ఒంగోలు లోక్సభ స్థానంపై టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి మళ్లీ దృష్టి సారించారా? అన్న ప్రశ్నకు తాజా పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. అధికార పార్టీలోని ముఖ్యులతోపాటు కిందిస్థాయి నాయకుల్లో కొద్దిరోజులుగా ఇదే విషయం చర్చనీయాంశం గా మారింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు, నిన్నటికి నిన్న మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో వైవీ పర్యటనలు, ఆ సందర్భంగా చేసిన ప్రసంగాలు, ఆయన్ను ఉద్దేశించి మిగిలిన నాయకులు చేసిన వ్యాఖ్యానాలను పరిశీలిస్తే వైవీ చూపు ఒంగోలుపై ఉన్నట్లు అర్థమవుతుంది.
పెద్దపల్లి పట్టణంలోని సీతారామస్వామి దేవాలయం స్థలాన్ని కబ్జా చేసి ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నారని సమాచారం అందుకున్న దేవాదాయ శాఖ అధికారులు సోమవారం పనులను నిలిపి వేయించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన పాత గుట్ట లక్ష్మీనృసింహుడి దేవాలయ తిరుక ల్యాణబ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో పరిసమాప్తమయ్యాయి.
దళితబంధు పథకంలో భాగంగా ఒక్కో యూనిట్ కింద రూ.10లక్షలు ఇచ్చి.. మైనారిటీ కార్పొరేషన్ రుణాలు మాత్రం మండలం మొత్తానికి కలిపి రూ.6 లక్షలు ఇవ్వడం ఎంతవరకు న్యాయమంటూ మైనారిటీ ఆందోళనకు దిగారు.
ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని సాగనంపుదామని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఎం.రమేష్ అన్నారు. మోసపూరిత పాలన చేస్తున్న ఆపార్టీని తరిమికొట్టేవరకూ నిద్రపోయేది లేదన్నారు.
పెంటపాడు మండలంలో అలంపురం మేజర్ గ్రామ పంచాయతీ. మహిళా సర్పంచ్ తాతపూడి ప్రగతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె ఎస్సీ రిజర్వేషన్లో ఎన్నికయ్యారు. ఈ కారణమో ఏమో తెలియదు గాని సర్పంచ్కు అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది.
కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే మేడారం నుంచి తొలి అడుగు వేశానని, రాచరిక పాలనకు వ్యతిరేకంగా ప్రజల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తితో దోపిడీ స ర్కారుపై యుద్ధం చేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి ప్రకటించారు.
పేకాట శిబిరంపై మల్కాజ్గిరి ఎస్వోటీ పోలీసులు దాడిచేసి పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసి నగదను స్వాధీనం చేసుకొని ఘట్కేసర్ పోలీసుస్టేషన్లో అప్పగించారు.
సినీ పరిశ్రమకు విశాఖ ఎంతో అనుకూలమని ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య అన్నారు. సోమవారం ఆయన ఏయూలోని హిందీ భవన్ సెమినార్ హాల్లో వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత కాకపోవడాన్ని జీర్ణించుకోలేని ఓ విద్యార్థి జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాకినాడ 3వ డివిజన్ గొడారిగుంట శంతనపురి కాలనీకి చెందిన గంగిరి దుర్గారాం గోపాల్ (23) తాళ్లరేవు మండలం కోరంగిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదివాడు.
ఎత్తిపోతల పథకాలు సక్రమంగా పనిచేయక రైతులకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టీడీపీ హయాంలో 2005లో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పుష్కలంగా సాగునీరందడంతో ఏటా రెండు పంటలు పండించుకునేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి నిర్వహణను గాలికొదిలేశారు.
నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. టెండర్లు పూర్తయి నాలుగేళ్లు అవుతున్నా.. పనులు మాత్రం వేగవంతం కావడంలేదు. ఖరీఫ్ సీజన్ నాటికి కాలువ పనులు పూర్తిచేస్తామని అధికారులు, పాలకులు చెబుతున్నా.. నిధుల సమస్య కారణంగా జాప్యమవుతోంది.
గ్రామ పంచాయతీల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరయ్యాయి. ఆ నిధుల్లో 40 శాతం మేర మెటీరియల్ కాంపోనెంట్గా శాశ్వత పనులు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.
జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి జరగనున్న ఎఫ్ఏ-3 పరీక్షల (యూనిట్ -3)కు సంబంధించి మూల్యాంకనానికి సమయం పెంచాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహన్రావు సోమవారం ఓ ప్రకటనలో కోరారు.
గడిచిన 70 సంవత్సరాలుగా మా తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్న భూమిని కొంత మంది బడాబాబులు కుట్రపన్ని అక్రమంగా కాజేయాలని చూస్తున్నారంటూ రాయచోటి మండల పరిధిలోని దిగువ అబ్బవరం గ్రామం నక్కావాండ్లపల్లెకు చెందిన నాయిబ్రాహ్మణ కుటుంబాలు తమ గోడును వెల్లబుచ్చారు.
పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రెండున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ ధరణిబాబు తెలిపారు.