[03:54] సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా మరియం అలెగ్జాండర్ బేబీ (ఎంఏ బేబీ) ఎన్నికయ్యారు. సీపీఎం 24వ అఖిల భారత మహాసభలు మదురైలో ఈ నెల 2వ తేదీ నుంచి జరుగుతున్నాయి. చివరి రోజైన ఆదివారం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికైనట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు.
శ్రీరామనవమి రోజున అయోధ్య రామమందిరంలో మధ్యాహ్నం 12గంటలకు రాముడి విగ్రహ నుదిటిపై సూర్య తిలకం ప్రదర్శితమైంది. ఈ ఆధ్యాత్మిక దృశ్యం నాలుగు నిమిషాల పాటు కొనసాగగా, వేలాది మంది భక్తులు దీన్ని తిలకించి ఆనందించారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, మైనార్టీ సామాజికవర్గానికి చెందిన తొలి నేతగా ఇది చరిత్రలో నిలిచింది. విద్యా మంత్రిగా పనిచేసినప్పుడు సంస్కరణలు తెచ్చిన ఆయన, బీజేపీని ఎదుర్కోవడమే తన ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.
[03:47] తమిళనాడులోని అన్ని సర్కారు బడుల్లో విద్యనభ్యసిస్తున్న 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు సాంకేతికత అంశాల్లో రాటుదేలేలా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ(ఏఐ), కోడింగ్, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఆన్లైన్ టూల్స్‌కు సంబంధించిన పాఠ్యాంశాల్ని వారికి బోధించేందుకు రంగం సిద్ధం చేసింది.