Bigg Boss 9 బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ మరి కొద్ది రోజులలో ఫినాలే ఎపిసోడ్‌ని గ్రాండ్‌గా జరుపుకోనుంది. ప్రారంభంలో నిదానంగా నడిచిన ఈ రియాలిటీ షో, ఫ్యామిలీ వీక్ ముగిసిన తర్వాత అసలు రంగు చూపిస్తోంది.
[06:12]శ్రీవేంకటేశ్వరస్వామి ఎంతటి నైవేద్యప్రియుడో అంతే ఉత్సవప్రియుడు. అంతకంటే ఎక్కువ అలంకారప్రియుడు. అందుకే సర్వాలంకార శోభితుడైన శ్రీనివాసుడి దివ్యమంగళ స్వరూపాన్ని ఆపాదమస్తకం చూడాలంటే రెండు కళ్లు సరిపోవంటే అతిశయోక్తి కాదు.
[06:22]‘ప్రభుత్వ సర్వీసులో చేరగానే డాక్టర్లను నిర్లిప్తత ఆవహిస్తోంది. అర్థంలేని నిబంధనలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రోగులకు సేవ చేయడానికి ఉన్నారనే విషయాన్ని వారు మర్చిపోతున్నారు.
[06:21]త్రీ స్టార్ కంటే మించిన హోటళ్లలో పర్యాటక కార్యకలాపాలకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం వెసులుబాట్లు కల్పించాలని రాష్ట్ర స్టార్ హోటళ్ల అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
[06:20]ఐదేళ్లలోపు చిన్నారులకు సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 15 పోషకాహార పునరావాస కేంద్రాలు (ఎన్ఆర్సీ) ఏర్పాటు చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
[06:19]భూముల రీసర్వే సందర్భంగా వచ్చే అభ్యంతరాల పరిష్కార గడువు తహసీల్దార్ స్థాయిలో రెండేళ్లకు పొడిగించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు రాష్ట్ర అసెంబ్లీ పిటిషన్ల కమిటీ ఛైర్మన్, శాసనసభ ఉప సభాపతి కె.రఘురామకృష్ణరాజు తెలిపారు.
[06:17]డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైనతేయ గోదావరి తీరంలోని మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామంలోని ఆది బౌద్ధస్తూపం నేటికీ చెక్కు చెదరకుండా ఉంది.
[06:13]దేశ సంపదను పడవల్లో స్వదేశానికి తరలించుకుపోతున్న బ్రిటిష్‌వారిని మూడు చెరువుల నీళ్లు తాగించిన నరసింహస్వామి కథ ఇది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి యోగ నిద్రలో దర్శనమిస్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వర్తించకపోవడంతో.. ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వేసారిన ఓ రైతు, కాంగ్రెస్ కార్యకర్త వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నాడు.
పంటలు కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనలకు నిరసనగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా భోరజ్ వద్ద హైదరాబాద్- నాగ్‌పూర్ జాతీయ రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతుల పెద్ద ఎత్తున ఆందోళ
‘బాంచెన్.. మీ కాల్మొక్తా.. ఎలాగైనా మా పత్తి కొనండి సారూ’ అంటూ ఓ పత్తి రైతు అధికారి కాళ్లపై పడి వేడుకున్నాడు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌కు చెందిన రైతు మల్లేశ్ స్లాట్ బుక్ చేసుకొని గురువారం 90 క్వింట�
[06:09]దేశవ్యాప్తంగా కార్మికులందరికీ సామాజిక భద్రత, న్యాయం అందించేందుకు నాలుగు కార్మిక(లేబర్) కోడ్లను అమల్లోకి తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
[06:09]మద్యం కుంభకోణం కేసులో నిందితులకు వచ్చేనెల 5వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. శుక్రవారంతో నిందితులకు రిమాండ్ ముగియనుండడంతో వీరిని ఏసీబీ కోర్టు న్యాయాధికారి ముందు హాజరుపరిచారు.
[06:07]భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రచనలు కేవలం చరిత్ర ఒక్కటే కాదని, దేశ పరిణామ క్రమానికి మనస్సాక్షి లాంటి రికార్డులని లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు.
[06:07]బిహార్‌లో నీతీశ్‌కుమార్ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గం అవినీతి పరులు, నేరగాళ్లతో నిండి ఉందని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపక నేత ప్రశాంత్ కిశోర్ శుక్రవారం ఆరోపించారు.
[06:06]భారత వైమానిక దళానికి చెందిన తేజస్ యుద్ధవిమానం శుక్రవారం దుబాయ్‌లో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పైలట్.. వింగ్ కమాండర్ నమాంశ్ స్యాల్ ప్రాణాలు కోల్పోయారు.
[06:08]పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పర్రులోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఉప్పుగంటి రాజశ్రీ పుస్తక పఠనంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా వినూత్నంగా పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
[06:07]తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడు, తితిదే మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్నను ఐదో రోజైన శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారించింది.
Horoscope జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
[06:06]కేరళలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (సర్) కసరత్తును నిర్వహించాలన్న ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సమ్మతించింది.
[06:03]భారత్‌లో 2023 సంవత్సరంలో 15-49 ఏళ్ల వయసు గల మహిళల్లో ఐదో వంతు మంది సన్నిహిత భాగస్వామితో హింసకు గురవ్వగా, దాదాపు 30 శాతం మంది వారి జీవితకాలంలో ఈ సమస్య బారినపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.
[06:03]ఓ కేసు విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు దిల్లీ హైకోర్టు ఉపశమనం కల్పించింది. కొవిడ్ రెండో దశ సమయంలో గంభీర్‌పై దాఖలైన క్రిమినల్ ఫిర్యాదును దిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
[06:02]దాదాపు రెండు దశాబ్దాలుగా తన వద్దే కొనసాగించిన కీలకమైన హోంశాఖను బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఈ సారి భాజపా సీనియర్ నేత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీకి కేటాయించారు.
[06:03]మాజీ మంత్రి వివేకా హత్యకేసులో అప్రూవర్ షేక్ దస్తగిరిని జైల్లో బెదిరించిన కేసులో నాటి కడప జైలు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది.
[06:04]కొవిడ్ తర్వాత దేశవ్యాప్తంగా పిల్లల అక్రమ రవాణా (ట్రాఫికింగ్) పెరిగినట్లు సుప్రీంకోర్టు అడ్వొకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వెలువరించిన నవంబర్ సంచిక వెల్లడించింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటర్వ్యూ ఒకటి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నది. ‘యాదగిరిగుట్టను నేనే కట్టాను. భద్రాచలం, కీసర, బాసర.. ఇలా తెలంగాణలోని ఆలయాలన్నింటినీ నేనే కట్టాను’ అని చంద్ర
[05:58]సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడి.. దానిపై విచారణకు రాకుండా ఎగ్గొడుతున్న అధికారులపై సభాహక్కుల ఉల్లంఘన (ప్రివిలేజ్) కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
[05:57]అనిల్ ఛోక్రాను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ కోరుతూ ఛోక్రా పిటిషన్ వేశారు.