పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘గురుకులాలా లేక నరకకూపాలా? ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విషవలయాలా?’ అని బుధవారం ఎక్స్ వేదికగా నిలదీశారు. ముఖ్యమంత
దుమ్ము.. పొగతో వాయు కాలుష్యం. గుంటూరు నగరంలో రోజురోజుకు వాయు కాలుష్యం తీవ్రమవుతోంది. వాహనాల నుంచి వచ్చే పొగ, రోడ్లపై పేరుకుపోతున్న దుమ్ము ధూళి గాలిలో కలిసి పోతోంది. దీనిని పీలుస్తున్న నగరవాసులు అనారోగ్యాల బారిన పడుతున్నారు.
రష్యా-ఉక్రెయిన్ పోరు ప్రపంచ యుద్ధంగా మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అణ్వస్త్ర యుద్ధంగానూ పరిణమించే ప్రమాద మూ పొడసూపుతున్నది. తృటిలో ముగుస్తుందన్నట్టుగా మొదలైన ఈ యుద్ధం సుదీర్ఘంగా సాగుతూ వెయ్యి
ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించాలని, దానిని కాపాడాలని కలెక్టర్ వెంకటమురళి పిలుపిచ్చారు. అటవీశాఖా ఆధ్వర్యంలో సూర్యలంక సముద్రతీరంలో బుధవారం కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.
సర్కారు స్కూళ్లల్లోని పదో తరగతి విద్యార్థులను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గాలికొదిలేసింది. స్పెషల్క్లాసులని హడావుడి చేస్తున్న ప్రభుత్వం విద్యార్థుల కడుపుమాడ్చుతున్నది.
[01:38]‘‘విడుదలైన ప్రతి సినిమానీ కాకుండా... మంచి సినిమానే చూడాలనుకుంటా. నటించడంలోనూ అదే నియమాన్ని పాటిస్తుంటా. ఎలాంటి సినిమాని చూడటానికి ఇష్టపడతానో, అలాంటి మంచి కథ అనిపించినప్పుడే నటించడానికి అంగీకారం తెలుపుతుంటా’’ అంటున్నారు శ్రద్ధా శ్రీనాథ్’.
[01:39]‘‘పండగకి మంచి వినోదం పంచాలనే ఉద్దేశంతో చేసిన సినిమానే ఇది’’ అన్నారు వెంకటేశ్. ఆయన కథానాయకుడిగా... అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’.
[01:24]ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి విజయాన్ని ఊహించలేదని అంటున్నారు దర్శకురాలు పాయల్ కపాడియా. ఆమె తెరకెక్కించిన తన తొలి ఫీచర్ ఫిల్మ్ ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’.
గత అనుభవాల దృష్ట్యా ఈ దఫా తుళ్లూరు పోలీసులు రౌడీషీటర్ బోరుగడ్డ విషయంలో కాస్తంత కటువుగానే వ్యవహరించారు. బోరుగడ్డను రెండు కేసుల్లో రెండు రోజులు పాటు కస్ట్టడికి అనుమతిస్తూ మంగళగిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పంట పొలాలకు వెళ్లాలంటే ఎక్కడ అటవి జంతువులు దాడి చేస్తాయోనని వణికిపోతున్నారు. మరో వైపున వ్యవసాయ పంటపొలాల వద్ద పశువులపై, చేతికి అందివచ్చిన పంటలపై అటవీ జంతువులు దాడి చేసి హతమార్చటం, గాయపరచటం, నష్టపరచటంతో రైౖతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
జేకేసీ కళాశాల ఎంతో మంది ఉన్నతికి కారణమైంది. ఇలాంటి కళాశాల విద్యార్థినని చెప్పుకోవడం గర్వకారణం. కళాశాలలో అధ్యాపకులు, యాజమాన్యం చదువుతోపాటు సంస్కారాన్ని నేర్పించారు. ఫలితంగా ఇక్కడ చదివిన ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్‌లుగా రాణిస్తున్నారు.. అని రాష్ట్ర డీజీపీ, జేకేసీ కళాశాల పూర్వ విద్యార్థి సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులను చెల్లిస్తున్న ప్రభుత్వానికి.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించేందుకు మాత్రం నిధులు లేవా? అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు.
