నందిగామలో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు ఆర్డీవో బాలకృష్ణ తెలిపారు. డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో మొత్తం 54 సేకరణ కేంద్రాలు, ఆరుమిల్లలను సిద్ధం చేసింది. బీపీటీ రకం క్వింటాకు రూ.2,320గా నిర్ణయించారు. తేమ శాతం 17 వరకూ ఉండవచ్చని స్పష్టం చేసింది.
ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేలవాలటంతో రైతులు దిగాలు పడుతున్నారు. కోతకు వచ్చిన పంటను కోసేందుకు కూలీల కొరతతో యంత్రాలపై ఆధారపడుతున్నారు. యంత్రాలు కూడా అందుబాటులో లేకపోవటంతో తలలు పట్టుకుంటున్నారు. కోత మిషన్‌తో కోయిద్దామన్నా భూమిలో గట్టిదనం లేక యంత్రాల చక్రాల కింద పంట నలిగిపోతుండటంతో పొలాలను పంటతో సహా చేలల్లోనే రైతులు వదిలేస్తున్నారు.
శిథిలావస్థలో భవనం, పెచ్చులూడుతున్న పైకప్పు, పొలాల్లో కాలకృత్యాలు, రాత్రిళ్లు పాములు, తేళ్లు.. ఇవీ ఆదోని ఎస్సీ కళాశాల హాస్టల్ దుస్థితి. విద్యార్థులు నిత్యం భయం భయంతోనే కాలం గడుపుతున్నారు. ప్రమాదం జరగకముందే హాస్టల్‌ను మరో భవనంలోకి మార్చాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రెండు తెలుగురాష్ర్టాలకు అత్యంత దగ్గరగా ఉన్న సూర్యలంక పర్యాటక కేంద్రం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ తెలిపారు
ధర్మపురి క్షేత్రంలో బుధవారం కార్తీక భక్తుల సందడి నెలకొం ది. స్థానిక లక్ష్మీ నృసింహ స్వామి, అనుబంధ రామలింగేశ్వ స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. గోదావరి నదిలో భక్తులు కార్తీక స్నానాలు ఆచరించారు.
: వీవోఏ(యానిమేటర్ల)లకు రావాల్సిన ఎనిమిది నెలల బకాయి వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ వెలుగు వీవోఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు
తెలంగాణ ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం వృద్ధుల సంరక్షణ పాలసీని రూ పొందిండానికి నిర్ణయం తీసుకుందని టాస్క్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అఽధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ అన్నారు.
మండల పరిధిలోని పెద్దనేలటూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈశ్వర దేవాలయంలో గణేశ, సుబ్రహ్మణేశ్వర, శివలింగం, పార్వతిదేవి, బసవేశ్వర, గోపుర కలశం, ధ్వజస్తంభ, నాగదేవతల విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం బుధవారం వైభవంగా నిర్వహించారు.
తెలగా అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో అమలాపురం గండువీధిలోని డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు కాపు కల్యాణ మండపం వద్ద బుధవారం కాపు కార్తీక వనసమారాధన ఘనంగా నిర్వహించారు.
నియోజకవర్గం, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి రాములు, జ్యోతి దేవిల సేవలు మరువలేమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవ హారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా సాగబోతు న్నాయి. ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతుండ డంతో ఆయా ఉపాఽధ్యాయ సంఘాలు తమకు ఇష్టమైన అభ్యర్థికి మద్దతుగా హైస్కూల్‌స్థాయి లో ప్రచారానికి శ్రీకారం చుట్టాయి.
కర్నూలు మార్కెట్ యార్డులో ఎండు మిర్చి ధర ఆకాశాన్నంటుతోంది. బుధవారం క్వింటా ఎండు మిర్చి ధర గరిష్ఠంగా 15,513, మధ్యస్థ ధర రూ.6,709, కనిష్ఠ ధర రూ.1,699ు రైతులకు లబించిందని మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు.
జిల్లాలో 1.57లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేపట్టగా ఇప్పటి వరకు 48వేల ఎకరాల్లో వరి కోతలు 30శాతం పూర్తి అయిన్నట్లు జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వంలో పింఛన్‌దారుడు ప్రతీ నెల పెన్షన్ తీసుకోవాల్సిందే. ఒక నెల అందుబాటులో లేకపోతే తర్వాత నెలలో ఆ పెన్షన్ వచ్చేది కాదు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఒక నెల పెన్షన్ నగదు తీసుకోకపోయినా ఆ మొత్తాన్ని తర్వాత నెల పెన్షన్‌తో కలిపి ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఒక్కో సందర్భంలో రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెలలో మొత్తం నగదును అందజేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
నిరక్షరాస్యురాలైన వృద్ధురాలికి చెందిన కోట్ల రూ పాయల ఆస్తిని కాజేసేందుకు రక్తసంబంధీకులే అడ్డదారిలో అక్రమ రిజిస్ట్రేషన్‌కు పాల్పడ్డారు. వృద్ధురాలికి చెందిన భూమిలో కొంతభాగమే కొనుగోలు చేసిన సదరు బంధువులు, మొత్తం భూమిని కాజేశారు.
