[01:46]స్టాక్ మార్కెట్లు ఈ వారం తాజా రికార్డు గరిష్ఠాలకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్ల నిర్ణయం బుధవారం వెలువడనుండడమే ఇందుకు కారణం.
[01:47]పునరుత్పాదక ఇంధన వనరులు, బొగ్గు ద్వారా ఉత్పత్తి చేసే 6,600 మెగావాట్ల విద్యుత్తును మహారాష్ట్రకు సరఫరా చేసే కాంట్రాక్టును అదానీ గ్రూప్ దక్కించుకుంది.
[01:43]దేశీయ సరకు ఎగుమతిదార్లకు కంటైనర్ల అద్దెలు బెంబేలెత్తిస్తున్నాయి. కొవిడ్ పరిణామాల కంటే ముందుతో పోలిస్తే, ఇవి 3 రెట్లకు మించి ఎక్కువగా ఉంటున్నాయి.
[01:33]అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ ఉన్న ప్రాంతానికి సమీపంలో కాల్పులు జరిగినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు.
[01:34] కథానాయిక మేఘా ఆకాశ్ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. తన ప్రియుడు సాయి విష్ణుతో ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరి పెళ్లి వేడుక ఆదివారం ఉదయం చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది.
[01:30]‘‘మత్తు వదలరా 2’ చిత్రాన్ని చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకోవడం చాలా ఆనందాన్నిస్తోంది’’ అన్నారు హీరో శ్రీసింహా. ఆయన.. సత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని రితేశ్ రానా తెరకెక్కించారు.
[01:29]కథానాయకుడు కార్తి 29వ చిత్రం ఖరారైంది. ‘తానక్కరన్’ అనే తమిళ సినిమాతో సత్తా చాటిన దర్శకుడు తమిళ్ దీన్ని తెరకెక్కించనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, ఐవీ ఎంటర్ టైన్మెంట్స్, బీ4యు మోషన్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.
అనకాపల్లి జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు డీఎస్పీలు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 47 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో ప్రతి శుక్రవారం విద్యుత్ లైన్ల నిర్వహణ పనులు చేపట్టాలనే నిబంధన అమలుచేస్తున్నామని సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. ప్రతి శుక్రవారం విద్యుత్ లైన్ల నిర్వహణ ఏ సమస్య ఉన్నా 1912కు కాల్ చేస్తే చాలు పీఎం జన్మన్లో ఆదివాసీలకు విద్యుత్ సరఫరా ‘ఆంధ్రజ్యోతి’తో ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ (విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో ప్రతి శుక్రవారం విద్యుత్ లైన్ల నిర్వహణ పనులు చేపట్టాలనే నిబంధన అమలుచేస్తున్నామని సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ గతంలో వేసవి సీజన్‌కు ముందు ఈ నిర్వహణ పనులు జరిగేవన్నారు. అయితే ఏడాది మొత్తం వదిలేసి, సీజన్లోనే చేయడం వల్ల సమస్యలు వస్తున్నాయని గుర్తించి, ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు చేపట్టాలని ఆదేశించామన్నారు. ఎక్కడైనా చెట్ల కొమ్మలు విద్యుత్ లైన్‌పై పడితే వెంటనే ట్రిప్ అయి సరఫరా నిలిచిపోతోందని, దీనిని సరిచేయడానికి గంటల సమయం పడుతోందన్నారు. ఇప్పుడు విద్యుత్ సరఫరా పది నిమిషాలు ఆగినా భరించలేని స్థితిలో వినియోగదారులు ఉన్నందున అసలు ఆ సమస్యే రాకుండా ముందుజాగ్రత్తగా ఇలా ప్రతి శుక్రవారం నిర్వహణ పనులు చేయిస్తున్నామన్నారు. దీనివల్ల ట్రిప్ సమస్యతో విద్యుత్ ఆగిపోయే ఘటనలు తగ్గుతున్నాయన్నారు. డిస్కమ్‌లోని అన్ని సర్కిళ్లలోను దీనిని అమలుచేస్తున్నామన్నారు. 