మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై త్వరలో జరిగే పార్టీ మహానాడులో ప్రకటిస్తానని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత తెలిపారు. జనవరి 9వ తేదీ కడలూరులో నిర్వహించనున్న పార్టీ మహానాడులో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు, పార్టీ తరుఫున పోటీ చేసే అభ్యర్థుల వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు.
కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక మైసూర్ శాండల్ (Mysore Sandal) సబ్బుకు తమన్నా భాటియా(Tamannaah Bhatia)ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. దీంతో స్థానిక హీరోయిన్లైన రశ్మిక, శ్రీనిధి శెట్టి సహా పలువురి అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.