[04:28]బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ చివరికి చేతులెత్తేసిందని రాజ్యసభ సభ్యుడు, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు.
[04:27]రాష్ట్ర అభివృద్ధిలో రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యానికి తీసుకెళ్లే బాధ్యత ఆర్ అండ్ బీ శాఖ అధికారులు, ఇంజినీర్లపై ఉందన్నారు.
[04:21]ప్రతిరోజూ ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు ఉపాధ్యాయులు పాఠాలు బోధించడానికి ఉండే సమయం 6 గంటలు.. అంటే 8 పీరియడ్లు.. క్షేత్రస్థాయిలో మాత్రం పాఠాలు చెప్పడానికి సగం, అంతకంటే తక్కువ సమయమే కేటాయించగలుగుతున్నామని నాలుగో వంతు టీచర్లు తేల్చిచెప్పారు.
[04:16]ఆరోగ్య విశ్వవిద్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ జాతీయ వైద్య కమిషన్‌కు, గవర్నర్లకు భారత రాష్ట్ర సమితి నేత హరీశ్‌రావు లేఖ రాయడంపై మంత్రి దామోదర్ రాజనర్సింహ గురువారం రాత్రి స్పందించారు.
[04:18]తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ వార్డులు, సర్పంచుల ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాల ఫలితాలను నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
[04:12]అంతర్జాతీయ డిజిటల్ అరెస్టు ముఠాను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. భీమవరానికి చెందిన విశ్రాంత ప్రొఫెసర్ శర్మ నుంచి సైబర్ నేరగాళ్లు దఫదఫాలుగా రూ.78 లక్షలు దోచుకున్నారు.
[04:31]మద్యం మత్తులో సహజీవన భాగస్వామితో గొడవపడిన ఓ వ్యక్తి ఆమెను గొంతు నొక్కి చంపాక మృతదేహాన్ని కారులో వదిలేసి.. ఇంట్లోకి వెళ్లి గాఢ నిద్రలోకి జారుకున్నాడు.
[04:27]అమరావతిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు.
[04:26]మద్యం కుంభకోణం కేసులో అప్రూవర్లుగా మారతామనే కారణంతో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ నిందితులు, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి(ఏ-2), ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక అధికారి దొడ్డా వెంకట సత్యప్రసాద్(ఏ-3) హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలలో ఇదే కేసులో నిందితుడు, వైకాపా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అనుబంధ పిటిషన్లు దాఖలుచేశారు.
[04:25]అగ్నిమాపక, సీఐడీ విభాగాల్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించింది.
[04:23]ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ జయమంగళ వెంకటరమణ ఇచ్చిన లేఖపై శాసనమండలి ఛైర్మన్ మోషేనురాజు నిర్ణయం తీసుకోకుండా ఏడాదిపాటు పెండింగ్‌లో ఉంచడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.
సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి గురువారం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఎన్నికలు నిర్వహించే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని గ్రామాల్లో తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసి
గ్రామ పంచాయతీల మొదటి విడత ఎన్నికలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. గ్రామ పోరుకు ప్రధాన పార్టీలు సై అనడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఖమ్మం, భద్రాద్రి జిల్ల�
గ్రేటర్లో వాహనాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం మహానగరంలో జనాభా సుమారు 1.4కోట్లు ఉంటే.. వాహనాల సంఖ్య కోటికి చేరింది. వీటికి తోడు నిత్యం బయటి నుంచి నగరానికి 30వేల వరకు వాహనాలు వచ్చ�
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులను కలవాలంటే రోజుల తరబడి ఎదురు చూడాల్సిందే. సామాన్య ప్రజలు, పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు పీసీబీ అధికారులను కలవడం గొప్ప విషయంగా మారింది. ముఖ్యమంత్రి, మంత్రు�
తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన వీరుడు కేసీఆర్, పదేళ్ల పాలనలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపిన మహోన్నత వ్యక్తి ఆయన అని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ�
[04:11]బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న యువతి చికిత్సకు అవసరమైన సహాయం అందించేందుకు మానవతావాదులు ముందుకు వస్తున్నారు. గురువారం వరకు రూ.7.1లక్షలు అందించారు.
