రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం జిల్లా సొంతం. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం రూరల్, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో 193 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది.
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) అధికారుల తీరుపై విచారణ కమిటీకి నేతృత్వం వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు సీరియస్ అయినట్లు తెలిసింది. ప్రత్యక్ష విచారణను బ్యాంకులో పదిరోజులకుపైగా నిర్వహించిన ఆయన తుది నివేదికను కలెక్టర్‌కు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
ఓయో రూమ్ కేంద్రంగా గంజాయి విక్రయాలు జరుపుతున్న వ్యక్తిని శంషాబాద్ డీటీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. ఓయో రూంలో నిందితుడి వద్ద నుంచి రూ.లక్ష విలువ చేసే 4కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. శంష�
దైవభక్తి ఉంటేనే మానసిక ప్రశాంతతో జీవనం గడుపుతామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. షాద్‌నగర్ మున్సిపాలిటీలోని ఫరూఖ్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన వీరాంజనేయస్వామి ఆలయ ప్రారంభోత్సవం, హనుమాన్, వినాయకుడు, నవగ్రహాలు, ధ్వజస్థంభ ప్రతిష్ఠాపనను బుధవారం నిర్వహించారు.
మండలంలోని మక్తమాదారం గ్రామం నుంచి ఇబ్రహీంపట్నంకు నూతనంగా ఆర్టీసీ బస్సు సర్వీసు ను ప్రారంభించారు. బుధవారం మక్తమాదారంలో ఆమనగల్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, మాజీ సర్పంచ్ సులోచన సాయిలు, మాజీ ఎంపీటీసీ మంజుల చంద్రమౌళిలు సర్వీసును ప్రారంభించారు.
పల్లెకు పండుగొచ్చింది. ప్రతి ఊళ్లో అభివృద్ధి ఉత్సవం నడుస్తోంది. ఎప్పట్నుంచో ఆగిపోయిన నిర్మాణ పనులు మొదలు కావడంతో ప్రజలు కూటమి ప్రభుత్వం పాలనాదక్షతను ప్రశంసిస్తున్నారు.
ఎనిమిది మాసాలుగా మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీకి పాలకవర్గం లేక రైతులకు అందాల్సిన పలురకాల సేవలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇటు పాలక వర్గం అటు ప్రభుత్వ పర్యవేక్షణలేక రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోక తప్పడంలేదు.
సీతంపేట ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన జగతిపల్లి వ్యూపాయింట్, రిసార్ట్స్ అభివృద్థి పనులకు మోక్షం లభించడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్ట్‌కు బ్రేక్ పడింది. నిధులున్నా.. పనులు పూర్తికాని పరిస్థితి.
మార్కెట్లో మిల్లర్లు, వ్యాపారుల మాయాజాలంతో రైతులకు, వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు రైతులు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర దక్కడం లేదు. మరోవైపు వినియోగదారులకు మార్కెట్లో బియ్యం ధర ఏ మాత్రం తగ్గడం లేదు.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాబోవు కాలంలో భారత్ అగ్రగామిగా నిలవనుందని రక్షణ శాఖ సాంకేతిక సలహాదారు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ జి.సతీ్‌షరెడ్డి అన్నారు.
పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో వ్యక్తి మృతదేహాం లభ్యమైన ఘటన ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆదిభట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం మేరకు.. బొంగ్లూరు ఔటర్ సర్వీస్ రోడ్డు కోయడ వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి ఉరేసుకొని మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.
గొంతులో మటన్ ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి చెందిన సంఘట రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం షాబాద్ మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన కావలి జంగయ్య (58) షాబాద్‌లో ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన బంధువుల పెళ్లికి హాజరయ్యాడు.
జిల్లాలో రేషన్ డిపోల సంఖ్య పెరగనుంది. డీలర్ల పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. కార్డుదారులకు మెరుగైన సేవలందించాలనే కూటమి ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం కదిలింది. డిపోల పెంపునకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు.
వికారాబాద్ జిల్లా లగచర్ల గిరిజనులకు మద్దతుగా బుధవారం కడ్తాల మండల కేంద్రంలో బీఆర్‌ఎ్‌స్ గిరిజన నేతలు సంఘీభావం తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. కడ్తాల మాజీ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల, తలకొండపల్లి మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గిరిజన ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి రాష్ట్రంలోని గిరిజన కుటుంబాలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు.
చేతుల పరిశుభ్రతకు సంబంధించి విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. బుధవారం స్వచ్ఛ పార్వతీపురం, మరుగుదొడ్ల దినం తదితర అంశాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో కలెక్టరేట్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాలో పత్తి రైతుల సౌకర్యార్థం రామభద్రపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిందని, రైతులు తాము పండించిన పత్తిని ఆ కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందవచ్చునని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకుడు పి.రవికిరణ్ సూచించారు.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ధాన్యం దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా.. అన్నదాతలు దళారుల దగాకు గురికావాల్సి వస్తోంది. ప్రభుత్వం ఈ నెల 17 నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టాలని ఆదేశించింది. కానీ జిల్లాలో ఇప్పటివరకూ ఒక్క కేంద్రంలో కూడా కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాలేదు.
అనేక ఏళ్లుగా ఎదురుచూస్తున్న స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ ప్రజల కల నెరవేరబోతోంది. గత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను, రెవెన్యూ డివిజన్ లను, మండలాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఘన్‌పూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసింది.
తండ్రి లేకపోవడం.. చూపు కనిపించకపోవడం ఆయనలో పట్టుదలను పెంచాయి. ఎన్ని ప్రతికూలతలు ఉన్నా ఏదో ఒక దారి తప్పక ఉంటుందని, ఆత్మవిశ్వాసంతో నెగ్గుకు రావొచ్చునని గట్టిగా నమ్మి సడలని గుండె ధైర్యంతో ముందుకెళ్లాడు. అంధుల క్రికెట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు.
సైబర్ నేరాల నియంత్రణకు బ్యాంకు అధికారులు సహకరించాలని ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి కోరారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో పలు బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు.
భావనపాడు సాగరతీరంలో హార్బర్ ప్రతిపాదన నాలుగు దశాబ్దాలుగా నలుగుతోంది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మత్స్యకారుల కల నెరవేర్చాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు.
రాష్ట్ర ప్రజలపై భారాలు మోపే ట్రూఅప్ చార్జీలు రద్దుచేయాలని, స్మార్ట్‌మీటర్లు బిగింపు ప్రక్రయ నిలిపివేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్వీ రమణ ఢిమాండ్ చేశారు. బుడుమూరు సబ్‌స్టేషన్ వద్ద సీపీఎం నాయకులు నాగరాజు, అశోక్, శ్రీనివాసరావు ధర్నా నిర్వహించారు.
ఉద్యాన పంటలకు ఊతమిచ్చేలా.. మెట్ట ప్రాంతాల రైతులను ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఉపాధిహామీ నిధులను ఉద్యానశాఖకు అనుసంధానం చేసి రైతులకు ఉపాధి కల్పించాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే.
జిల్లాకు కీలకమైన కేంద్ర ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉంది. భారత నావికాదళం (నేవీ) జిల్లాలో ఆయుధ డిపో ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. జిల్లాకు కీలకమైన కేంద్ర ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉంది. భారత నావికాదళం (నేవీ) జిల్లాలో ఆయుధ డిపో ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.
జిల్లాలోని అరసవల్లి, కళింగపట్నంలో నిర్వహించిన సాగర్ కవచ్‌లో భాగంగా రెడ్‌ఫోర్స్ విశాఖపట్నం నేవీ బృందాన్ని మెరైన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు ఐదోతేదీన సాగర్ కవచ్ నిర్వహించిన విషయం విదితమే.
మహిళలు మోసపోకుండా జాగృతం చేసేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నట్లు నందికొట్కూ రు జూనియర్ సివిల్ జడ్జి ఎస్. దివ్య, స్టేట్ ఉమెన్ వెల్ఫేర్ కమీషన్ మెంబర్ ఎస్.రుఖియా తెలిపారు.
ఓ వైపు ఆపరేషన్ కగార్, మరోవైపు వరుస ఎన్కౌంటర్లతో నష్టాలు, ఇంకో వైపు మహారాష్ట్రలో ఎన్నికల హడావిడి లాంటి పరిస్థితుల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ల్లో చురుగ్గా కదులుతున్నట్లు కేంద్ర, రాష్ట్ర ఇంటె లిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం లో మళ్లీ మావోయిస్టుల కదలికలు పెరుగుతున్న సూ చనలు కనిపిస్తుండటంతో సరిహద్దు జిల్లాల పోలీసులు పూర్తిస్థాయి లో అప్రమ త్తమయ్యా రు.
సొంతూరులో పనులు లేక పిల్లా పాపలతో బొంబాయికి వలస వెళ్లిన వాళ్ల పొలాన్ని వైసీపీ నాయకుల ప్రోద్బలంతో రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో పాసుపుస్తకాలు మార్చేశారు.
శ్రీకాకుళం ఆర్అండ్బీ డచ్ భవనం వద్ద ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాస్థాయి విభిన్న ప్రతిభా వంతుల క్రీడాపోటీలను బుధవారం డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు ప్రారంభించారు.
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్.రమణ అక్రమాలకు పాల్పడ్డా రంటూ గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు బుధవారం స్థానిక గ్రామ సచివాల యంలో ఉపాధి ఏపీడీ కె.లోకేష్ గ్రామసభ నిర్వహించి విచారణ చేప ట్టారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తోపులాట ఏర్పడింది.
