భారత స్టార్ క్రికెటర్ రింకూసింగ్, యువ ఎంపీ ప్రియా సరోజ్ పెండ్లి కుదిరింది. గత కొన్ని రోజులుగా పెండ్లిపై వస్తున్న వార్తలకు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు స్పష్టత ఇచ్చారు. ‘రింకూ, ప్రియా పెండ్లి ఖరారైం�
పుర్రె లోపల ఒక చిప్‌ను అమర్చి అల్ట్రాసౌండ్ ద్వారా మెదడును నియంత్రించే అధునాతన ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. బ్రెయిన్-కంప్యూటర్-ఇంటర్ఫేస్(బీసీఐ)గా పిలిచే ఈ సాంకేతికతతో అమెరికాకు చె�
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్‌కు సూరత్‌కు చెందిన ఓ సంస్థ ఆయన ముఖాకృతిని చెక్కిన వజ్రాన్ని బహుమతిగా ఇచ్చేందుకు సిద్ధమైంది. త్వరలో ట్రంప్‌కు దీన్ని అందజేస్తామని సంస్థ ప్రతినిధి తెలిపారు.
పంటలపై ఏనుగుల దాడిని నివారించడానికి, వాటిని అడవుల్లోకి మళ్లించడానికి ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశామని జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్ తెలిపారు.
నేటి సమాజంలో అందరూ కులమతాలకు అతీతంగా కలసి జీవించాలని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం నిడదవో లులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన జ్యోతిరావు ఫూలే, బీఆర్ అంబేడ్కర్ ముఖచిత్రంతో ముద్రించిన డైరీని ఆయన ఆవిష్కరించారు.
స్టీల్‌ప్లాంటు పరిరక్షణ కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకుందని, ఇప్పుడు కర్మాగారాన్ని శతశాతం ఉత్పత్తి స్థాయికి తీసుకురావలసిన బాధ్యత కార్మికులు, యాజమాన్యంపై ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.
విష్ణు సహస్ర నామ సత్సంగ మండలి ఆధ్వర్యంలో సోమవారం ఆర్ఎఫ్ రోడ్డులోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీవెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని వేదికపై స్వామివార్ల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించారు.
తమతో చర్చలను ఫిబ్రవరి 14న కాకుండా ముందుగానే జరపాలని రైతు సంఘాలు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఇది తాము విధిస్తున్న నిబంధన కాదని స్పష్టం చేశాయి.
వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. కొమరవెళ్లి మల్లన్న వారంపట్నంను పురస్కరించుకుని వేములవాడ రాజన్నకు భక్తులు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ.
జిల్లాలో ఉచిత ఇసుక అమలు విధానం ఆది నుంచి గందరగోళంగానే ఉంది. మధ్యలో కొద్ది రోజులు బాగానే నడిచినా తిరిగి మామూలై పోయింది. ఎక్కడ ఏం జరుగుతుందో కానీ జిల్లాలో గోదావరి నిండా ఇసుక ఉన్నా దానిని వెలికితీసి సరఫరా చేసే విధానాల్లో సరైన పద్ధతి అవలంభించడంలేదు.
గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాలను బలోపేతం చేయడానికి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు కృషిచేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. నూతనం గా ఎంపికైన మండలంలోని ప్యాదిండి గ్రామానికి చెందిన గొర్రెల పెంపకం దారుల సంఘం సభ్యులు సోమవారం వెంకటాపురంలో ఎమ్మెల్యేని మ ర్యాదపూర్వకంగా కలిశారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని టెస్కో జనరల్ మేనేజర్ అశోక్‌రావు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో స్వశక్తి సంఘాలకు అందించే చీరల ఆర్డర్లను 129 మ్యాక్స్ సోసైటీలకు అందించే ఆర్డర్ కాపీని అందించారు.
అధికారులు బాధ్యతగా పనిచేయకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ పి.ప్రశాంతి హెచ్చ రించారు. రాజానగరం మండల పరిషత్ కార్యా లయం సమావేశపు హాలుల్లో సోమవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు జిల్లా కలెక్టర్ హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి మాట్లా డారు.
రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతుడి కుటుంబ సభ్యులు, బం ధువులు సోమవారం రాత్రి రాయవరం-వి.సావరం రోడ్డులో మృతదేహంతో ధర్నా చేశారు.
వైసీపీ పాలనలో చేపట్టిన భూ రీసర్వేలో రైతుల భూ విస్తీర్ణానికి సంబంధించి భారీ వ్యత్యాసాలు వచ్చాయనే విమర్శలు వచ్చాయి. దీంతో చాలా చోట్ల రీసర్వే వద్దన్నారు. అయినా పాల కులు అధికాలు బలవంతంగా భూ రీసర్వే చేపట్టి, వ్యత్యాసాలతోనే జాయింట్ ఖాతా నంబర్లు, ఎల్పీ నంబర్లతో భూహక్కు పుస్తకాలను సంబంధిత రైతుల కు ఇచ్చి, అలాగే వైబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు.
పెద్దఅడిశర్లపల్లి,జనవరి20(ఆంధ్రజ్యోతి): రైతులకు పెట్టుబడి సాయం అందించాలన్న ఉద్దే శంతో గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం కొందరు అనర్హులకు కాసుల వర్షం కురిపించింది.
దుర్గగుడిలో ప్రక్షాళన ప్రారంభమైంది. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మరికొందరు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఈవో గుర్తించినట్లు సమాచారం.
చండూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యమవుతుంది. ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకుండా ఎక్కడపడితే అక్కడ రోడ్లపైనే వాహనాలు నిలిపివేయడంతో పాటు యూటర్న్ తీసుకుంటూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. పోలీసులు కేవలం డ్రంకెన డ్రైవ్ టెస్టులకే పరిమితం కావడంతో వాహనదారులు ఇష్టానురీతిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.
దర్వేశిపురం శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ ఆలయ అభివృద్ధితో పాటు దేవస్థానం వద్ద భక్తుల కు మెరుగైన వసతులను కల్పించేందుకు కృషి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో అప్రకటి త ఎమర్జెన్సీని తలపించే విధంగా ముఖ్యమంత్రి సీఎం రేవంతరెడ్డి పాలన కొనసాగుతోందని జడ్పీ మాజీచైర్మన బండా న రేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ధ్వజమెత్తా రు.
ప్రభుత్వ శాఖల జిల్లా ప్రధాన కార్యాలయాలన్నీ సాధారణంగా జిల్లా కేంద్రాల్లోనే ఉంటాయి. కానీ, ఎన్టీఆర్, కృష్ణాజిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ కార్యాలయాలు మాత్రం జిల్లా కేంద్రాల్లో ఉండవు. జిల్లా కేంద్రానికి రావాలని ఉన్నతాధికారులు ఆదేశించినా ఆ శాఖాధికారులు పట్టించుకోరు.
కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభు త్వం ఇచ్చిన హామీలను వెంట నే అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 78 ఫిర్యాదులు వచ్చాయి. స్థానిక కొత్తపేటలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎస్పీ జి.బిందు మాధవ్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
ఓ ఫొటోగ్రాఫర్ పెళ్లి ఈవెంట్ కోసం పీఎన్బీఎస్ నుంచి ప్రకాశం జిల్లాకు బస్సులో బయల్దేరాడు. ఒంగోలు వెళ్లే బస్సెక్కాడు. ఇదే బస్సులో ఎక్కిన ముగ్గురు ఉత్తరప్రదేశ్ వాసులు అతడి కెమెరా బ్యాగ్‌ను కాజేశారు. బస్సు బస్టాండ్ నుంచి బయటకు వచ్చేలోగా పని పూర్తి చేసుకున్నారు. బస్సు జాతీయ రహదారిపైకి రాగానే మరో వ్యక్తి బస్టాండ్‌లో ఉండిపోయాడని చెప్పి దిగిపోయారు. సరిగ్గా ఒంగోలు వెళ్లి చూసుకునే సరికి బ్యాగ్‌లో ఉన్న కెమెరా, లెన్స్ కనిపించలేదు. ఈ కేసులో నిందితులను సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి గుర్తించారు. రోజుల వ్యవధిలోనే పోలీసులు కేసు ఛేదించారు. నిందితులు బస్సెక్కడం మొదలు జాతీయ రహదారిపై దిగే దృశ్యాలన్నీ ఫుటేజీలో కనిపించాయి. జగ్గయ్యపేటలో బంగారం షాపులో గుమస్తాగా పనిచేసే వ్యక్తి విజయవాడకు కారులో వచ్చారు. బీఆర్టీఎస్ రోడ్డులోని శారదా కళాశాల వద్దకు రాగానే ఓ గ్యాంగ్ పోలీసుల అవతారమెత్తి ఆ కారును ఆపింది. ఆ గుమస్తా నుంచి రూ.25 లక్షలు కాజేసింది. డిసెంబరు 11న జరిగిన ఈ ఘటనలో నిందితులను సీసీఎస్ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీల ద్వారా పట్టుకున్నారు. కాజేసిన మొత్తాన్ని రికవరీ చేశారు.
‘రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయి.’ అన్న నానుడి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు వర్తిస్తుందేమో..! వివాదాస్పద ఘటనల నేపథ్యంలో సోమవారం రెండోసారి ఆయన టీడీపీ విచారణ కమిటీ ముందు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. పదేపదే ఆయన వివాదాల్లో చిక్కుకుంటుండటం, దుందుడుకుతనంతో వ్యవహరించడం, ఓ ప్రజాప్రతినిధిగా ఉండి అధికారుల మాదిరిగా ప్రవర్తిస్తుండటం కూడా అటు నియోజకవర్గ ప్రజలతో పాటు ఇటు టీడీపీ అధిష్ఠానానికి కూడా తలనొప్పిగా మారాయి. రెండుసార్లు కమిటీకి వివరణ ఇచ్చుకున్న ఆయన ఈసారైనా జాగ్రత్తగా ఉంటారా, లేదా అనే విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను భార్యే.. ప్రియుడితో కలిసి హత్య చేసింది. స్థానిక రహమతపురానికి చెందిన అల్లాబకష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి బ్రాహ్మణవెల్లెంలలోని ఉదయసముద్రం ఎత్తిపోతల పథకాన్ని ఇటీవలే సీఎం రేవంతరెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జాతికి అంకితం చేశారు.
పదిహేనేళ్ల క్రితం నాటి పాలకులు, అధికారులు తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వంగలి రైతులు, ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ ఎదుట చేపట్టిన ఆందోళన సోమవారం మూడో రోజుకు చేరుకుంది.
కూటమిలో ఉన్న బీజేపీని బలోపేతం చేయడంపై జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టింది. గ్రామస్థాయి నుంచి పార్టీ, అనుబంధ విభాగాలను బలోపేతం చేసేందుకు దృష్టి సారిం చింది. ఇప్పటికే మండల, కార్పొరేషన్ డివిజన్, మున్సిపల్ అధ్యక్షుల ఎంపిక పూర్తయింది. తాజాగా జిల్లా అధ్యక్షుడి ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు.
స్థానిక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఏకంగా 251 వినతులు వచ్చాయి. వాటిని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ స్వీకరించారు.
కార్మికులను కనీస వేతనాలు అమలు చేయని ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఏపీ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్. మునెప్ప డిమాండ్ చేశారు.
ప్రజాసమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి అర్జీలు స్వీకరించారు.
