Srisailam శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. మూడు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 80,646 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు అధికారులు విడుదల చేస్తున్నారు.
ఆషాఢ మాసం మూలానక్షత్రం సందర్భంగా లోక కల్యాణం కోసం శ్రీశైలక్షేత్ర గ్రామ దేవత అయిన అంకాళమ్మ వారికి దేవస్థానం తరుపున బోనం సమర్పించారు. ఈ సందర్భంగా అంకాళమ్మ అమ్మవారికి విశేష పూజలు చేశారు.