What is Third Party Car Insurance & benefits: థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ బీమా చేసిన కారు కారణంగా థర్డ్ పార్టీకి గాయాలు కావడం వల్ల తలెత్తే ఏదైనా చట్టపరమైన బాధ్యతకు వ్యతిరేకంగా కవరేజీని అందిస్తుంది. బీమా చేయబడిన వాహనం వల్ల థర్డ్ పార్టీ వ్యక్తి లేదా ఆస్తికి కలిగే నష్టాలు, గాయాలను ఇది కవర్ చేస్తుంది.
మండ లంలోని మునసబుపేటకు చెందిన వడ్డి రాజేశ్వరి ఇంట్లో 2021 అక్టోబరు పదో తేదీన జరిగిన దొంగతనం కేసులో నిందితులకు జైలు శిక్ష విధించినట్లు రూరల్ ఎస్ఐ కె.రాము బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నియంత్ర ణలో ప్రతీఒక్కరు భాగస్వామ్యం కావాలని అ ప్పుడే ప్రమాదాల సంఖ్యను తగ్గించగలుగుతా మని ట్రాఫిక్ నిబంధనలు వాహనదారుల సౌక ర్యం, రోడ్డు ప్రమాదాల నివారణకు ఏర్పాటు చే సినవని, ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించా లని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు.
సీసీ రోడ్లు నిర్మించకుండా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, గ్రావెల్ రహదారుల నిర్మాణానికి అడ్వాన్సుల పేరిట నిధులను ఉపాధి ఉద్యోగులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై దోచుకున్నారని సామాజిక తనిఖీల్లో బయటపడింది.
ఆశ్రమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ సూచించారు. జి.మాడుగుల మండలం గెమ్మెలి గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు.
మండల కేంద్రం నుంచి ముంచంగిపుట్టు వైపు సంపంగిపుట్టు వరకు, అలాగే పాడేరు వైపు బంగారుమెట్ట వరకు రోడ్డు అధ్వానంగా ఉండడంతో రాకపోకలకు వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రంలోని వడ్డెర్ల సమస్యలను పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించడంపై వడ్డెర్ల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం పాడేరు అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. అభివృద్ధికి చర్యలు తీసుకోకపోగా అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం మంజూరుచేసిన పనులను కూడా రద్దు చేసింది. రాష్ట్రంలోనే అధిక శాతం మంది గిరిజనులు జీవించే పాడేరుపై కనీసం దృష్టి పెట్టలేదు.
కేంద్ర ప్రభుత్వం అ నుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్య తిరేక విధానాలను ప్రతిఘటించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్య క్షుడు చిలుక బాల్‌రెడ్డి కార్మిక సంఘా లకు పిలుపునిచ్చారు.
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతుండడంతో చలి తీవ్రత తగ్గలేదు. పాడేరు మండలం మినుములూరులో 9, పాడేరులో 11 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు బుధవారం నమోదయ్యాయి.
గత సీజన్లలో ప్రభుత్వానికి సీఎంఆర్ ఇవ్వని మిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం డీఫాల్ట్ లిస్టులో పెట్టింది. దీంతో ఆ మిల్లులకు ఈ ఏడాది ధాన్యం కేటాయించడం లేదు.
పెండింగ్ ప్రాజెక్టుల ను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఉమ్మడి పాలమూరు జిల్లాను బీఆర్ఎస్ హయాంలో సస్యశ్యామలం చేశామని, రూ. 4వేల కోట్లు ఖర్చు చేయడం ద్వారా 6.50లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్‌రావు తెలిపారు.
గుజరాత్ రాష్ట్ర రైతులపై ఉన్న ప్రేమ, తెలం గాణ, ఇతర రాష్ట్రాల రైతులపై ఎందుకు లేదో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పా లని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు భగవంతు డిమాండ్ చేశా రు.
భూమి లేని నిరుపేదలకు దక్కాల్సిన భూదాన్ భూములు బడాబాబుల చేతుల్లో బందీ అయ్యాయి. కోట్లు విలువ చేసే భూములను భూబకాసురులు అనుభవిస్తున్నారు. రికార్డులు తారుమారు చేసి ఒకరి నుంచి మరొకరికి పట్టాలు మార్చి ఏమార్చారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలోని రైతు వేదిక వద్ద బుధవారం సహకార వారోత్సవాల ముగింపు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర సహకార శాఖ ఎండీ అన్నపూర్ణ, జాయింట్ రిజిస్ట్ట్రార్లు ధాత్రిదేవి, వెంకటేశ్వర్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజల నుంచి వస్తున్న సమాధానాలతో ఎన్యూమరేటర్లకు తిప్పలు తప్పడం లేదు. ప్రజల నుంచి వచ్చే సమాధానాలతో అవాక్కవుతున్నారు.
ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ప్రచార కళాయాత్ర కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహంచాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. మంగళారం ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో కళాయాత్ర వాహనాన్ని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్‌తో కలిసి ప్రారంభించారు.
మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి. చివరి రోజు వేడుకల్లో భాగంగా అమ్మవారిని కూరగాయలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉమ్మడి జిల్లాలో చలి పంజా విసురుతోంది. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడి పోతున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో చలిగాలుల తీవ్రత పెరిగి పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.