[05:14] పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ విచారణలో అంగీకరించిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(33)కు హిసార్ జిల్లా కోర్టు మరో నాలుగు రోజుల రిమాండ్ విధించింది.
ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టులపై జరిగిన ఎన్‌కౌంటర్‌ను సీపీఎం తీవ్రంగా ఖండించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపకపోవడం, అమానుష హత్యలను మానివలసిందిగా సీపీఎం ఆహ్వానించింది.
[05:09] దక్షిణ కశ్మీరులోని పహల్గాం పట్టణం ఏప్రిల్ 22న పర్యాటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి పర్యవసానాల నుంచి ఇంకా కోలుకోలేదు. 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకొన్న నాటి మారణకాండ తర్వాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో పహల్గాంతోపాటు పరిసర గ్రామాల స్థానికులు జీవనోపాధిని కోల్పోయారు.
[05:13] ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. పహల్గాం తరహాలో మరో ఉగ్రదాడి జరిగితే భారతదేశం తప్పకుండా స్పందిస్తుందని, ఉగ్రవాదులు పాకిస్థాన్‌లో ఎక్కడున్నా వేటాడి మరీ దాడి చేస్తుందని తేల్చి చెప్పారు.
గూఢచర్య ఆరోపణలపై అదుపులో ఉన్న హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు యూఏఈలోని వెగో అనే ట్రావెల్ ఏజెన్సీ స్పాన్సర్‌గా ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. వేగో సంస్థకు పాక్‌లో కార్యకలాపాల లైసెన్స్ ఉన్నప్పటికీ, నిధుల సమకూర్పుపై ఇప్పటివరకు ఎలాంటి నిబంధనలు కనిపించలేదు
ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం ప్రతీకూల వాతావరణ కారణంగా శ్రీనగర్‌లో అత్యవసర ల్యాండింగ్ నిర్వహించాల్సి వచ్చింది. పాక్ గగనతలంలోకి మారాలని పైలట్ చేసిన అభ్యర్థన తిరస్కరించబడింది.
[05:06] పహల్గాం ఘటన కంటే కొన్ని వారాల ముందే దిల్లీలో భారీ ఉగ్రదాడికి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కుట్ర పన్నినట్లు తాజాగా బయటికొచ్చింది. నేపాల్ గూఢచారితో ఐఎస్ఐ పన్నిన ఈ కుట్రను మన నిఘా సంస్థలు సీక్రెట్ ఆపరేషన్‌తో భగ్నం చేశాయి.
[05:07] తేనేటి దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ప్రపంచ దేశాలకు భారత్ తేనీటి విందు ఇచ్చింది. డార్జిలింగ్ టీ, మసాలా చాయ్, నీలగిరి, అస్సాం టీ లాంటి భారతీయ ప్రత్యేక టీ రకాలను ఆయా దేశాల ప్రతినిధులు రుచి చూశారు
[05:04] భారత్- నేపాల్ అంతర్జాతీయ సరిహద్దు గుండా పాకిస్థాన్, బంగ్లాదేశ్ పౌరులు అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్నారని వస్తున్న నిఘా సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
పన్నెండేళ్ల దళిత బాలికపై ఐదుగురు బాలురు తాము చదువుకుంటున్న పాఠశాలలోని ప్రిన్సిపల్ గదిలో సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ ఘోరాన్నంతా సెల్ఫోన్లో చిత్రీకరించారు.
ఆపరేషన్ సిందూర్ విజయానికి అగ్నిపథ్ ద్వారా చేరిన అగ్నివీరులు కీలక పాత్ర పోషించారు. వాళ్లు పాక్ దాడులను అడ్డుకుని, మన సైనిక స్థావరాలను రక్షించడంలో ప్రతిభ కనబర్చారు.
[05:03] మహారాష్ట్రలోని ధులె పట్టణ ప్రభుత్వ అతిథిగృహం నుంచి పెద్దమొత్తంలో నగదు స్వాధీనం చేసుకొన్న వ్యవహారంలో రాష్ట్ర శాసనమండలి ఛైర్పర్సన్ రామ్ శిందే ఓ ఉద్యోగిని గురువారం సస్పెండు చేశారు.
[05:02] నియోగదార్లకు అందించే డీటీహెచ్ సేవలపై రాష్ట్ర శాసనసభలు, పార్లమెంటు వినోద పన్ను, సేవా పన్ను విధించొచ్చని సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది.
[05:00] వక్ఫ్ సవరణ చట్టం-2025ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. మూడు అంశాలపై మధ్యంతర ఉపశమన ఉత్తర్వులకు సంబంధించి తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం గురువారం రిజర్వు చేసింది.
[04:59] యాంటీబయాటిక్‌లు ఎక్కువగా వాడటం వల్ల వ్యాధికారక బ్యాక్టీరియా ఔషధ ప్రభావానికి లొంగని ‘సూపర్‌బగ్’గా మారి రోగికి ప్రాణాంతకంగా పరిణమిస్తుంటుంది. ఈ ప్రమాదకర పరిస్థితికి పరిష్కారం చూపే కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది.