హర్యానా ఐపీఎస్ పురాన్ కుమార్ ఆత్మహత్య కేసులో ఇది భారీ ట్విస్ట్. హర్యానాలోని రోహ్తక్ జిల్లా సైబర్ సెల్లో పనిచేస్తోన్న ASI సందీప్ ఇవాళ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు పేజీల సూసైడ్ నోట్, వీడియో సందేశం..
'ఇండియా' కూటమి భాగస్వాములకు సీట్ల కేటాయింపుపై ఆర్జేడీ మరికొద్ది గంటల్లోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రఘోపూర్ నియోజకవర్గం నుంచి తేజస్వి బుధవారంనాడు నామినేషన్ వేయనున్నట్టు చెబుతున్నారు.
బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీపంలోని అర్మీ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి చుట్టుపక్కలకు మంటలు విస్తరించకుండా వెంటనే అదుపులోనికి తెచ్చారు.
ఆ వ్యక్తి పరుగున హోటల్ దగ్గరకు వెళ్లాడు. భార్య ఓ యువకుడి పక్కన కనిపించింది. అంతే ఆ వ్యక్తి రెచ్చిపోయాడు. భార్య పక్కన ఉన్న యువకుడ్ని రోడ్డుపైకి లాక్కుని వచ్చి కొట్టడం మొదలెట్టాడు.
తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సామ్రాట్ చౌదరి పోటీ చేయనుండగా, లఖిసరాయ్ నుంచి విజయ్ సిన్హా పోటీ చేయనున్నారు. లఖిసరాయ్ నియోజకవర్గానికి నాలుగుసార్లు విజయ్ సిన్హా ప్రాతినిధ్యం వహించారు. 2005, 2010, 2015, 2020లో ఆయన వరుసగా గెలుస్తూ వచ్చారు.
తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సమ్రాట్ చౌదరి పోటీ చేయనుండగా, లఖిసరాయ్ నుంచి విజయ్ సిన్హా పోటీ చేయనున్నారు. లఖిసరాయ్ నియోజకవర్గానికి నాలుగుసార్లు విజయ్ సిన్హా ప్రాతినిధ్యం వహించారు. 2005, 2010, 2015, 2020లో ఆయన వరుసగా గెలుస్తూ వచ్చారు.
పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను కలుసుకున్న అనంతరం మీడియాతో రాహుల్ మాట్లాడుతూ, ఐపీఎస్ అధికారిపై జరిగిన వివక్ష దళితులు ఎంత విజయం సాధించినా అణిచివేత తప్పదనే తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేస్తుందని అన్నారు.
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్.. పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆ కొద్ది సేపటికి ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు నిల్వ ఉంచి ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
రాష్ట్ర డీజీపీగా ఓం ప్రకాశ్ సింగ్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ సంస్థ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు.
మహారాష్ట్రలో మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్‌రావు పోలీసుల ఎదుట లొంగిపోయారు. 60 మందితో కలిసి గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల మల్లోజుల లేఖ విడుద చేసిన విషయం తెలిసిందే.
అన్ని పార్టీల ఓట్లను తమిళగ వెట్రి కళగం (టీవీకే) తప్పకుండా చీలుస్తుందని, ఇందువల్ల కూటమికి నష్టంవాటిల్లకుండా అధికార డీఎంకే చర్యలు తీసుకోవాలని కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి (కేఎండీకే) ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ఈశ్వరన్ అభిప్రాయం వ్యక్తంచేశారు.
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో పొత్తు కుదుర్చుకోనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
కశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భద్రతా దళాలు మరోసారి భగ్నం చేశాయి. కుప్వారాలో సోమవారం రాత్రి జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి.
కరూర్‌లో టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారపర్యటన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబాలను దత్తత తీసుకుంటామని ఆ పార్టీ ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జునా తెలిపారు.
గాజా శాంతి సదస్సుకు హాజరు కావాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఈజిప్టు అధ్యక్షుడు వ్యక్తిగతంగా ఆహ్వానించారు. అయితే నరేంద్ర మోదీ ఈ సదస్సుకు దూరంగా ఉండేందుకే నిశ్చయించుకున్నారు.
ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నందున అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 29 వరకూ 14 రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని షర్జీల్ ఇమామ్ కోరారు. నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు, ఎన్నికల ప్రచారానికి తాత్కాలిక బెయిల్ అనివార్యమని అన్నారు.
గాజాలో మరణాలు, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తెహ్రీక్-ఇ-లబైక్ పాకిస్థాన్ (TLP) కార్యకర్తలు చేస్తోన్న ఆందోళనలతో పాకిస్థాన్ రణరంగంగా మారింది. గతవారం మొదలైన ఈ ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గత శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రధాని తాజా సందేశం ఇచ్చారు. కాల్పుల విరమణలో భాగంగా రెండేళ్లుగా పైగా బందీలుగా ఉన్న 20 మందిని హమాస్ సోమవారం ఉదయం విడిచిపెట్టింది.
ఎన్నికల్లో పోటీచేసే 116 మంది అభ్యర్థులను ఇంతవరకూ ప్రకటించామని, త్వరలోనే తక్కిన అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
భారతీయులు చాలా కాలం నుంచి తమ మెయిల్స్ పంపించుకునేందుకు ముఖ్యంగా జీ మెయిల్, తదితర ఫ్లాట్ ఫామ్స్ వాడుతున్నారు. అయితే, ఇక నుంచి స్వదేశీ సంస్థ అయిన జోహో సేవల్ని ఉపయోగించుకోబోతున్నారు.
కరకట్ లోక్ సభ స్థానానికి పవన్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. రాజారామ్ సింగ్ కూశ్వాహపై ఓడిపోయారు. ఈసారి పవన్ సింగ్ భార్య కరకట్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తోంది.