పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కొత్త ప్రయోగం చేపట్టింది. బ్యాంకు రుణంతో పాటు వివిధ అనుమతులను సులభతరం చేస్తూ ‘జీవనోపాధుల ప్రోత్సాహక విధానం’ తీసుకొచ్చింది.
‘రుషికొండపై ఏడాదికి రూ.7 కోట్ల ఆదాయం వచ్చే రిసార్ట్‌ను వైకాపా పాలకులు కూల్చేశారు. అభివృద్ధి పేరుతో రూ.453 కోట్లు వెచ్చించి ప్యాలెస్ నిర్మించారు. ఇప్పుడు కేవలం విద్యుత్ బిల్లులకే ఏడాదికి రూ.కోటిన్నర చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు.
నేరుగా (డైరెక్టు)జరిపే నియామకాలకు జీఓ-77 ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలో చేపట్టిన మొదటి నియామకాలు డీఎస్సీవే అని కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
‘అక్రమ మైనింగ్, ప్రకృతి విధ్వంసం, అవినీతి వంటివి వైకాపా విధానాలైతే, సామాజిక స్పృహతో కూడిన కార్యక్రమాలు నిర్వహించడం జనసేన పార్టీ విధానాలు’ అని ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
కీలక రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, పోటీతత్వం, సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ తయారీ మిషన్ ఉపయోగపడుతుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు.
ఆహారశుద్ధి, మత్స్యసంపద, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఈ రంగాల ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
విశాఖలోని రుషికొండ సమీప ఐటీహిల్స్‌పై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కార్యకలాపాలు ప్రారంభించడానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. హిల్-3లోని మిలీనియం టవర్స్‌లో లీజు ప్రాతిపదికన కేటాయించిన భవనాన్ని సిద్ధం చేస్తున్నారు.
పర్యాటక రంగంలో విశాఖ మరో మైలురాయి దాటింది. సాగర తీర అందాలను అంతెత్తు నుంచి వీక్షించేందుకు అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న నగర వాసుల కల నెరవేరింది.
సాధారణంగా జొన్న మొక్క అయిదారడుగులు మాత్రమే పెరుగుతుంది. ఈ చిత్రంలో కనిపిస్తుంది మాత్రం దాదాపు 15 అడుగుల ఎత్తు పెరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం చుక్కాయిపల్లి కాలనీలో విశ్రాంత ఉపాధ్యాయుడు రాజేందర్ ఇంటి ఆవరణలో ఈ మొక్క ఉంది.
కరీంనగర్‌లోని పెద్దపల్లి బైపాస్ రోడ్డులో రేణుక ఎల్లమ్మ గుడికి ఎదురుగా 60 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు ఆకారంలో మూషిక విమానాన్ని ఐసో టీమ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసింది.
‘రాజధాని అమరావతి’ నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని విజయవాడలోని విద్యాధరపురంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల ‘కార్యసిద్ధి మహాశక్తి గణపతి’ మట్టి విగ్రహాన్ని బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించి, పూజలు చేశారు.
విశాఖలోని శ్రీహరిపురంలో శివలింగాల వినాయక విగ్రహమిది. ముందుగా పీఓపీతో చిన్న చిన్న శివలింగాలు చేసి.. వాటన్నింటినీ ఒక్కోటిగా అతికిస్తూ ఇలా సుమారు 40 అడుగుల విగ్రహంగా తీర్చిదిద్దారు.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ గద్వాల్ సంస్థానం నుంచి ఎరువాడ జోడు పంచెలను ఆ సంస్థానం రాజు కృష్ణ ఆర్ భూపాల్ గురువారం అందజేశారు.
నీటి ప్రవాహంతో రాళ్లు కోతకు గురికావడాన్ని చూస్తుంటాం. దీనికి భిన్నంగా అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌లో గాలి తీవ్రత కారణంగా ఓ రాయి కోతకు గురైంది.
‘స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నవారు, ఈ రంగంలోని ఏజెంట్లు తమ వివరాలతో 30 రోజుల్లోగా రాష్ట్ర స్థిరాస్తి వ్యాపార ప్రాధికార సంస్థ (ఏపీరెరా)లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని ఆ సంస్థ ఛైర్మన్, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్‌కుమార్ హెచ్చరించారు.
ఆర్టీసీలో దాదాపు 2 వేల మందికిపైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే దస్త్రానికి సీఎం చంద్రబాబు మంగళవారం ఆమోదం తెలపగా.. దీనికి సంబంధించిన జీవో గురువారం వరకు జారీకాలేదు.
‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమనే చిన్న హామీని కూడా చెప్పింది చెప్పినట్లుగా అమలు చేయకుండా మోసగిస్తున్నారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి మాజీ సీఎం జగన్ విమర్శించారు.