[03:33]రాజస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులను తీసుకెళ్తున్న ఓ టెంపో.. ధాన్యం బస్తాల ట్రక్కును ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 14 మంది గాయపడ్డారు.
[03:33]పరారీలో ఉన్న నేరస్థులను పట్టుకునేందుకు హరియాణా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ ట్రాక్‌డౌన్’లో భాగంగా ఒకేరోజు 257 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ అరెస్టులు శుక్రవారం జరిగాయని ఆదివారం వెల్లడించారు.
[03:19]ప్రభుత్వరంగంలోని అగ్రగామి విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ దేశంలోని పలు ప్రాంతాల్లో 700 మెగావాట్లు, 1000 మె.వా., 1,600 మె.వా. సామర్థ్యంతో అణువిద్యుత్ ప్రాజెక్టులు స్థాపించడానికి సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఇందుకు అనువైన ప్రాంతాలను అన్వేషిస్తున్నట్లు...
[03:17]భారతీయ సంస్థలు కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంలో ప్రయోగాత్మక దశ దాటి, క్రియాశీల విస్తరణకు మారాయని ఈవై-సీఐఐ సంయుక్తంగా రూపొందించిన నివేదిక వెల్లడించింది. 47% కంపెనీలు బహుళ జనరేటివ్ ఏఐని ఉత్పత్తిలో వినియోగిస్తున్నాయని పేర్కొంది.
[03:15]మన దేశంలో వినియోగం రాబోయే దశాబ్దంలో పెద్ద మార్పునకు సిద్ధమవుతోందని, దేశ రిటెయిల్ విపణి 2030 నాటికి ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.88 లక్షల కోట్ల) స్థాయికి చేరుకుంటుందని వెంచర్ క్యాపిటల్ సంస్థ ఫైర్‌సైడ్ వెంచర్స్ నివేదిక పేర్కొంది.
[03:14]సొంతగడ్డపై ప్రత్యర్థులను స్పిన్‌తో వణికించి, పరుగుల వరదపారించిన టీమ్ఇండియానేనా ఇది? భారత్‌కు ఏమైంది? న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైనా.. అది ఓ పీడకలలా మరిచిపోదామానుకున్నారు అభిమానులంతా! కానీ మళ్లీ ఓ షాక్.
[03:10]భారత్‌లో టెస్టులు ఆడేందుకు విదేశీ జట్లు వస్తున్నాయంటే.. సిరీస్‌ను ఎంత తేడాతో ఓడుతాయనే చూసేవాళ్లం ఏడాది ముందు వరకు. కానీ నిరుడు న్యూజిలాండ్ జట్టు 3-0తో టీమ్ఇండియాను వైట్‌వాష్ చేసి దిమ్మదిరిగే షాకిచ్చింది.
[03:08]హైదరాబాద్ కుర్రాడు ధనుష్ శ్రీకాంత్ సత్తా చాటాడు. డెఫ్లింపిక్స్తో అతడు స్వర్ణంతో మెరిశాడు. పోటీల తొలి రోజు, ఆదివారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ధనుష్ ఫైనల్లో ప్రపంచ రికార్డు సృష్టిస్తూ పసిడి గెలుచుకున్నాడు.
తిరువీర్ కథానాయకుడిగా మహేందర్ కుడుదుల దర్శకత్వంలో ఆధ్య మూవీ మేకర్స్ పతాకంపై పరుచూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో మొదలైంది.
రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన వడ్లను మిల్లుల ద్వారా బియ్యంగా మార్చి వాటిని పేదలకు పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన సీఎంఆర్ ప్రక్రియను కొందరు రైస్ మిల్లర్లు అక్రమ సంపాదనకు మార్గంగా మార్చుకుంటున్నారు. �
[03:06]జాతీయ పికిల్‌బాల్ పోటీల్లో తెలంగాణకు మూడు పతకాలు దక్కాయి. కర్ణాటక పికిల్‌బాల్ సమాఖ్య ఆధ్వర్యంలో బెంగళూరు వేదికగా జరిగిన ఈ టోర్నీకి ప్రియా ‘సబల మిల్లెట్స్’ స్పాన్సర్‌గా వ్యవహరించింది.
[03:05]ఫిడే ప్రపంచకప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ హరికృష్ణ కథ ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో అతడు టైబ్రేక్‌లో మార్టినెజ్ అల్కాంటరా (మెక్సికో) చేతిలో పరాజయం పాలయ్యాడు.
[03:04]వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను గెలుచుకున్న న్యూజిలాండ్.. మూడు వన్డేల సిరీస్‌లోనూ బోణీ కొట్టింది. ఆదివారం తొలి వన్డేలో ఆ జట్టు 7 పరుగుల తేడాతో విండీస్‌ను ఓడించింది.
[03:02]పసిడి నవంబరు కాంట్రాక్టు ఈవారం రూ.1,22,481 కంటే కిందకు వస్తే మరింతగా దిద్దుబాటు కావొచ్చు. అందువల్ల షార్ట్ పొజిషన్లున్న ట్రేడర్లు రూ.1,23,774 వద్ద స్టాప్‌లాస్ పరిగణిస్తూ, వాటిని కొనసాగించొచ్చు.
[02:55]దేశీయ స్టాక్ మార్కెట్లు, గతవారం బాటలోనే ఈ వారమూ రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదరొచ్చన్న ఆశలే ఇందుకు దోహదం చేయొచ్చు. సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలు చివరి దశకు రావడంతో..
[03:05]ఈ ఏడాది తొలి 10 నెలల్లో దేశీయ ప్రైవేట్ రంగంలో నియామకాలు పుంజుకున్నట్లు కనిపిస్తోంది. బలమైన గిరాకీ, ఆర్డర్ల రాక, వ్యాపార సెంటిమెంట్ మెరుగవ్వడం లాంటివి ఇందుకు దోహదం చేశాయి.
గాన గంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్'. గాయకుడు కృష్ణచైతన్య ఇందులో ఘంటసాలగా నటించగా, ఘంటసాల సతీమణి సావిత్రమ్మగా మృదుల, బాల ఘంటసాలగా అతులిత కనిపిం