వచ్చే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే జతకట్టిన కూటమి విజయం సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ అన్నారు. తిరుచ్చి మానగర జిల్లా డీఎండీకే కార్యదర్శి టీవీ గణేష్ ఇంటి శుభకార్యం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రేమలత విజయకాంత్ విలేఖరులతో మాట్లాడుతూ... తాము చేపట్టిన ‘ఉల్లం తేడి ఇల్లం నోడి’ రెండో విడత రథయాత్ర సెప్టెంబరు 5న ప్రారంభమై 10 రోజులు జరుగుతుందన్నారు.
Cloudburst: రుద్రప్రయాగ్, చమోలీ జిల్లాల్లో క్లౌడ్బస్ట్ జరిగింది. దీంతో కుంభవృష్టి కురిసింది. భారీ స్థాయిలో అక్కడ వరద, బురద పొంగిపొర్లింది. దీని వల్ల వందల సంఖ్యలో కుటుంబాలు ఆ శిథిలాల్లో చిక్కుక�
నాగపట్నం జిల్లా వేలాంకన్ని ప్రాంతంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సెయింట్ మేరీమాత క్షేత్రంలో 10 రోజుల పాటు నిర్వహించనున్న వార్షికోత్సవాలు శుక్రవారం పతాకావిష్కరణలతో ప్రారంభంకానున్నాయి. అమ్మవారి జయంతిని పురస్కరించుకుని ఈ ఆలయంలో ప్రతిఏటా జరుపుకునే ఉత్సవాల్లో దేశ, విదేశాల నుండి భక్తులు, పర్యాటకులు పెద్దసంఖ్యలో పాల్గొనడం ఆనవాయితీ.
కేరళ రాష్ట్రంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ‘అమీబా’ వ్యాధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం పేర్కొన్నారు.ఆయన గురువారం నగరంలో మీడియాతో మాట్లాడుతూ...కార్పొరేషన్, మున్సిపాలిటీ, పశుసంవర్థకశాఖల సహకారంతో వీధి కుక్కల బెడదను నివారించేందుకు పలు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.