అలవికాని హామీలు ఇచ్చి ప్ర జలను మోసం చేసి అధికారం చేజికిచ్చుకున్న సీఎం రేవంతరెడ్డిని రాజకీయంగా బొంద పెట్టేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని బీజేపీ జి ల్లా అధ్యక్షుడు నాగం వ ర్షితరెడ్డి అన్నారు.
కర్నూలు మార్కెట్ యార్డులో గిట్లుబాటు ధర లభిస్తుందనే నమ్మకంతో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా రైతులు పంట ఉత్పత్తులను విక్రయానికి తీసుకు వస్తున్నారు.
కొన్నేళ్ల క్రితం వర్షాధారంగా జొన్నలు, సజ్జలు వంటి పంటలు సాగయ్యేవి. ఆ తరువాత కాలంలో నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధి చెందింది. బీడు భూముల్లో కృష్ణమ్మ అడుగుపెట్టింది. నాటి నుంచే వరి సాగు ప్రారంభమైంది. నాడు కొన్ని వరి రకాలు మాత్రమే ఉండేవి.
రెవెన్యూ విభాగంలో ప్రధానంగా పట్టణంలోని వివిధ గృహాల కు సంబంధించిన ఆస్తి పన్ను వసూళ్లు, ఇంటి బదాలాయింపు (మ్యూటేషన), కొత్త ఇళ్లకు అసీ్‌సమెంట్ చేసి నెంబర్లు ఇవ్వడం వంటి విధులు ఉంటాయి.
ఇంజనీరింగ్ కళాశాల ఫీజు రీయింబర్స్మెంట్ టోకెన్లు ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా నిధుల విడుదలపై స్పష్టత రాకపోవడంతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు మదనపడుతున్నాయి.
నాగార్జునసాగర్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఈ నెల 23,24,25 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నెట్‌బాల్ బాల, బాలికల జట్లను బుధ వారం ఎంపిక చేసినట్లు జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్ తెలిపారు.
గోరుకల్లు వాటర్ గ్రిడ్ వాటర్ ప్లాంటు ద్వారా రాను న్న వేసవిలో బేతంచెర్ల, డోన మండలాల ప్రజలకు నీటి ఎద్దడి నివారణ కు శుద్దజలాన్ని సరఫరా చేస్తామ ని కలెక్టర్ రాజకుమారి గనియా తె లిపారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది సమయంలోనే సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు బాగుపడ్డాయి. వైసీపీ హయాంలో నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న పేద విద్యార్థులకు మేలు జరుగుతోంది. జిల్లాలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న ఎస్సీ వసతి గృహాలను మొదటి విడత కింద ఎపింక చేశారు. పది ఎస్సీ వసతి గృహాలు, కురుగుంటలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో మౌలిక వసతులను మెరుగు...
విద్యార్థులు గ్రంథాలయాలను వినియోగించుకోవాలని, పుస్తక పఠనంతోనే విజ్ఞానవంతులవుతామని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
వస్తువుల్లో ఎంత శాతం వెండి ఉందో అన్న విషయాన్ని ఆరా తీసి కొనుగోలు చేయాలి. కొన్ని వస్తువుల్లో 85శాతం వెండి ఉంటుంది. మరికొన్నింటిల్లో 75, 65, 55, 45శాతం కూడా ఉంటుంది.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులను తొలగించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. బుధవారం కరీం నగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
వైసీపీ హయాంలో నాటి సీఎం జగన పర్యటనలకు కాన్వాయ్ ఏర్పాటు చేసిన వాహనదారులు అద్దె బిల్లుల కోసం కళ్లకు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. సీఎం కాన్వాయ్‌తోపాటు ఎమ్మెల్సీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలకు వాహనాలను సమకూర్చారు. వాహనాల అద్దెతోపాటు డ్రైవర్ బత్తా సొమ్ము రాలేదు. కొవిడ్ సమయంలో రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి, మృతదేహాలను తరలించడానికి పలువురు వాహనాలను సమకూర్చారు. నాలుగేళ్లు గడిచినా వారికి బిల్లులు చెల్లించలేదు....
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎక్సైజ్ సీఐ మాధవిలత అన్నారు. బుధవారం జమ్మికుంట పట్టణంలోని కాకతీయ హైస్కూల్లో గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు ఏర్పా టు చేశారు.
అయ్యప్ప దీక్షలో శబరిమల వెళ్లే భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త ప్రకటించింది. అన్ని డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించినట్లు ఆర్టీసీ ఆర్ఎం ఎన్ సుచరిత ఒక ప్రకటనలో తెలిపారు.
జోనల్ స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో మండలంలోని కురుగుంటలోని అంబేడ్కర్ జూనియర్ కశాళాలకు చెందిన విద్యార్థినులు సత్తాచాటారు. వారిని బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ నాగజ్యోతి, ఇతర అధ్యాపకులు అభినందించారు. ప్రిన్సి పాల్ మాట్లాడుతూ.. ఈనెల 14,15 తేదీల్లో కడప జిల్లా పులివెందులలోని అంబేద్కర్ గురుకుల కళాశాలో జోనల్ గ్రేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ జరిగింద న్నారు.