భారత వెటరన్ ఫుట్‌బాల్ ప్లేయర్ డీఎంకే అఫ్జల్‌కు సాట్స్ అండగా నిలిచింది.ఆర్థిక, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అఫ్జల్‌కు సాట్స్ తరఫున రూ.3లక్షల ఆర్థిక సాయం అందజేశారు.
ఎన్నో ఏళ్ల కల సాకారమవుతుందనుకున్న తరుణంలో గత ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చేయడంతో గొల్లపల్లి మండలంలోని దట్నుర్ చెరువు పై నిర్మించతలపెట్టిన వంతెన నిర్మాణం పనులు పిల్లర్ల దశకే పరిమితమవడంతో గ్రామస్థుల కల కలగానే మిగిలిపోయింది. దట్నుర్ వాగు పై వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కొన్ని దశాబ్దాలుగా ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి ఎన్నికలకు అధికారులు సిద్ధమవగా.. తమకు గ్రామాల్లో పట్టు ఉందని నిరూపించుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలు పన్నుతుండగా ప్రభుత్వం సాగునీటి సంఘాల ఎన్నికలను వాయిదా వేసింది. ఎన్నికలకు సంబంధించి గురువారం విడుదల చేయాల్సిన నోఫికేషన్‌ను ప్రభుత్వం నిలిపివేసింది.
జిల్లాలోని బసంత్‌నగర్‌లో ఎప్పటినుంచో ప్రతిపాదనలో ఉన్న విమానాశ్రయం నిర్మాణంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటన చేయడంతో ఈ ప్రాంత ప్రజల్లో ఆశలు పదిలంగా ఉన్నాయి. మంగళవారం వరంగల్‌లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రాష్ట్రంలో వరంగల్‌తో పాటు కొత్తగూడెం, రామగుండం బసంత్‌నగర్, ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టులు నిర్మిస్తామని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
కృష్ణా - గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నిక కోసం జరుగుతోన్న ఓటరు నమోదు ప్రక్రియ ముసాయిదా జాబితాల ప్రచురణ దశకు చేరుకున్నది. నోటిఫికేషన ప్రకారం ఆమోదించిన దరఖాస్తుదారుల పేర్లతో ముసాయిదా ఓటర్ల జాబితా ముద్రణకు చర్యలు చేపట్టారు.
కోరుకున్న బ్రాండ్లు.. కావాల్సిన మద్యం.. గతంలోలా చెల్లింపులకు పరిమితులు లేకపోవడం.. కొన్ని బార్లలోనూ ఎమ్మార్పీకే మద్యం అమ్మకాలు.. నేపథ్యంలో అటు మందుబాబులు, ఇటు ఎక్సైజ్ శాఖ ఖుషీ చేసుకుంటోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి కార్యాక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని, నేత కార్మికులకు ఉపాధి కల్పించడానికి స్వశక్తి సంఘాల మహిళలకు చీరలు అందించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
[01:22]మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘బరోజ్’. 3డీ ఫాంటసీ, ఎపిక్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది.
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి, 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ డాక్టర్‌ను స్కూల్‌కు పిలిపించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర�
[01:21]హకూనా మటాటా....ఈ మాట వినగానే ‘ది లయన్ కింగ్’ ప్రపంచం గుర్తొస్తుంది. కానీ ఈ సారి ఆ మాటని ‘హకూనా ముఫాసా.... సింహం సింగిల్ పీసా..’ అంటూ సరదాగా మార్చేశాయి అందులోని పుంబా, టిమోన్ పాత్రలు.
[01:20]ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్, ఆయన భార్య సైరా బాను విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఎక్స్ వేదికగా రెహమాన్ స్పందించారు.
గ్రామ పంచాయతీ నుంచి గానీ, పంచాయతీరాజ్ శాఖ నుంచి గానీ ఎటువంటి అనుమతులు లేకుండా ఒక ప్రైవేటు కర్మాగారం యాజమాన్యం తన సొంత అవసరాల కోసం దర్జాగా రహదారిని వెడల్పు చేస్తున్నది. పైగా పనులకు అయ్యే వ్యయాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల నుంచి ఖర్చు చేయడం విశేషం.
