కర్ణాటకలోని చిక్కమగళూరులో వ్యక్తి తన అత్త, మరదలు, కూతురును కాల్చి చంపి, చివరగా తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వదిలేసి వెళ్లిన విషయంపై ఊర్లో మాటలు పెరగడం, కూతురు పాఠశాలలో ప్రశ్నలు ఎదుర్కొవడం కారణంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు
బంగారం అక్రమ రవాణా కేసులో జైలులో ఉన్న నటి రన్యారావ్ కు విడాకులు ఇవ్వాలని ఆమె భర్త జతిన్ హుక్కేరి నిర్ణయించారు. పెళ్లి తర్వాత మనస్పర్థలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు
కలకత్తా హైకోర్టు చెత్తకుప్ప కాదని న్యాయవాదులు విమర్శిస్తూ, జస్టిస్ దినేశ్ శర్మ బదిలీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆయనకు న్యాయపరమైన బాధ్యతలు అప్పగించవద్దని, కోర్టు విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు
వక్ఫ్ సవరణ బిల్లును కోర్టులో సవాలు చేస్తామని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది. బిల్లును ముస్లిం ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నంగా అభివర్ణిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు చేస్తామని వెల్లడించింది
అంగన్వాడీ కార్యకర్తల వేతనాన్ని రెట్టింపు చేయాలని, వారి కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్రానికి సిఫారసు చేసింది. అలాగే, ఖాళీగా ఉన్న 2.13 లక్షల అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయాలని సూచించింది
ఎస్సీ, ఓబీసీ, ఈబీసీ విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ను పెంచాలని పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్రానికి సూచించింది. ఉపకార వేతనాల మంజూరులో జాప్యం లేకుండా పథకాల సమీక్ష అవసరమని పేర్కొంది
[04:04] సుదీర్ఘ సంవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్ష ఇండియా కూటమి, ఎంఐఎం తదితర పక్షాల ఆరోపణలను, విమర్శలను అధికార పక్షం గట్టిగా తిప్పికొట్టింది.
[04:02] జమ్మూ కశ్మీర్ పూంఛ్ జిల్లాలోని సరిహద్దులవద్ద మందుపాతర పేలిన అనంతరం పాకిస్థాన్ దళాలు కాల్పులకు దిగాయి. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా కాల్పులకు తెగబడ్డాయి.
[04:01] మనదేశంలోకి విదేశీయుల రాక, నివాసాన్ని నియంత్రించేందుకు ఉద్దేశించిన వలసలు, విదేశీయుల(ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్) బిల్లు 2025 బుధవారం పార్లమెంటు ఆమోదం పొందింది.