హంద్రీనీవా కాలువకు కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. నిత్యం వర్షాలపైనే ఆధారపడి పంట వస్తుందో రాదోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసిన రైతు ఆనందంతో పరవశించిపోతున్నాడు. హంద్రీనీవా కాలువ పరిధిలో పన్నేండేళ్లలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రైతులు కాలువలో నీటిని తరలించుకుని పంటలను సాగు చేస్తున్నారు. కాలువ సమీపంలో ఉన్న పంట పొలాలన్నీ కళకళలాడుతున్నాయి. ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు, బెళుగుప్ప మండలాల్లో ఈ ఏడాది 30వేల ఎకరాలకు పైగా పంటలను సాగు చేశారు. కాలువ ..
నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్ర బాబుకు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ వినతి పత్రం అందజేశారు. బుధవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్ర బాబును ఎమ్మెల్యే కలసి నియోజక వర్గంలోని ముఖ్యమైన సమస్యలపై వివరించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26న దేశవ్యాప్త నిరసనలో అన్ని వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని ట్రేడ్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కడారి సునీల్, వేల్పుల కుమారస్వామి, ఐ కృష్ణ, తోకల రమేష్, కే విశ్వ నాథ్, వెంకన్న పిలుపునిచ్చారు.
సైబర్ నేరాలపట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం డీ ఎస్పీ యు.నాగరాజు అన్నారు. స్థానిక ఏ1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు.
స్థిరాస్తి వ్యాపారుల్లో పలువురు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ఎలాంటి అనుమతీ లేకుండా లేఅవుట్లు వేస్తున్నారు. జిల్లాలోనే అత్యధిక అనుమతులు లేని లేఅవుట్లు ఉన్నది చీరాల నియోజకవర్గంలోనే. కొందరు కనీసం ల్యాండ్ కన్వర్షన్ రుసుము కూడా చెల్లించడం లేదు. దీంతో కొనుగోలుదారులు నష్టపోతున్నారు. తరువాత విక్రయించేవారిని అడిగినా ప్రయోజనం ఉండడం లేదని వాపోతున్నారు.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. కొప్పెరపాడు టీడీపీ నేతలు స్పెషల్ డ్రైవ్‌ను బుధవారం నిర్వహించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు వి.కొప్పెరపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు గ్రామ కూడలీలో ప్రత్యేకంగా సభ్యత్వ నమోదు ప్రారంభించారు. ఒక్కరోజే గ్రామానికి చెందిన 250 మంది కార్యకర్తలుగా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు.
సాంకేతిక పరిజ్ఞానం బాగా పె రిగి పోయింది. కూర్చున్న చోటు నుంచే ప్ర పంచాన్ని సందర్శిస్తున్నాము. ఇటువంటి పరిస్థి తుల్లోనూ అనంతపురంరూరల్ మండలంలో ని నరసనాయనికుంట గ్రామస్థులు సెల్‌ఫోన నెట్వర్క్ సరిగి పనిచేయక చాల అవస్థలు ప డుతున్నారు. గ్రామం ఏర్పాటై ఇప్పటి వందే ళ్లకు పైగానే కావస్తోంది. గ్రామ స్థాయి నుంచి పంచాయతీ స్థాయికి చేరింది. గ్రామంలో ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ కాలనీ లున్నాయి. దాదాపు 550 కుటుంబాలు ఉండగా, రెండు వేలకు పైగా జనా భా ఉంది.
జిల్లాలోని చాలామంది విద్యార్థులు విశాల్ లాంటి పరి స్థితినే ఎదుర్కొంటున్నారు. చదువులో ముందున్నా, పరీక్షల్లో మార్కులు బాగా సాధించి మంచి ర్యాంకులు తెచ్చుకున్నా ఉద్యోగ సాధనలో మాత్రం విఫలమవుతున్నారు.
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును బుధవారం ఇంకొల్లు టీడీపీ నాయకులు తాడేపల్లిలో కలిసారు. విజనరీ లీడర్ అవార్డును పొందిన సందర్భంగా ఏలూరిని కలిసి పుష్పగుచ్ఛమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.
గాంధీ ప్రవచించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ రాష్ట్ర చైర్మన్ గున్న రాజేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గానాల ప్రభాకర్‌రెడ్డి, బుర్ర దశరథగౌడ్ తెలిపారు.
సంచలనాల కోసం కాకుండా, ప్రజా ప్రయోజనాలకు దోహదపడే కథనాలతో మీడియా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన కే శ్రీనివా్‌సరెడ్డి సూచించారు.
ముండ్లమూరు మండలంలోని నూ జెండ్లపల్లి చెరువు తొట్టి భూమిఆక్రమణకు గురైంది. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి ఇతర చేతుల్లోకి వెళ్లి పోయింది. దీనివెనుక వైసీపీ నాయకుల హస్తముందని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి.