సీట్ల పంపకంపై ఎన్డీయే కూటమిలోని భాజపా, జేడీయూల మధ్య ఒప్పందం కొలిక్కివచ్చినా కొన్ని నియోజకవర్గాలను అటూఇటూ మార్చుకోవడంపై చర్చలు మొదలయ్యాయి. చిన్న పార్టీలకు అనుకూలంగా కొన్ని స్థానాలను ఇచ్చేందుకూ అవి సన్నద్ధం అవుతున్నాయి.
హరియాణాలోని కురుక్షేత్రకు చెందిన హర్వీందర్ సింగ్.. తాత కోరిక మేరకు క్రీడా మైదానం నుంచి వ్యవసాయ క్షేత్రానికి వచ్చి సిరులు పండిస్తున్నారు. ఇప్పుడాయన దేశంలోనే ఆలుగడ్డ విత్తనాల ఉత్పత్తిలో అగ్ర స్థానంలో నిలుస్తున్నారు.
ప్రఖ్యాత గాయకుడు జుబీన్ గర్గ్ మరణంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆయన చివరి క్షణాలకు సాక్షులుగా నిలిచిన నలుగురు అస్సామీ ప్రవాసులు విచారణలో భాగంగా సోమవారం పోలీసుల ముందు హాజరయ్యారని ఉన్నతస్థాయి అధికారి ఒకరు వెల్లడించారు.
టోల్‌ప్లాజాల్లో అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లపై ఫిర్యాదు చేసే వాహనదారుల ఫాస్టాగ్ అకౌంట్లకు రూ.1,000 బహుమతి రూపంలో జమచేస్తామని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రకటించింది.