[20:15] ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) నిర్వహించాలన్న ఎన్నికల సంఘం (Election Commission of India) నిర్ణయం బిహార్ రాజకీయ వర్గాల్లో కాకరేపుతోంది.
పహల్గాం ఘటనలో పాకిస్థాన్ ఉగ్రవాదుల ప్రమేయానికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో మే 7న పాక్లోని ఉగ్రస్థావరాలపై భారత సేన విరుచుకుపడింది. ఈ క్రమంలోనే మూడు రాఫెల్ జెట్లతో సహా ఐదు భారత వైమానిక దళ యుద్ధ విమానాలను తాము కూల్చేసినట్టు పాక్ ప్రకటించుకుంది.