[05:57]బ్రిటన్‌కు చెందిన ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐఎన్ఎస్ఏ).. కృత్రిమ మేధ ఆధారిత ఉపాధి వేదిక అయిన క్రియూ సంస్థతో కలిసి ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ ఎంప్లాయబిలిటీ కౌన్సిల్ (ఐఎన్ఎస్ఈసీ) ఏర్పాటు చేసింది.
[05:57]ఖగోళ పరిశోధనలో పరస్పరం సహకరించుకునే ఏర్పాటులో భాగంగా ఉపగ్రహాల నియంత్రణతోపాటు వాటితో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం కోసం గ్రౌండ్ స్టేషన్లు ఏర్పాటు చేసే విషయంలో ఒకరికొకరు సహకారం అందించుకోవాలని భారత రష్యాలు నిర్ణయించాయి.
[05:56]స్పెయిన్‌లోని దాదాపు 81 వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, రేడియో, టీవీ ఛానళ్లకు మెటా కంపెనీ 48.1 కోట్ల యూరోల (సుమారు రూ.4,900 కోట్ల) నష్టపరిహారం చెల్లించాలని స్పెయిన్ రాజధాని మాద్రీద్లోని మర్కంటైల్ కోర్టు గురువారం ఆదేశించింది.
[05:56]భారత నౌకా దళానికి చెందిన గస్తీ నౌక ఐఎన్ఎస్ సుకన్య శ్రీలంక రాజధాని కొలంబో పోర్టులో లంగరేసింది. భారత్-శ్రీలంక మధ్య సద్భావనా కార్యక్రమాల్లో భాగంగా తమ తీరానికి చేరిన కమాండర్ సంతోష్ కుమార్ నేతృత్వంలోని 101 మీటర్ల పొడవైన ఈ నౌకకు శ్రీలంక నౌకాదళం మంగళవారం సంప్రదాయ రీతిలో స్వాగతం పలికింది.
[05:55]శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించలేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నిర్దిష్ట గడువులోగా సమ్మతి/అభిప్రాయం తెలియజేయకపోతే ఆ బిల్లులను ఆమోదించినట్లుగా భావించడమూ రాజ్యాంగంలో లేదని, అధికారాల విభజన సూత్రానికి ఇది వ్యతిరేకమని పేర్కొంది.
[05:52]వారసత్వంగా వచ్చిన భూమిని విక్రయించుకుందామంటే తహసీల్దారు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఓ రైతు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన గురువారం చోటు చేసుకుంది.
చలికాలంలో పెరుగు తినకూడదని.. తింటే జలుబు చేస్తుందని కొంతమంది భావిస్తుంటారు. రుచికరమైన పెరుగును శీతాకాలంలో తినొచ్చా?లేదా? మరీ ముఖ్యంగా పిల్లలకు పెట్టొచ్చా అనే సందేహాలు రావడం సహజం.
దేశీయ కుబేరుడిలో ఒకరైనా అదానీ గ్రూపు.. వ్యవసాయ రంగం బిజినెస్ నుంచి వైదొలిగారు. ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్(గతంలో అదానీ విల్మార్)లో తనకున్న మిగతా వాటాను రూ.2,500 కోట్లకు విక్రయించింది.
[05:52]భార్య, ఇద్దరు పిల్లలను కిరాతకంగా హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ వికారాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి డా.సున్నం శ్రీనివాస్‌రెడ్డి గురువారం సంచలన తీర్పు వెలువరించారు.
రాష్ట్రంలో 26,326 చెరువుల్లో పంపిణీ చేయాల్సిన 84.62 కోట్ల ఉచిత చేపపిల్లల పంపిణీ గాను ఇప్పటివరకు 26 జిల్లాల్లో 11.31 కోట్ల చేపపిల్లలను విడుదల చేసినట్లు మత్స్యశాఖ పేర్కొంది.
[05:50]ర్ణాటకలో అధికార కాంగ్రెస్‌లో రాజకీయం వేడెక్కింది. 2023 విధానసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన నాటి నుంచీ రెండున్నరేళ్ల తర్వాత అధికార పంపిణీ ఉంటుందని ప్రచారంలో ఉంది.
[05:51]ప్రమాదంలో రెండు మీటర్ల ఇనుపచువ్వ గుండె, ఊపిరితిత్తుల మీదుగా చొచ్చుకెళ్లిన ఓ వ్యక్తిని తిరుపతి రుయా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు మూడు గంటల పాటు శ్రమించి బతికించారు.
[05:48]వారసత్వపు ఆస్తిలో వాటా దక్కకుండా చేస్తామని బెదిరించి.. పదమూడేళ్ల బాలికను వివాహం చేసుకున్న కేసులో యువకుడిని, అతని తల్లిదండ్రులను గుంటూరు దక్షిణ డివిజన్ డీఎస్పీ భానోదయ అరెస్టు చేశారు.
‘మావోయిస్టులు చేసేది హింస అయితే, వారిని చంపేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ప్రతి హింసే కదా! తుపాకీకి తుపాకీ పరిషారం కాదు. మనుషులను చంపే అధికారం చట్టం ఎవ్వరికీ ఇవ్వలేదు’ అని పలువురు వక్తలు స్పష్టంచేశ
జాతీయ లాజిస్టిక్స్ విధానంతోపాటు ప్రధానమంత్రి గతిశక్తి, మల్టీమాడల్ మౌలిక సదుపాయాలు కల్పించడంతో గడిచిన పదేండ్లలో దేశీయ లాజిస్టిక్స్ రంగం అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని కేంద్ర మంత్రి జయంతి చ
[05:44]బౌద్ధమతాన్ని తాను అనుసరిస్తున్నానని.. అయితే అన్ని మతాలపై తనకు విశ్వాసం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్.గవాయ్ పేర్కొన్నారు.
హిడ్మా దారుణ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు కీలక నేతలు లొంగుబాట పట్టారు. మరో రెండురోజుల్లో పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు రాజిరెడ్డి, ఆజాద్ సిద్ధంగా ఉన్నట్టు నిఘా వర్గాలు �
ఏరోస్పేస్ తయారీ కంపెనీల్లో ఒకటైన జెహ్ ఏరోస్పేస్ కొత్తగా హైదరాబాద్‌కు సమీపంలోని కొత్తూరు వద్దవున్న హోరైజన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది.
[05:42]దేశంలోని పలు నగరాలు రాను రాను కాంక్రీటు వనాలుగా మారుతుండగా.. కేరళలోని కొచ్చిన్‌లో నివసిస్తున్న ఎ.వి.పురుషోత్తమ కామత్ తన ఇంటిని జీవవైవిధ్యం తొణికిసలాడే పచ్చని అడవిలా మార్చారు.
[05:41]సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 కంటే ముందే బహుమితీయ పేదరికాన్ని సగానికి తగ్గించేందుకు భారత్ కృషి చేస్తున్నప్పటికీ, దేశంలో చాలామంది చిన్నారులు కనీస సేవలను అందుకోవడంలో ఇంకా అవాంతరాలు ఎదుర్కొంటున్నారని యునిసెఫ్ పేర్కొంది.
[05:40]నారింజ పండ్లలో కన్నా క్యాప్సికంలో ‘సి’ విటమిన్ అధిక మోతాదులో ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండటానికి ఎక్కువ స్థాయిలో ‘సి’ విటమిన్ అవసరం.
