[03:26]దుర్గమ్మ దర్శనం టికెట్ల జారీ కౌంటర్లలో పని చేసే ఉద్యోగి చేతివాటానికి పాల్పడిన ఘటన సోమవారం వెలుగు చూసింది. ఆదివారం మాఘ పూర్ణిమ కావడంతో దుర్గమ్మ దర్శనానికి వేలాది భక్తులు తరలివచ్చారు.
[04:47]అంతర్జాలం.. ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తున్న సాంకేతిక సదుపాయం. ఇది ఎంత సౌకర్యవంతమో అంతలా ప్రమాదకరంగానూ మారిందని పలు ఘటనలు రుజువు చేస్తున్నాయి.
నిర్వహణ పనులకు ఎక్కువ కేటాయింపులు.. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పనులకు అత్తెసరు నిధులు.. గొప్పగా చెప్పుకొంటున్న హైదరాబాద్ మెట్రో రైల్పై బడ్జెట్లో ప్రభుత్వం తీరిది.
ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించాలనే ఉద్దేశంతో ఆరేళ్ల క్రితం ప్రారంభమైన టి-ఫైబర్ ప్రాజెక్టుకు బడ్జెట్లో మళ్లీ మొండిచెయ్యే దక్కింది. 33 జిల్లాల్లోని 83.58 లక్షల గృహాలు, ప్రభుత్వ ఆఫీసు లకు ఇంటర్నెట్ అందించాలనేదే ప్రాజెక్టు ధ్యేయం.
జగనన్న ఇల్లు’ పథకం కింద తమకు పట్టా ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా స్థలం ఎక్కడో చూపించలేదని, తమకు స్థలం చూపించాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును స్థానిక మహిళలు ప్రశ్నించారు.