[12:15] Mallikarjun Kharge: భాజపా ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన విమర్శలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సినిమాటిక్ స్టైల్లో కౌంటర్ ఇచ్చారు.
[06:10] శ్రీలంక నుంచి కచ్చతీవును తిరిగి పొందాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. శాసనసభలో బుధవారం ఈ తీర్మానాన్ని సీఎం స్టాలిన్ ప్రవేశపెట్టారు.
[06:12] భాజపా-ఆర్ఎస్ఎస్ శక్తులు రాజ్యాంగ విరుద్ధ, ప్రజా వ్యతిరేక కార్యకలాపాల దిశగా వెళుతున్నాయని.. వాటిని ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని సీపీఎం సీనియర్ నేత, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ పిలుపునిచ్చారు.
[06:43] ప్రభుత్వమే సర్వోన్నతమైనదని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ బుధవారం పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పాలన అనేది కార్యనిర్వాహక వ్యవస్థ ద్వారా మాత్రమే సాగుతుందని, న్యాయస్థానాల వల్ల కాదన్నారు.
[04:58] వక్ఫ్ (సవరణ) బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, కేంద్ర హోం మంత్రి, భాజపా అగ్రనేత అమిత్ షా పరస్పరం వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు.
[04:58] భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ గుజరాత్‌లోని జామ్‌నగర్ ఐఏఎఫ్ స్టేషను సమీప గ్రామ మైదానంలో బుధవారం రాత్రి 9.30 ప్రాంతంలో కూలిపోయింది.
[04:57] మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
[04:04] సుదీర్ఘ సంవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్ష ఇండియా కూటమి, ఎంఐఎం తదితర పక్షాల ఆరోపణలను, విమర్శలను అధికార పక్షం గట్టిగా తిప్పికొట్టింది.
[04:02] జమ్మూ కశ్మీర్ పూంఛ్ జిల్లాలోని సరిహద్దులవద్ద మందుపాతర పేలిన అనంతరం పాకిస్థాన్ దళాలు కాల్పులకు దిగాయి. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా కాల్పులకు తెగబడ్డాయి.
[04:01] మనదేశంలోకి విదేశీయుల రాక, నివాసాన్ని నియంత్రించేందుకు ఉద్దేశించిన వలసలు, విదేశీయుల(ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్) బిల్లు 2025 బుధవారం పార్లమెంటు ఆమోదం పొందింది.