాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం గురువారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది.
కానిస్టేబుల్ ఉద్యోగాలకు జూన్ 1న ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తుది రాత పరీక్ష నిర్వహించనున్నట్టు రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు ఛైర్మన్ రాజీవ్‌కుమార్ మీనా తెలిపారు.
పంటల సాగు ప్రణాళిక శాస్త్రీయ విధానంలో రూపొందించాలని.. దిగుబడులు, అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్ ఒడుదొడుకులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆర్టీజీఎస్, వ్యవసాయశాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలో రైతులకు ముందే చెప్పడం వల్ల డిమాండ్, సరఫరా మధ్య సమతూకం ఉంటుందని వివరించారు.
పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాల ఆధారంగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు సహకరించాలని ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులను ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ కోరారు.
అడవి ఏనుగుల నుంచి రైతుల్ని, పంటల్ని రక్షించడంలో సాయపడే కుంకీ ఏనుగులను రాష్ట్రానికి తీసుకురావడంలో సఫలీకృతులయ్యారని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు గురువారం అభినందనలు తెలిపారు.
సినీనటి కాదంబరీ జెత్వానీ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు బెయిలు మంజూరు చేస్తే.. దర్యాప్తునకు ఏవిధంగా ఆటంకం కలిగిస్తారు, సాక్షులను ఏవిధంగా ప్రభావితం చేస్తారనే అంశాలపై వాదనలు వినిపించాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌కు హైకోర్టు సూచించింది.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నగిరిపెంటకు చెందిన మేజర్ మల్లా రాంగోపాల్నాయుడికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కీర్తిచక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు.
ఇంటర్మీడియట్ విద్యా మండలి పరిధిలోని బదిలీల్లో ప్రిన్సిపాళ్లు, జూనియర్ లెక్చరర్లకు పనితీరు ఆధారిత పాయింట్లను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సీఎంవో మాజీ కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 26కి వాయిదా వేసింది.
బుగ్గమఠానికి చెందిన 3.88 ఎకరాల ఆక్రమిత భూమిని ఖాళీ చేయాలని, అందులో నిర్మాణాలను తొలగించాలంటూ మఠం ఈవో/అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే ఎండోమెంట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ ఏడాది వేసవిలోనూ రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. వాతావరణ మార్పుల ప్రభావంతో 2024లో ప్రతి నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.5 డిగ్రీలు ఎక్కువగానే నమోదయ్యాయి.
వైకాపా ప్రభుత్వంలో సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు బెదిరింపులకు దిగుతున్నారు. తమ ఎస్టేట్‌లోకి ఎలా అడుగు పెడతారో చూస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ గురువారం ప్రారంభించిన మాటామంతి కార్యక్రమాన్ని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి లాలన్‌సింగ్ అభినందిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ), భాగస్వామ్య సంస్థల నుంచి 49 మెగావాట్ల జల విద్యుత్ తీసుకునేలా దీర్ఘకాలిక కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకోవాలన్న డిస్కంల ప్రతిపాదనలపై వ్యక్తులు/భాగస్వామ్య పక్షాలు ఈ నెల 31లోగా సూచనలు/అభ్యంతరాలు పంపాలని ఏపీఈఆర్సీ పేర్కొంది.
ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించిన 300.30 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను దేశ్రాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదలాయించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్న జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీవీఐఏఎల్)తో అనుబంధ రాయితీ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఏపీఏడీసీఎల్ ఎండీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.
ప్రైవేటు వ్యక్తులు తమ భూమిలో జోక్యం చేసుకుంటున్నారంటూ వైసీపీ నేత వై.వి.సుబ్బారెడ్డి సతీమణి వై.స్వర్ణలతారెడ్డి ఇచ్చిన వినతి పత్రాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
వైకాపా ప్రభుత్వ పాపాలు రైతులను ఇంకా వెంటాడుతున్నాయి. ఒకటీ రెండు కాదు.. ఏకంగా మూడు పంట కాలాలకు (ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత బీమా కలిపి) రూ.1,990 కోట్ల పంటల బీమా ప్రీమియం బకాయిలు ఇంకా రావాల్సి ఉంది.