గత నెల దేశీయ మౌలిక రంగంలో వృద్ధిరేటు సున్నాకు పరిమితమైంది. గడిచిన 14 నెలల్లో 8 కీలక రంగాల పనితీరు ఇంత అధ్వానంగా ఉండటం ఇదే తొలిసారి. గురువారం విడుదలైన కేంద్ర గణాంకాల్లో అక్టోబర్‌లో కోర్ ఇండస్ట్రీస్ గ్రోత�
[05:36]మేధావులు ఉగ్రవాదులుగా మారితే మరింత ప్రమాదకరమని సుప్రీంకోర్టుకు దిల్లీ పోలీసులు తెలిపారు. దిల్లీ అల్లర్ల కేసు (2020)లో ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్, ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లను వ్యతిరేకిస్తూ పోలీసుల తరఫున గురువారం అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్వీ రాజు వాదనలు వినిపించారు.
[05:35]రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించేలా ఉన్నత ప్రమాణాలతో కొత్త క్రీడా ప్రాంగణాల ఏర్పాటుతో పాటు పాతవాటినీ ఆధునికీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.
[05:35]కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తుల రద్దీ నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు స్వామి దర్శనానికి రోజువారీ స్పాట్ బుకింగ్‌లను గరిష్ఠంగా 5,000కు పరిమితం చేసింది.
[05:34]శాసనసభలు చేసిన బిల్లులకు ఆమోదం తెలిపేందుకు గవర్నర్లకు, రాష్ట్రపతికి గడువు విధించలేమంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం వెలువరించిన తీర్పుపై న్యాయ నిపుణులు, కొన్ని విపక్ష పార్టీల నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి.
[05:34]రాజస్థాన్ రాజధాని జైపుర్‌లో అత్యంత భద్రత కలిగిన సివిల్ లైన్స్‌లోకి గురువారం ఓ చిరుత రావడం కలకలం రేపింది. సీఎం సహా ప్రముఖులు నివాసం ఉండే ఈ ప్రాంతంలో.. మొదట అక్కడి ఓ పాఠశాలలోకి చిరుత ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందింది.
[05:33]ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలరాంపుర్ వైద్యులు తోకలాంటి శరీర భాగంతో పుట్టిన ఏడాదిన్నర చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స చేసి దానిని తొలగించారు. లఖ్‌నవూకు చెందిన ఈ బాలుడికి నడుము భాగంలో పుట్టుకతోనే చిన్న తోకలాంటిది ఉంది.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమవుతున్నది. ఈ నెల 25 లేదా 26వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
[05:32]దేశవ్యాప్తంగా మావోయిస్టులు హింసా మార్గాన్ని వీడి ప్రధాన స్రవంతిలోకి వస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. త్వరలోనే వామపక్ష తీవ్రవాదం నుంచి దేశం విముక్తి కానుందని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు.
[05:31]జమ్మూకశ్మీర్‌లోని కశ్మీర్ టైమ్స్ పత్రికా కార్యాలయంలో తూటాలు లభ్యమవడం కలకలం సృష్టిస్తోంది. రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎస్ఐఏ) జరిపిన సోదాల్లో జమ్మూలోని సంస్థ కార్యాలయంలో ఏకే 47 రైఫిల్ కాట్రిడ్జ్‌లు, మరికొన్ని పిస్తోలు తూటాలు దొరికాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
[05:30]దేశంలో భూమి సర్వేల రూపకల్పనలో లోపాన్ని అధిగమించడానికి ఎన్.ఐ.టి.-రవుర్కెలా పరిశోధకులు కృత్రిమ మేధను (ఏఐ), డ్రోన్లనూ మేళవించి ‘భూ మానచిత్ర’ అనే భూ నక్షా (నేవిగేషన్) వ్యవస్థను రూపొందించారు.
[05:30]మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో భారతీయ చీతా ‘ముఖీ’ ఐదు కూనలకు జన్మనిచ్చినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గురువారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
[05:33]అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పుల్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు రంపచోడవరం ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
[05:32]పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థం గన్నవరం నియోజకవర్గంలోని మూడు ప్రధాన మండలాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలన్నదే తన అభిమతమని, ఈ విషయాన్ని మంత్రి లోకేశ్‌తో పాటు మంత్రివర్గ ఉపసంఘానికి నివేదించానని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు.