జిల్లాకు మరో భారీ పరిశ్రమ రానున్నది. నక్కపల్లి కేంద్రంగా బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ) కోసం ఏపీఐఐసీ సేకరించి సుమారు రెండు వేల ఎకరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆధ్వర్యంలో బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటు చేయనున్నారు. దీంతో నక్కపల్లి, పరిసర ప్రాంతాలను ఫార్మా హబ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.
విద్యార్థులకు ‘అపార్’ (ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ర్టీ) నంబర్ల కేటాయింపు, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆధార్ కార్డుల్లో తప్పులు సరిదిద్దేందుకు విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజల రాకతో ఆధార్ కేంద్రం వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. దీంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నదని వాపోతున్నారు.
జిల్లాలో 1-12 తరగతులు చదువుతున్న విద్యార్థుల అపార్ ఐడీకి జనన ధ్రువీకరణపత్రం జారీ చేసేనిమిత్తం నోటరీ, అఫిడవిట్లు అవసరంలేకుండా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు డీఈవో కేవీఎస్ కుమార్ తెలిపారు.
విశాఖ డెయిరీపై సభా సంఘం వేయాలని శాసనసభ నిర్ణయించింది. సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ విశాఖ డెయిరీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, డెయిరీని రైతులకు కాకుండా చేసి ఓ కుటుంబం సొంత ఆస్తిలా ఉపయోగించుకుంటున్నదని ఆరోపించారు.
శబరిమలై, తిరుమల, షిర్డీ రైళ్లకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. మండల దర్శనాలు ప్రారంభం కావడంతో ఎర్నాకులం వరకూ వెళ్లే రైళ్లకు తాకిడి పెరిగింది. ఎర్నాకులం రైళ్లకు జనవరి 19 వరకు బెర్తులు లభించే పరిస్థితి లేదు. అలాగే షిర్డీ వెళ్లే సాయినగర్ ఎక్స్‌ప్రెస్‌కు (18503) జనవరి 16 వరకు, తిరుపతి వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌కు (17488) డిసెంబరు నెలాఖరు వరకు బెర్తులు నిండిపోయి నిరీక్షణ జాబితా కనిపిస్తోంది. ఆ మూడు ప్రాంతాలకు విశాఖ మీదుగా నడిచే వారాంతపు రైళ్లకు కూడా అదే పరిస్థితి ఏర్పడింది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని, ఆయుష్మాన్ భారత్ రాష్ట్ర బృందం నోడల్ అధికారి డాక్టర్ నరేష్ అన్నారు.
మహిళలకు మరింత తోడ్పాటు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయి. ఇందులో భాగంగా మహిళా స్నేహపూర్వక పంచాయతీల (ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాయి.
టోడ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం మద్దతుగా వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై హనుమకొండ లో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని బీఆర్టీయూ రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు వే
నగరంలోని ఆర్కే బీచ్ రోడ్డుకు మరో అదనపు ఆకర్షణ జత కాబోతోంది. నేవీ మ్యూజియం కాంప్లెక్స్‌లో యుహెచ్ 3 హెచ్ హెలికాప్టర్ మ్యూజియం రానున్నది. తూర్పు నౌకాదళంతో కలిసి విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) ఆర్కే బీచ్‌రోడ్డులో పర్యాటకుల కోసం మ్యూజియాలు ఏర్పాటుచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ మూడు మ్యూజియాలు (కురుసుర సబ్‌మెరైన్, టీయూ-142 యుద్ధ విమానం, సీ హ్యారియర్ ఫైటర్ మ్యూజియం) ఏర్పాటయ్యాయి. నీటిలో మాత్రమే ఉండే సబ్‌మెరైన్‌ను అతి కష్టమ్మీద తీరానికి తీసుకువచ్చి మ్యూజియంగా మార్చారు. అలాగే టీయూ-142 యుద్ధ విమానాన్ని ఒకచోట నిలిపి...కాక్‌పిట్, లోపలి భాగాలు చూడడానికి పైకి మెట్లు నిర్మించారు. సీ హ్యారియర్ ఫైటర్ విమానాన్ని వినూత్నంగా గాలిలో వేలాడదీశారు. వీటి నిర్మాణం, సేవలు కళ్లకు కట్టేలా చిత్ర ప్రదర్శనలుఏర్పాటుచేశారు.