150 ప్రాంతాల్లో పీఎం జన్మన్ ప్రతి ఇంటికీ విద్యుత్ సరఫరా ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా కొండల్లో నివసించే కొన్ని గిరిజన గ్రామాలకు విద్యుత్ లైన్లు వేయలేని పరిస్థితి ఉందన్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొండలపై నివాసాలను మార్చుకునే ఆదిమ జాతి గిరిజనులకు విద్యుత్ వెలుగులు అందించేందుకు పీఎం జన్మన్ పథకం అమలుచేస్తుండగా, అందులో సుమారు 150 మంది గిరిజన కుటుంబాలకు సోలార్‌తో పనిచేసే విద్యుత్ బల్బులు, ఫ్యాన్, చార్జింగ్ పాయింట్ వంటివి అందించామన్నారు. ఇవన్నీ ఒక ప్యాకేజీ కింద ఉంటాయని, ఒక్కొక్కటి రూ.50 వేలు విలువ చేస్తుందన్నారు. కేవలం సూర్యకాంతితోనే ఇవి పనిచేస్తాయన్నారు. సేవల్లో లోపం లేకుండా చూస్తున్నాం డిస్కమ్‌లో ఉండాల్సిన సిబ్బందిలో మూడో వంతు కొరత ఉందని, అయినా ఎక్కడా సేవలకు లోపం లేకుండా పనులు చేయిస్తున్నామని చెప్పారు. ఎటువంటి ఫిర్యాదులున్నా గృహ వినియోగదారులైతే ఆరు గంటల సమయంలోనే దానిని పరిష్కరిస్తున్నామన్నారు. విద్యుత్ వినియోగదారులు వారికి ఏ సమస్య ఉన్నా 1912 నంబరుకు కాల్ చేస్తే ఫిర్యాదు స్వీకరిస్తారని, దాని పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారని, ఫిర్యాదులను ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షిస్తుంటారని సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. అధికారులనే సంప్రతించండి విద్యుత్‌కు సంబంఽదించి ఎటువంటి పనులు ఉన్నా స్థానికంగా ఉండే ఏఈ కార్యాలయంలో సంప్రతించాలని, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో వారే సూచిస్తారని సీఎండీ వివరించారు. విద్యుత్ పనులు చేయిస్తామని దళారులు చాలామంది వెంటపడతారని, వారిని నమ్మవద్దని సూచించారు. అలా చేస్తే కాలయాపనతో పాటు ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందన్నారు.
నేపాల్‌లో నిర్వహిం చిన అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో మూడు బంగారు పథకాలను సాధించిన విజేతను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్, మాధవితో పాటు ఆర్వవైశ్యులు ఆదివారం ఘనంగా సత్కరించారు.
ఈ అమ్మాయి పేరు అతిథి శంకర్. ఈ అందాలబొమ్మది సామాన్యమైన నేపథ్యం కాదు. దక్షిణాది సినిమాను పానిండియా స్థాయికి తీసుకెళ్లిన గ్రేట్ డైరెక్టర్ శంకర్ ముద్దుల తనయే ఈ ముద్దుగుమ్మ. ఈమె మంచి గాయని కూడా. వరుణ్‌తేజ�
నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో సేవ్ విజయవాడ పేరుతో సిం గ్నగర్ గంగానమ్మ గుడి సెంటర్లో ఉచిత బైక్ రిపేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ధృవ వాయు స్వీయదర్శకత్వంలో నటించిన చిత్రం ‘కళింగ’. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ కలిసి నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా సినిమా సక్సెస్‌మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. హీరో, దర్శకుడు �
ఇటీవల జిల్లాలో వచ్చిన వర్షాలకు వరద ప్రవాహంతో అడవుల్లో ఉన్న పాములు వర దలకు కొట్టుకువచ్చి గ్రామాలపై పడ్డాయి. మరికొన్ని పాములు ఆ వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి సమీపం లోని పొలా ల్లోకి చేరాయి
మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక విద్యుత్ భవన్లో ఇంజినీర్స్ డే ఘనంగా నిర్వహించారు. సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ సాల్మన్‌రాజు, పలువురు ఇంజినీర్లు విశ్వేశ్వరయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.