[04:11]రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలపై ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీయూఎఫ్ఐడీసీ)కు రూ.770 కోట్లు విడుదల చేసింది.
[04:05]కర్ణాటక కాంగ్రెస్‌లో అధికార పంపిణీ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రుల సమక్షంలోనే పరిష్కరిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.
[04:05]ఆర్థిక రంగంలో భారత్ ప్రబల శక్తిగా ఎదుగుతోందని, శాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన రంగాల్లో దూసుకుపోతున్న మన దేశం వైపు సంపన్న అగ్రదేశాలు చూస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు.
[04:10]ఆ బాలుడికి 13 ఏళ్లు. ఎనిమిదో తరగతి. బాలికకు 14 ఏళ్లు.. తొమ్మిదో తరగతి. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణకు లోనయ్యారు. కలిసి బతుకుదామని ఇంటి నుంచి పరారయ్యారు.
[04:10]వింజో బెట్టింగ్ యాప్ నిర్వాహక సంస్థ డైరెక్టర్లు సౌమ్యాసింగ్ రాఠోడ్, పావన్ నందాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం రాత్రి బెంగళూరులో అరెస్టు చేశారు.
[04:12]మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా గురువారం 10 రాష్ట్రాల్లోని వైద్య కళాశాలల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు.
[04:02]చైనా, జపాన్ల స్థాయికి చేరడమే లక్ష్యంగా.. రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా ‘తెలంగాణ రైజింగ్-2047 పాలసీ’ డాక్యుమెంట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్ర యువతలో నైపుణ్యాలను తీర్చిదిద్దాలన్నారు.
[03:50]ప్రైవేటు స్థల వివాదానికి సంబంధించి కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్య తీసుకోరాదో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలన్న ఆదేశాలను అమలు చేయని హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్‌పై గురువారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
[03:57]సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు ఘటనకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు తీరుపై హైకోర్టు గురువారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
[03:55]‘తెలంగాణ.. ఈ రోజు కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు.. భారతదేశ భవిష్యత్తుకు ఓ ఆశాకిరణం. స్థిరమైన విధానాలు, ప్రపంచ స్థాయి అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, వ్యాపార సౌలభ్యం, పటిష్ఠమైన ఆవిష్కరణల వ్యవస్థలు.. అన్నింటికీ మించి మెరుగైన జీవన నాణ్యత.. ఈ ఐదు అంశాలు తెలంగాణను ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చాయి.
[03:51]గ్రూప్-2, 2015 నోటిఫికేషన్లో నియమితులైన ఉద్యోగులకు గురువారం హైకోర్టులో ఊరట లభించింది. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నియామకాలు చెల్లవంటూ ఈ నెల 18న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేస్తూ గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
[03:59]ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓఎస్డీగా వ్యవహరించిన రాజశేఖర్‌రెడ్డిని గురువారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించి వాంగ్మూలం నమోదు చేసింది.
[03:49]లంచాలిచ్చి తమకు అనుకూలంగా నివేదికలు తెప్పించుకున్నారన్న ఆరోపణలపై దిల్లీ సీబీఐ విభాగం నమోదుచేసిన కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది.
[03:47]రాష్ట్రంలోని కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి అనుమతులు రావడంలో జాప్యం జరుగుతోందని... కేంద్ర మంత్రిత్వ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేసినా సహకారం లభించడం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
[04:03]పరకామణిలో చోరీ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న అధికారులు తనను విచారణకు పిలిచినందున శుక్రవారం విజయవాడలో హాజరు కాబోతున్నట్లు రాజ్యసభ సభ్యుడు, తితిదే మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
[03:57]గ్రామ పంచాయతీల విభజన, పునర్నిర్మాణంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఇవి అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.