[05:31]మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సీనియర్ సభ్యులు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డిలు పోలీసుల అదుపులో లేరని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) విష్ణుతేజ గురువారం హైకోర్టుకు నివేదించారు.
క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నామనే ప్రభుత్వ ప్రకటనలకు, వాస్తవాలకు పొంతన ఉండటం లేదు. స్పోర్ట్స్ యూనివర్సిటీకి అనుబంధంగా వరంగల్ నగరంలో స్పోర్ట్స్ స్కూల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. క్రీడా మంత్రి వాక�
[05:28]పశ్చిమ బెంగాల్లో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌కు లేఖ రాశారు.
[05:27]బ్రిటన్‌కు చెందిన ఆయుధాల వ్యాపారి, పలాయనంలో ఉన్న ఆర్థిక నేరగాడు సంజయ్ భండారీ నిందితుడిగా ఉన్న మనీలాండరింగ్ కేసులో వ్యాపారవేత్త, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభియోగపత్రం దాఖలు చేసింది.
[05:29]ఆంధ్రప్రదేశ్ పే అండ్ ఎకౌంట్స్ ఆఫీసు(వర్క్స్ ఎకౌంట్స్) ఎంప్లాయీస్ అసోసియేషన్ బైలాలో మార్పులకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
[05:29]కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వ విధానాల వల్ల శబరిమలలో అయ్యప్ప స్వామి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ధ్వజమెత్తారు.
[05:29]‘పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు మళ్లించి నల్లమలసాగర్‌కు అనుసంధానం చేయడం వల్ల ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని కరవు ప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతుంది.
[05:28]మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ముఖ్యనేత తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్‌జీ సహా నిర్బంధించిన మావోయిస్టులను వెంటనే కోర్టులో హాజరు పరచాలని సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్), సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఎంసీపీఐ(యు), ఫార్వర్డ్‌బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, ఎస్‌యుసీఐ(సి)లు సంయుక్తంగా ఒక ప్రకటనలో డిమాండ్ చేశాయి.
[05:28]తప్పుడు ధ్రువపత్రాలతో తన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం భవానీనగర్‌కు చెందిన బంగారయ్య కోరారు.
[05:27]ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో విజయవాడ, తిరుపతిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్లాంట్లలో యూనిట్ విద్యుత్తు ధరను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది.
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సమరానికి నేటి నుంచి తెరలేవనుంది. క్రికెట్లో అగ్రశ్రేణి జైట్లెన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య నవంబర్ 21 నుంచి 2026 జనవరి దాకా అభిమానులకు పసందైన టెస్టు క్రికెట్ విందును అందించే�
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర రాబడి తిరోగమనంలో పయనిస్తున్నది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలు చేపట్టి రెండేండ్లయినా.. రాష్ట్ర ఆదాయ వనరులు పెరగడం లేదు.
ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్.. మరో యువ ఆటగాడు ఆయూష్ శెట్టితో క్వార్టర్స్ పోరులో తలపడనున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరూ తమ ప్ర�
[04:43]రాష్ట్రంలో విద్యారంగం ఉన్నతికి రేవంత్‌రెడ్డి సర్కారు ప్రాధాన్యం ఇస్తోందని... చుక్కా రామయ్య స్ఫూర్తితో విద్యా విధానంలో మరిన్ని మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
[04:47]దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం వీలైనంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
[04:46]దండకారణ్యంలో మావోయిస్టు పార్టీని దశాబ్దాలుగా నడిపించిన కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా అంత్యక్రియలు ముగిశాయి. ఏపీలోని రంపచోడవరం నుంచి గురువారం ఉదయం హిడ్మా, ఆయన భార్య మడకం రాజే మృతదేహాలను స్వగ్రామం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పువర్తికి తీసుకువచ్చారు.
[04:44]తెలంగాణలో ప్రజాప్రభుత్వం దృఢసంకల్పంతో అన్నదాతల సంక్షేమానికి కృషి చేస్తోందని... సంక్షోభ సమయాల్లోనే కాదు, వారి అభివృద్ధి పయనంలో తోడుగా ఉంటున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
[04:38]మేము పొరుగు రాష్ట్రాలతో కాదు.. న్యూయార్క్, సింగపూర్, దుబాయ్ నగరాలతో పోటీపడుతున్నామని, రైజింగ్ తెలంగాణ-2047 పేరుతో హైదరాబాద్‌ను చైనా+1 నగరంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
[04:36]బూటకపు ఎన్కౌంటర్లతో మావోయిస్టులను చంపే హక్కు ఎవరికీ లేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే గతంలో జరిగిన ఎన్కౌంటర్లన్నీ బూటకమేనని అనిపిస్తోందన్నారు.
[04:34]ఆపరేషన్ కగార్ విషయంలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ కేంద్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు బాధ్యతారాహిత్యమని, తీవ్రంగా ఖండిస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
[04:39]వేళాపాళా లేని నిద్రాహారాలు.. కాలు కదపని కొలువులు.. నిత్యం ఒత్తిడితో సతమతమయ్యే జీవనశైలి.. వెరసి ఈతరం స్థూలకాయం బారిన పడుతోంది. ఆడామగా అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇదో ఎడతెగని సమస్యలా మారింది.
[05:08]‘తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) ప్రీమియర్ అగ్రిఫుడ్స్, వైష్ణవి డెయిరీ, భోలేబాబా డెయిరీలు సరఫరా చేసిన నెయ్యిలో వెజిటబుల్ ఆయిళ్లు కలిసి ఉన్నాయని, అది కల్తీనెయ్యి అని మైసూరులోని సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్ నిర్ధారించిన తర్వాత కూడా.. ప్రీమియర్ అగ్రిఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డెయిరీలను 2024 వరకూ, భోలేబాబాను 2022 అక్టోబరు వరకూ నెయ్యి సరఫరాదారులుగా ఎందుకు కొనసాగించారు?
[05:07]శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం తిరుమల చేరుకున్నారు. అంతకుముందు ఆమె తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
[05:05]విశాఖ జిల్లా భీమిలి బీచ్‌కు అత్యంత సమీపంలో సీఆర్‌జడ్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన కాంక్రీట్ గోడ మిగిలిన భాగాన్ని తొలగించేందుకు మరో రూ.31.97 లక్షలను జీవీఎంసీకి చెల్లించామని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి, ఆమెకు సంబంధించిన అవ్యాన్ రియల్టర్స్ కంపెనీ ప్రతినిధులు గురువారం హైకోర్టుకు నివేదించారు.
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎమ్ఆర్ఎస్) నేషనల్ స్పోర్ట్స్ మీట్ 2025లో తెలంగాణ గిరిజన విద్యార్థులు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు.
యువ బ్యాటర్ హృషికేశ్ సింహా ధనాధన్ ఆటతీరుతో అదరగొట్టాడు. ముస్తాక్ అలీ టీ20 టోర్నీ కోసం హెచ్‌సీఏ నిర్వహించిన ప్రాబబుల్స్ మ్యాచ్‌ల్లో హృషికేశ్ సెంచరీ సహా అర్ధసెంచరీతో విజృంభించాడు.
బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫీకర్ రహీమ్ అరుదైన ఘనతను అందుకున్నాడు. స్వదేశంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ముష్ఫీకర్ (106) శతకంతో కదం తొక్కాడు.
దేశంలో జనాభా దామాషాకు అనుగుణంగా రాజ్యాంగ బద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అది అనివార్యం కూడా. బీసీలకు సంబంధించి అమలు చేస్తున్న రిజర్వేషన్ కేవలం ఉద్యోగ, ఉపాధి రంగాలక�
రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలనతో ప్రజల పక్షపాతిగా బలపడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు పేరిట బలహీనపర్చాలని పాలకపక్షాలు కుట్రలు చేస్తున్నాయని బీఆర్