పెద్దాపురం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పెద్దాపురం ఏడీబీ రహదారిలో స్థానిక వాలుతిమ్మాపురం జంక్షన్ సమీపంలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ సామగ్రి దగ్ధమైంది. సమీపంలో ఉన్న ఓ పరిశ్రమ ఎటువంటి అనుమతులు లేకుండా ప్లాస్టిక్ సామ
సర్పవరం జంక్షన్, జనవరి 20 (ఆంధ్ర జోతి): కాకినాడ రూరల్ రమణయ్యపేట ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌ను రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం బెటాలియన్‌కు చెందిన ఇంగ్లీషు
‘ఊరూరా గంజాయి’ శీర్షికన ఈనెల 17వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’ రెండ్రోజుల క్రితం ప్రచురించిన కథనంతో అధికారుల్లో చలనం వచ్చింది. దీంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
సంక్రాంతి సెలవులు ముగిసి విద్యా సంస్థలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సాధారణ ప్రయాణికులతో పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ సోమవారం రద్దీగా మారింది.
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 20(ఆంధ్రజ్యోతి): తన మావయ్యను ఇంటి వద్ద దింపడానికి బైక్‌పై బయలుదేరిన యువకుడు తన మామతో పాటు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఈ సంఘటన రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల సెంటర్లో ఆది వారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే రాజమహేంద్రవరం లాలాచెరువు సమీపంలోని చౌడేశ్వర్నగర్కు చెందిన మేడిశెట్టి ప్రసాద్ (53) అంబేడ్కర్‌వాది. అతడు ఆదివారం పంగిడిలో జరిగిన ఎయిమ్ సమావేశానికి వెళ్లాడు. సమావేశం అనంతరం వేరొకరి కారులో రాత్రి 10 గంటలు దాటాక రాజమహేంద్రవ
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మాజ్యోతి బాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల విద్యాలయంలో తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది.
కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ప్రత్యేక చొరవతో కోనసీమ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా తెలిపారు. కోనసీమ క్రీడోత్సవాల్లో భాగంగా జిల్లాలోని 22 మండలాల పరిధిలోని 2600 మంది పాఠశాలల విద్యార్థులు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారన్నారు.
అర్జీల పరిష్కారంలో బాధ్యతా రాహిత్యానికి తావు లేకుండా ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ సూచించారు. పరిష్కార సరళిపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. కలెక్టరేట్లోని గోదావరి భవన్లో సోమవారం జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమాన్ని జిల్లాస్థాయి అధికారులతో నిర్వహించారు.
జిల్లాలో ఫిబ్రవరి 2 వరకు కుష్టు బాధితులను గుర్తించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. జాతీయ కుష్టువ్యాధి నిర్మూలనా కార్యక్రమంలో ఈ నెల 20 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించారన్నారు. కలెక్టరేట్లో సోమవారం జాతీయ కుష్టువ్యాధి నిర్మూలనా కార్యక్రమం వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.
మచిలీపట్నంలోని గిలకలదిండి హార్బర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.348 కోట్ల అంచనాలతో 2021లో ఆర్భాటంగా ప్రారంభించిన పనులు మూడేళ్లు పూర్తయినా అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. నిధుల విడుదలలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమే ఇందుకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. మత్స్యకారులు, బోటు యజమానులు సముద్రంలో రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు.
ఈసారి తాను ఏం చేయబోయేదీ ట్రంప్ తన తొలి ప్రసంగంలోనే పూర్తిస్థాయి క్లారిటీ ఇచ్చేశారు. అమెరికా మీడియా కథనాల ప్రకారం, ట్రంప్ తొలి రోజున మొత్తం పది ముఖ్యఅంశాలపై ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ జారీ చేసే అవకాశం
Sand Mining ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. ఒడిశా వ్యాపారులు ముందుగా ఇక్కడి అధికారపార్టీ నేతలతో బేరసారాలు కుదుర్చుకుని ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తామని, ట్రాక్టర్లలో ఇసుక లోడ్ చేస్తే.. రవాణా బాధ్యత తాము చూసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
పెద్దపల్లి ఐటీఐ సెంటర్ ప్రాంగణంలో జరుగుతున్న ఏటీసీ ( అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్) భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం ఆయన నిర్మాణ పనులను పరిశీలించారు.