విశాఖపట్నం పోర్టుకు ఇటీవల కాలంలో భారీ నౌకల రాక పెరుగుతోంది. పోర్టు లోపలకు నౌకలు వచ్చే ఛానల్ లోతు(డ్రాఫ్ట్)ను డ్రెడ్జింగ్ ద్వారా పెంచడం, అలాగే బెర్తుల వద్ద ఎక్కువ లోతు చేయడంతో భారీ నౌకల రాకపోకలకు మార్గం సుగమమైంది. ఈక్యు 6 బెర్తు లోతును 11 మీటర్ల నుంచి 11.5 మీటర్లకు పెంచారు.
రైలు బోగి నుంచి పొగలు వస్తు న్నాయి.. మరో వైపు సిబ్బంది అంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు.. కొందరు రక్తం కారు తున్న ప్రయాణికులు కిందకు దించు తుంటే.. మరికొందరు కట్టుకడుతున్నారు..
విభజన తర్వాత తిరుపతి జిల్లాకు అపారమైన మత్స్య సంపద కలిసివచ్చింది. ఏకంగా 80 కిలోమీటర్ల పొడవైన సముద్రతీరం వరంగా వచ్చింది. 460 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంగల పులికాట్ సరస్సులో అత్యధికభాగం జిల్లాలో భాగం అయింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామిని సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి బుధవారం దర్శనం చేసుకున్నారు. ఉదయం 10.57 నిమిషాలకు రాజన్న ఆలయ గుడి చెరువు వద్ద హెలికాప్టర్ దిగిన సీఎం నేరుగా రాజన్న ఆలయానికి చేరుకున్నారు. రాజన్న ఆలయానికి సీఎం రేవంత్‌రెడ్డి రావడంతో పోలీసలు గౌరవ వందనం చేశారు. ఆలయ అర్చకులు సీఎంకు ఫూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న అన్నదాతకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు పంపింది.ధాన్యం విక్ర యాల్లో అన్నదాతలు పడుతున్న అవస్థ లను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభు త్వం వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయిం చేలా ప్రత్యేక నెంబరును అందుబాటు లోకి తెచ్చింది.
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో కార్తీక బహుళ శుద్ధ పంచమి వేడుకలను బుధవారం వైభవంగా నిర్వహించారు.అలంకార మండపం వద్ద సిద్ధి,బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవర్లకు అర్చకులు పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు.
నిరుపేదలకు ఆరోగ్య భరోసాను కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా లబ్ధిదారులకు రూ.5 లక్షల విలువజేసే వైద్యాన్ని ఉచితంగా అందించనుంది. పథకానికి సంబంధించి గతంలోనే అర్హుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. మిగిలిన వారికి కొద్దిరోజుల్లో ఇంటింటి సర్వేను నిర్వహించి ఎంపిక చేయనున్నారు.
వంగలపూడి 1,2 ఇసుక రీచ్‌లు రద్దుచేస్తున్నట్టు జేసీ చినరాముడు ప్రకటించారు. వంగలపూడ ఇసుక ర్యాంపు వద్ద స్థానికులకు, యాజమాన్యానికి మధ్య ధరల విషయమై గొడవ జరిగిన నేపథ్యంలో బుధవారం జేసీకి వాట్సాప్ మెసెజ్‌ల ద్వారా ఫిర్యాదులు చేశారు.
తీసుకున్న బయానా డబ్బులు తిరిగి ఇవ్వాలన్నందుకు కీసర గ్రామానికి చెందిన వైసీపీ నేత జడ్పీటీసీ ప్రశాంతి భర్త వేల్పుల రమేశ్ తనపై డీజిల్ పోసి నిప్పంటించేందుకు యత్నించాడని కీసర గ్రామానికి చెందిన బాధితుడు అంగిరేకుల రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కిశోరి వికాసం-2 కార్యక్రమం బాలికల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుందని, ఉజ్వల, ఆరోగ్యకరమైన, సాధికారిత దిశగా ఆమె వేసే అడుగుకు సమిష్టి కృషితో చేయూతనిద్దామని ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ నిధి మీనా అన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు గోకులం షెడ్ల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించింది. జిల్లాలో ఒక్కటంటే ఒక్కటీ నిర్మించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడిరైతుల సంక్షేమాభివృద్ధి కోసం చర్యలు చేపట్టింది.