ఉమ్మడి జిల్లాలో వారం రోజుల క్రితం వరకు ఉక్కపోత ఉండగా, ఆ తరువాత వాతావరణంలో అనూహ్యంగా ఏర్పడిన మార్పులతో చలి పెరిగింది. శీతాకాలం ప్రారంభమైనా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతోపాటు ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు.
ఆరోగ్య శ్రీ పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికీ ఉచిత వైద్యాన్ని అందిస్తున్నట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి అన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రతి నెలా ఒకటోతేదీ నాడు జీతం అందుకునేవారు. కాని ప్రస్తుతం వారు తమ ఖాతాల్లో ఎపుడు జీతాలు జమ అవుతాయోనని ఎదురు చూడాల్సి వస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఉండేదికాదు. అపుడు సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నా, ఠంచనగా ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేవారు. ఇపుడు అందుకు విరుద్దంగా జీతం ఎప్పుడు పడుతుందో తెలియని దుస్థితిని ఎదుర్కొంటున్నారు.
ఇళ్లులేని నిరుపేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంలో 17 జగనన్న లేఔట్లు ఏర్పాటు చేశారు. వీటిని అనువుగాని చోట వేయడంతో సమస్య ఏర్పడింది. ఇటువంటిచోట్ల చాలామంది ఇళ్లు నిర్మించుకోవడానికి మొగ్గు చూపడంలేదు.
‘ రాప్తాడు నియోజకవర్గంలో నాలుగు ప్రాజెక్టులు ఏర్పాటు చేసి సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చావ్. వాటి నిర్మాణాలకు శంకుస్థాపన చేసి ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకూ కనీసం ఎకరం కూడా సేకరించలేదు. ఉత్త మాటలే తప్పా... చేసిందేమీ లేదు. నీవోక అసమర్థ ఎమ్మెల్యేవి..’ అని ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడని, పెద్దఎత్తున నిధులు తీసుకువచ్చి నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు.
ఉల్లిపాయకి బంగాళదుంపకు వ్యత్యాసాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలుసుకోలేకపోతున్నారని, ఇటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడం మన దౌర్భాగ్యం అని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ఎద్దేవా చేశారు.
సత్యసాయి బాబా సేవాస్ఫూర్తితో అందిస్తున్న వైద్యసేవలు అమోఘమంటూ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ అభినందించారు. శ్రీసత్యసాయి మొబైల్ ఆసుపత్రి 18వ వార్షికోత్సవాన్ని స్థానిక సాయిహీరా గ్లోబల్ కన్వెన్షన సెంటర్లో ఆదివారం నిర్వహించారు.
Srisailam శ్రీశైల మహా క్షేత్రం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు త్రయోదశి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు.
రాష్ట్రంలో ఏకైక జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రమైన కొలనుభారతి అమ్మవారిని లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ రెడ్డి దంపతులు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
EV 2 Wheelers వచ్చే ఏడాది చివరికల్లా దేశీయంగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సేల్స్ పది లక్షల మార్కును దాటతాయని గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ సీఈఓ హైడర్ ఖాన్ చెప్పారు.
వైద్యారోగ్యశాఖలో 2020లో చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు బయటపడుతున్నారు. నకి‘లీలలు’ వెలుగు చూస్తున్నాయి. దీంతో అటు ఉద్యోగాలు పొందిన వారితోపాటు ఇటు నియామకాల సమయంలో పనిచేసిన ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. వైద్యారోగ్యశాఖలో నియామకాలపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో కలెక్టర్ దినే్షకుమార్ సమగ్ర విచారణకు ఆదేశించారు.
జిల్లాలో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతు న్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వి ద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన పరీక్ష ఫీజు రాయి తీ అక్కరకు రాకుండా పోయింది. సర్కారు విధించిన నిబంధనలతో ఒక్కరికి కూడా వర్తించకుండా పో యింది.
6 గ్యారెంటీల్లోని మిగతా వాటిని సీఎం రేవంత్రెడ్డి ( CM Revanth Reddy ) వెంటనే అమలు చేయాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Thalasani Srinivas Yadav ) వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఆరు గ్యారెంటీలను ఎలా అమలు పరుస్తుందో ఆ పార్టీ నాయకులు ప్రజలకు తెలియజేయాలని భారతీయ జనతాపార్టీ అభ్యర్థి ఏపీ మిథున్రెడ్డి డిమాండ్ చేశారు.
పనికి ఆహార పథకం కింద డొంక దారిని కొంత మేర కంకర, మరికొంత మట్టి రోడ్డు వేసి వదిలేశారు. 25ఏళ్లుగా మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చకపోవడంతో రెండు మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.