దేశంలోని పురపాలికల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన వ్యర్థాలను (లెగసీ వేస్ట్) జాతీయ రహదారుల నిర్మాణంలో వినియోగిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి మారుస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తమిళనాడులోని కరూర్‌లో సెప్టెంబరు 27న తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ ప్రచారసభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే.
దుకాణాల్లో ఏమైనా కొన్న తర్వాత చేత్తో ఫోన్ తీసి, పాస్వర్డ్ టైప్ చేసి, పేమెంట్ చేయడం కొన్ని సందర్భాల్లో కష్టంగా ఉంటోందా.. ఈ ఇబ్బంది తొలగించడానికి ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ ‘మ్యూజ్’.. ‘రింగ్‌వన్’ అనే కొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది.
అబ్బా ఈ రూట్లో రెడ్ సిగ్నల్స్ ఎక్కువగా ఉన్నాయి.. ముందే తెలిస్తే వేరే మార్గంలో వెళ్లేవాళ్లమే అని చాలా సార్లు అనిపిస్తుంది కదా..! ఇలా బాధపడేవారికి ఉపయోగపడేలా మ్యాప్ మై ఇండియా సహకారంతో బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీస్, ఆర్కాడిస్ ఇండియా సంస్థలు సంయుక్తంగా మ్యాపిల్స్ అనే యాప్‌ను తయారు చేశాయి.
కరూర్ దుర్ఘటన బాధిత కుటుంబాలను దత్తత తీసుకోవాలని టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్ణయించినట్లు పార్టీ ఎన్నికల నిర్వహణ విభాగం ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున వెల్లడించారు. తొక్కిసలాట కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.